Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode పద్మాక్షి విహారి, సహస్ర హనీమూన్ కోసం బట్టలు సర్దుతుంది. ఇంతలో అంబిక, యమున అక్కడికి వస్తారు. యమున పద్మాక్షితో లక్ష్మీని నేనే ఇంటికి తీసుకొచ్చా కదా అని అంటుంది. నువ్వు దాన్ని తేవడం వల్లే కదా ఇందంతా జరిగింది అని పద్మాక్షి కోప్పడుతుంది.
యమున పద్మాక్షి వదిన నేను చెప్పేది పూర్తిగా వినండి అని లక్ష్మీ వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మీరు అంటున్నారు కాబట్టి విహారి, సహస్రలను హనీమూన్‌కి అమెరికా పంపుతున్నాం కదా అక్కడే శాశ్వతంగా ఉంచేద్దాం అని అంటుంది. అంబిక ఇదేదో తనకు కలిసి వచ్చేలా ఉందని తాను పంపేద్దాం అని అంటుంది. యమున పద్మాక్షితో ఇక్కడ బిజినెస్‌లు మళ్లీ అంబిక చూసుకుంటుంది అని అంటుంది. దానికి పద్మాక్షి నా కూతురు నాకు దూరం అవుతుంది అన్న మాట నా నోట మాట రాకుండా చేసేస్తుంది కానీ వాళ్ల సంతోషం కోసమే అంటున్నావ్ కాబట్టి సరే అని అంటుంది.
పద్మాక్షి సహస్రకు విషయం చెప్తానని అంటే యమున వద్దని వాళ్లు అక్కడికి వెళ్లిన తర్వాత సహస్రకి చెప్పి విహారిని ఒప్పిద్దామని అంటుంది. ఇన్నాళ్లకు నువ్వు తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఇదే అని అంబిక అంటుంది. యమున మనసులో నా కొడుకు నాకు దూరం అయినా పర్లేదు కానీ విహారి ఆ లక్ష్మీకి దూరంగా ఉండాలని అనుకుంటాడు. మరోవైపు విహారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చారుకేశవ, లక్ష్మీలతో ఇదంతా ఎప్పుడు చేశారు అని అడుగుతాడు. చారుకేశవ మొత్తం చెప్తాడు. విహారి లక్ష్మీని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాడు. లక్ష్మీ కూడా హగ్ చేసుకోబోయి సహస్ర మాత్రమే విహారి భార్య అని అన్న యమున మాట గుర్తొచ్చి ఆగిపోతుంది. విహారి లక్ష్మీతో నువ్వు నా అదృష్టం లక్ష్మీ అని అంటాడు.
విహారి రాత్రి లక్ష్మీ తన కోసం చాలా చేస్తుంది తన వెంటే ఉండి గెలిపిస్తుంది కానీ నేను ఇంట్లో తనని గెలిపించుకోలేకపోతున్నా అని నిజం చెప్పడం లేదు మా బంధాన్ని గెలిపించాలి అని లక్ష్మీ దగ్గరకు వెళ్తాడు. సహస్రకు మెలకువ వచ్చి చూసి బావ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తుంది. విహారి లక్ష్మీని నిద్ర లేపి చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్లాలని పిలుస్తాడు. ప్రకాశ్ నిద్ర లేచి రేయ్ నా భార్యని ఎక్కడికి తీసుకెళ్తున్నావ్‌రా అని అడుగుతాడు. విహారి ప్రకాశ్‌ని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. సహస్ర చూస్తుంది. విహారి లక్ష్మీని తీసుకొని వెళ్లడం చూసిన సహస్ర రేపు నాతో హనీమూన్‌కి రావడం ఇష్టం లేక ఇలా లక్ష్మీని తీసుకెళ్లిపోతున్నాడని అనుకుంటుంది. ఇదేదో పెద్ద విషయంలా ఉందని పద్మాక్షికి చెప్తుంది. యమున కూడా విని నేను వస్తానని అంటుంది. నువ్వు తెచ్చిన లక్ష్మీ కదా మాపాట్లు చూడు అని అంటుంది.
