Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode చేనేత చీర ఇచ్చినందుకు లక్ష్మీ విహారికి థ్యాంక్స్ చెప్తుంది. విహారి లక్ష్మీతో నువ్వు నా కోసం చాలా కష్టాలు పడుతున్నావ్ అందుకే కనీసం ఒక్క సారి అయినా నీ కళ్లలో నవ్వు చూడాలి అని మీ నాన్న నేసిన చీర నీకు ఇచ్చా అని అంటాడు. చీర చూడగానే మా నాన్న చేసిందని అర్థమైంది.. ఆ చీర ముట్టుకోగానే మా నాన్న నాతోనే ఉన్నట్లు ఉందని అంటుంది.

Continues below advertisement

ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మీ. ఇన్ని రోజుల్లో మొదటి సారి నీ సంతోషం చూశా.. ఇకపై ఎప్పటికీ నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి.. అందుకే ఈ దత్తత కార్యక్రమం చేశా.. అది కాస్తా అయిపోతే నువ్వు ఈ ఇంటి మనిషి అయిపోతావ్.. ఇక నిన్నుఎవరూ వెళ్లనివ్వరు.. రేపు నువ్వు ఆ చీర కట్టుకొనే రావాలి అంటాడు. 

సహస్ర అంబికతో లక్ష్మీకి సరోగసీ సక్సెస్‌ అయిందని చెప్పారు కానీ ఏ లక్షణాలు లేవు ఏంటి అని అంటుంది. కొందరికి లేటుగా లక్షణాలు వస్తాయని పద్మాక్షి అంటుంది. దానికి సహస్ర సరోగసీ సక్సెస్ అయినా గర్భం నిలవలేదని అనిపిస్తుందమ్మా అని సహస్ర చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ సహస్ర అని పద్మాక్షి కోప్పడుతుంది. ఇక పద్మాక్షి కూడా తనకు అనుమానం ఉందని కచ్చితంగా గర్భం నిలిచిందా లేదా అని తెలుసుకుందామని అందుకు బ్లడ్ టెస్ట్ చేద్దామని అంటుంది. అందుకు పద్మాక్షి ఓ ఐడియా చెప్తుంది. 

Continues below advertisement

పద్మాక్షి, సహస్ర ఇద్దరూ లక్ష్మీ గదికి వెళ్తారు. లక్ష్మీ పడుకొని ఉంటుంది. పద్మాక్షి లక్ష్మీ చేతికి జలగలు పట్టేలా పెడుతుంది. జలగలు పట్టడం వల్ల లక్ష్మీకి సహస్ర బ్లడ్ తీసినా లక్ష్మీకి ఆ విషయం తెలీదు. సహస్ర బ్లడ్ తీసేస్తుంది. తర్వాత వసుధ అటుగా వచ్చి లక్ష్మీ గది డోర్ తెరిచి ఉందేంటి అని లక్ష్మీ దగ్గరకు వస్తుంది. సహస్ర, పద్మాక్షి ఇద్దరూ అక్కడే దాక్కుంటారు. యమున వెళ్లిపోయిన తర్వాత ఇద్దరూ బయటకు వెళ్తారు.

యమున మామయ్యతో అంబిక మీతో మాట్లాడటం నేను విన్నాను. మీరు ఎవరి వైపు ఉంటారు అని అంటుంది. నేను అందరికీ నచ్చిన నిర్ణయమే తీసుకుంటా అని అంటారు. పంతులు వచ్చి ఎల్లుండి ఉదయం దత్తతకి ముహూర్తం ఉందని అంటారు. భక్తవత్సలం పంతులుతో ఒక శుభవార్త చెప్పారు మరో శుభవార్త చెప్పండి అని అంటారు. దానికి పంతులు అంతా సిద్ధం వాళ్లు కూడా వస్తారు అంటారు. అందరూ ఏంటా అని అనుకుంటారు. ఇంతలో ఇంటికి బంధువులు వస్తారు. భక్తవత్సలం వాళ్లని మర్యాదగా ఆహ్వానించి మర్యాదలు చేస్తాడు. 

ఆ అబ్బాయి ఎవరా అని అందరూ అనుకుంటారు. భక్తవత్సలం అంబికను పిలిపిస్తాడు.  అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. భక్తవత్సలం ఇంట్లో వాళ్లతో వీళ్ల సంబంధం బాగుంది అని పెళ్లి చూపులకు ఏర్పాటు చేశా అంటారు. ఎవరికి పెళ్లి చూపులు అని అడిగితే అంబికకు అని చెప్తారు. అందరూ చాలా సంతోషపడతారు. అంబిక మాత్రం బిత్తరపోతుంది. అబ్బాయి అంబిక తనకు బాగా నచ్చిందని చెప్పి అంబికతో మాట్లాడి నీకు నేను ఓకేనా అని అంటే అంబిక అతన్ని లాగిపెట్టి కొట్టి పూలు స్వీట్స్ అన్నీ విసిరి కొడుతుంది. నాకు చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏంటి.. ఈ తింగరి సంత ఏంటి.. ఏరా నీకు నేను ఓకే చెప్పాలా వెళ్లండి అని అంటుంది. ఇంకొక్క క్షణం నా ముందు ఉంటే అందర్నీచంపేస్తా అని అంబిక అనడంతో అందరూ వెళ్లిపోతారు. 

అంబిక తండ్రితో ఏ ఉద్దేశంతో ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అని అంటుంది. నీ పెళ్లి నా బాధ్యత  అమ్మ అని భక్తవత్సలం అంటే ఇన్ని రోజులు మీ బాధ్యత మీకు గుర్తు రాలేదా.. అన్నయ్య చనిపోయిన తర్వాత నేను బిజినెస్‌లు చూసుకున్నప్పుడు మీకు మీ బాధ్యత గుర్తు రాలేదా.. అని అంటుంది. ఆ రోజు నీకు అడిగా వద్దు అన్నావు అంటారు. ఆ రోజు అడిగినప్పుడు ఈ రోజు ఎందుకు అడగలేదు అని అంటుంది. నా జీవితం నాకు తెలుసు.. నా నిర్ణయం నా ఇష్టం లేకుండా నా జీవితంలో ఏ మార్పు మీరు చేయలేరు చేయనివ్వను అని అంబిక అందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.