Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి కావేరిని హాస్టల్‌లో చేర్పిస్తాను అంటాడు. నేను వెళ్లను ఇక్కడే మీ ఇంట్లో పనులు చేసుకుంటూ మీతో ఉంటాను అంటుంది. దానికి విహారి, లక్ష్మీలు నువ్వు ఇక్కడే ఉండి పనులు చేసుకోవడం కాదు.. బాగా చదువుకోవాలి అని చెప్తారు. ఎప్పటికీ నీ వెనకే మేం ఉంటా అని అంటారు. దాంతో కావేరి వెళ్లడానికి ఒప్పుకుంటుంది.
అంబిక పద్మాక్షి దగ్గరకు వచ్చి నువ్వు కూడా లక్ష్మీ మాయలో పడిపోయావు అనిపిస్తుంది. నువ్వు కూడా దత్తత గురించి అడ్డుకోలేదు అని అంటుంది. దానికి పద్మాక్షి నీకు ఓ ప్లాన్ ఉంటే నాకు ఓ ప్లాన్ ఉంది అని అంటుంది. నీ ప్లాన్ నీకు ఉంటే ఇలా శత్రువుని నెత్తిమీద పెట్టుకోవడమా.. నీ ప్లాన్.. అని అడుగుతుంది. దానికి పద్మాక్షికి నేను దత్తతకి ఒప్పుకున్నా నా ప్లాన్ నాకు ఉంది.. కానీ నువ్వు అడ్డుకోవాల్సింది ఆపాల్సింది.. నన్ను కాదు నాన్నని అని అంటుంది. నాన్నని ఆపలేం అని అంటుంది. లక్ష్మీ విషయంలో ఆవేశపడకు.. నువ్వు ఆవేశంగా ప్లాన్ చేసిన ప్రతీ సారి రివర్స్ అయింది అని అంటుంది. ఆవేశంగా కాకుండా ఎమోషనల్గా నాన్నతో మాట్లాడు అని పద్మాక్షి చెప్తుంది.
అంబిక నాన్నతో మాట్లాడుతా అని వెళ్తుంది. తండ్రి దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. ఏమైంది అంబిక ఇలా ఏడుస్తున్నావ్ అని అడుగుతాడు. ఏ విషయానికి వెనకడుగు వేయవు,, అధైర్యపడవు.. మరి నువ్వు ఇలా ఏంటి అని అడుగుతాడు. మన కుటుంబం కోసం నేను ఇంత కష్టపడుతున్నా నన్ను వదిలేసి ఆ లక్ష్మీని అందలం ఎక్కిస్తున్నావ్ ఇదేనా నా విలువ.. నీ కడుపున పుట్టిన కూతుర్ని నమ్మడం లేదు.. బయట నుంచి వచ్చిన లక్ష్మీని నమ్ముతున్నావ్.. నేను ఎందుకు దత్తత వద్దు అన్నా వినలేదు అని అంటుంది. నా మీద ప్రేమ ఉంటే దత్తత వెనక్కి తీసుకోండి.. ఆ లక్ష్మీకి సపోర్ట్ చేయడం ఆపేయండి అని అడుగుతుంది. అన్నీ నేను ఆలోచిస్తా అని భక్తవత్సలం అంటాడు. అంబిక సరే అంటుంది. ఇక మీ మాటలు అన్నీ యమున వింటుంది.
లక్ష్మీ ఫ్రెష్ అయి వచ్చే సరికి ఎదురుగా ఓ చీర ఉంటుంది. అది పట్టుకొని లక్ష్మీ తండ్రిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిపోతుంది. దాని మీద ఉన్న మూడు చిలుకలు చూసి గతంలో తను నువ్వు నేను అమ్మ నాన్న అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతుంది. విహారి లక్ష్మీని చూసి హ్యాపీగా వెళ్లిపోతాడు. సహస్ర లక్ష్మీకి సరోగసీ చేశారు కానీ ఇంత వరకు ఏ లక్షణాలు లేవు అని ఆలోచిస్తుంది. ఇంతలో సహస్రకు విహారికి పెళ్లి చేయడానికి సాయం చేసిన డాక్టర్ కాల్ చేసి పది లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తుంది. ఇప్పటికిప్పుడు పదిలక్షలు ఇవ్వకపోతే మీ ఇంట్లో నిజం చెప్పేస్తా అని అంటుంది.
సహస్ర చాలా కంగారు పడుతుంది. డాక్టర్ బెదిరింపులకు భయపడిన సహస్ర వెంటనే పది లక్షలు రెడీ చేసి ఎవరూ చూడకుండా ఇంటి బయట ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తుంది. అయితే సహస్ర డాక్టర్కి డబ్బు ఇవ్వడం మేడ మీద నుంచి విహారి చూస్తాడు. ఇంకోసారి ఇలా ఈ అత్యవసరాలు నీకు రాకూడదు అని సహస్ర వార్నింగ్ ఇస్తుంది. సహస్ర గదికి వస్తుంటే విహారి అడ్డుకొని ఎవరు అని అడుగుతాడు. నా ఫ్రెండ్ బావ అని అంటుంది. మరేంటి ఇంటికి రాకుండా అక్కడికక్కడే మాట్లాడి పంపేస్తున్నావ్ అంటాడు. ఏదో అర్జెంట్ పని ఉండి అలా మాట్లాడిందని అంటుంది. విహారి తను లేడీ డాక్టర్ కదా.. సహస్ర కంగారు చూస్తుంటే ఇదేదో తెలుసుకోవాల్సిన విషయంలా ఉంది.. రేపే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి అని అనుకుంటాడు. విహారి బయటకు వెళ్తాడు. లక్ష్మీ కూడా వస్తూ ఉంటే ఇద్దరూ ఒకర్ని ఒకరు ఢీ కొట్టుకొని చూసుకుంటారు. లక్ష్మీ తనకు చీర ఇచ్చినందుకు విహారికి థ్యాంక్స్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.