Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి తాతయ్య, నానమ్మల షష్టిపూర్తి అట్టహాసంగా జరుగుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక విహారి ఉంటే ఆస్తిలో తనకు అడ్డొస్తాడని అంబికి విహారి అడ్డు తొలగించాలని అనుకుంటుంది. ఇక విహారి, సహాస్రల నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతాయి. మరోవైపు ప్రకాశ్ కనకం, విహారి పెళ్లిని రాజమండ్రిలో చేయాలని అనుకుంటాడు. విహారిని రేపే పెళ్లి వెళ్లాలని అంటాడు.
మరోవైపు ఆది కేశవ్ తన కూతురు కనకం కోసం బంగారం కొనడానికి గోల్డ్ షాప్‌కి వస్తారు. షాప్‌లో మేనేజర్ ఆదికేశవ్ వాళ్లని చూసి మీ స్థాయికి సంబంధించినవి ఇవి కాదని వేరే దగ్గర చూపించని చీప్ చేస్తాడు. ఆది కేశవ్, అతని భార్య వాళ్లని తిడతారు. బ్యాగ్‌లో డబ్బు తీసి ఆదికేశవ్ చూపించి ఇవి సరిపోతాయా ఇంకా కావాలా అని అడుగుతాడు. దాంతో అతడు క్షమాపణ చెప్పి బతిమాలుతాడు. బట్టలు చూసి స్థాయి అంచనా వేయొద్దని చీవాట్లు పెడతారు. ఇక కనకం, ఆది కేశవ్, గౌరీలు బంగారం చూస్తారు. అన్నీ నచ్చాయని కనకం అంటే ఆది కేశవ్ అల్లుడుకి ఫొటోలు పెట్టమంటాడు. ఇక అక్కడున్న వారు ఫోటోలు తీయొద్దని కావాలంటే వీడియో కాల్ చేయమని అంటారు. ఇక కనకం వీడియో కాల్ చేస్తుంది. అది ప్రకాశానికి వెళ్తుంది. ప్రకాశ్ కంగారు పడతాడు. సమయానికి విహార్ లేడది అనుకొని లిఫ్ట్ చేయడు. ఇక కనకం మెసేజ్ చేస్తుంది. దాంతో ప్రకాశ్ విహారికి కాల్ చేస్తాడు.
ప్రకాశ్: రేయ్ చిన్న ప్రాబ్లమ్ వచ్చిందిరా నాకు కాబోయే భార్య గోల్డ్ షాప్లో ఉంది. గోల్డ్ సెలెక్షన్ చేయమని అంటుంది. నువ్వు నాకు సాయం చేయరా నీ సెలక్షన్ బాగుంటుంది కదా లైన్ కలుపుతా నువ్వు సెలక్ట్ చేయరా. నా పరువు కాపాడరా.
విహారి: సరేరా కలుపు
ప్రకాశ్ విహారికి, కనకానికి లైన్ కలుపుతాడు. కనకం సెలక్ట్ చేయమని విహారికి చెప్తుంది. విహారి అన్నీ చూసి తనకి నచ్చినవి చెప్తాడు. ఇంతలో విహారి దగ్గరకు సహస్ర, అతని తల్లి వస్తారు. మాట్లాడాలి అని అంటే విహారి కాల్ మాట్లాడి వస్తానని అంటాడు. ప్రకాశ్‌తో విహారి నువ్వు అన్నీ నాతోనే చేయిస్తున్నావ్ చివరకు తాళి కూడా నాతోనే కట్టిస్తావా అని అడుగుతాడు. ప్రకాశ్ మనసులో జరగబోయేది అదే అని అంటాడు.
మరోవైపు విహారి ఇంట్లో అందరూ చీరలు ముందు వేసుకొని సందడి చేస్తుంటారు. అంబిక, పద్మాక్షిలు సందడి చేస్తారు. యమున వాళ్ల దగ్గరకు వెళ్తే అత్త కాదాంబరి సూటిపోటి మాటలు అంటుంది. నగల వాడికి ఫోన్ చేయమని యమున అంబికకు చెప్తే అంబిక చేయదు. ఇంతలో విహారి రాజమండ్రిలో తన ఫ్రెండ్ పెళ్లి ఉందని అంటాడు. దాంతో పద్మాక్షి ఎల్లుండి పూజ ఉందని చెప్తుంది. ఇక సహస్ర బావకి సపోర్ట్ చేస్తుంది. సహస్ర విహారికి తన కోసం బట్టలు నగలు సెలక్ట్ చేయమని అంటుంది. ఇక యమున చెప్పడంతో విహారి సెలక్ట్ చేయడానికి ఉండిపోతాడు. అంబిక తన అక్క పద్మాక్షికి రెచ్చగొడుతుంది. ఇక సహస్ర చూపించిన రింగ్ వాటిని చూసి విహారి సహస్ర, కనకం సెలక్షన్ ఒకేలా ఉందని అనుకుంటాడు. ఇక పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోతామని సహస్ర అంటే పద్మాక్షి వద్దని అంటుంది. దానికి కాదాంబరి కూతురు దూరం అయిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని మీ అమ్మకి ఆ బాధ వద్దని అంటుంది. దానికి విహారి మేం పర్మినెంట్‌గా వదిలి వెళ్లిపోమని కొన్ని రోజులు కొన్ని పనులు చూసుకొని వచ్చేస్తాం అని అంటాడు. మరోవైపు ప్రకాశ్ వస్తాడు. వాళ్లతో సహస్ర కూడా వస్తా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘కార్తీకదీపం 2’ సీరియల్: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దీప – జ్యోత్స్న కు బుద్ది చెప్పిన నెటిజెన్లు