విహారి లక్ష్మీని ఓ చోటుకి తీసుకెళ్లి నీకు ఏమైంది.. ఫోన్ లిఫ్ట్ చేయవు.. నాతో మాట్లాడవు.. ఏమైంది నీకు అని అడుగుతుంది. ఏం లేదు మీరు నాకు తాళి కట్టారు అంతే కానీ భార్యాభర్తల బంధం లేదు కదా మనమధ్య. మనం దూరంగా ఉంటేనే మనకు మంచిది అని అంటుంది. ఓనిజం ఒక కుటుంబాన్ని ముక్కలు చేస్తుంది అంటే అది మడుగున పడిపోయిన పర్లేదు.. మీ భార్య సహస్రమ్మే దయచేసి నన్ను వదిలేయండి అని అంటుంది. విహారి లక్ష్మీని లాగిపెట్టి కొట్టి ఏంటి వదిలేయాలా అని అడుగుతాడు. మీరు నాకు తాళికట్టినట్లే సహస్రమ్మకి కట్టారు. ఆ తాళితో ఓ కుటుంబమే ముడి పడి ఉంది.. నా తాళితో ఏముంది అయినా మనం ఎప్పుడూ భార్యాభర్తల్లా ఉన్నాం. మనం మధ్య ఏం లేదు.. నన్ను వదిలేయండి విహారి గారు అని అంటుంది.
విహారి లక్ష్మీతో మన మధ్య ఏం లేదా మరి ఇదంతా ఏంటి అని అంటే ఏంటి అంతే నా మీద మీకు జాలి. మీరు అంటే నాకు అభిమానం అంతే అని అంటుంది. లక్ష్మీ ఏడుస్తుంది. విహారి కూడా ఏడుస్తాడు. ఏంటి నువ్వు అంటే నాకు జాలా.. నీ మీద జాలి చూపించా అనుకుంటున్నావా.. తప్పు అంతా నాదే నేను తీసుకున్నా నిర్ణయాన్ని.. నా నిర్ణయాన్ని.. నా ఎమోషన్స్‌ని నీకు చెప్పకపోవడం నా తప్పే.. నేను ఏ పని నీ మీద జాలితో చేయలేదు ప్రేమతో చేశా అని చెప్పేలోపు పద్మాక్షి, యమున, సహస్రలు అక్కడికి వస్తారు.
పద్మాక్షి కోపంగా లక్ష్మీని ఇంటికి లాక్కెళ్తుంది. లక్ష్మీని లాగిపెట్టి కొడుతుంది. అందరూ హాల్లోకి వస్తారు. ఈటైంలో లక్ష్మీని బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం నీకు ఏంటి బావ అని సహస్ర అడుగుతుంది. దానికి విహారి తను ఆ ఆఫీస్‌లో పని చేస్తుంది. అందుకే మాట్లాడాలని తీసుకెళ్లా అందులో తప్పు ఉందా అని అడుగుతాడు. అవును తప్పే అని పద్మాక్షి అరుస్తుంది. దానికి పెళ్లి అయింది నీకు పెళ్లి అయింది అయినా అర్ధరాత్రి మీరు బయట కలిశారు అంటే మేం ఏం అనుకోవాలి అని అడుగుతుంది. విహారి పిలిస్తే వెళ్లడానికి నీకు సిగ్గు లేదా అని అంబిక తిడుతుంది. ప్రకాశ్ విహారితో విహారి తప్పు అంతా నీదే నా భార్యతో మాట్లాడాలి అని అంటే నన్ను పిలిచి ఉంటే మిమల్ని ఎవరూ తప్పుగా అనుకోరు కదా అంటాడు. పద్మాక్షి విహారితో అంబిక, సహస్ర కూడా మీ ఆఫీసే వాళ్లని ఎందుకు పిలవలేదు అని అంటుంది. లక్ష్మీ అందరికీ చేతులు జోడించి క్షమాపణ చెప్తుంది. విహారి లక్ష్మీతో నువ్వు ఎందుకు క్షమాపణ చెప్తావ్. నీ బాస్‌గా నేను పిలిచాను నువ్వు వచ్చావ్ అంటాడు. దాంతో యమున విహారి మీద అరుస్తుంది. నువ్వు ఈ ఇంటి వారసుడివి నీకు ఈ ఇంటి బంధాలు, బిజినెస్‌లతో పాటు ఇంటి పరువు కూడా నువ్వే చూసుకోవాలి. బయట మమల్ని ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి అందుకే జాగ్రత్తగా ఉండు అని మందలిస్తుంది. వసుధ లక్ష్మీని తీసుకెళ్లిపోతుంది.
ప్రకాశ్ లక్ష్మీ గదిలో లేదని గుర్తించి లక్ష్మీ బయట ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని బాధ పడుతుంటుంది కదా ఇప్పుడే ల్యాప్‌టాప్ చెక్ చేయాలని లోపలికి వెళ్లి ల్యాప్ టాప్ తీస్తాడు. లక్ష్మీ జాబ్ గురించి శాలరీ అన్నీ తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇంతలో లక్ష్మీ వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.