Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode తన పుట్టింట్లో తనకు మొదటి సారి ఒడిబియ్యం వేడుక జరగడం అది కూడా పుట్టింటికే కోడలు అయిన కూతురి చేతుల మీదుగా జరగడంతో పద్మాక్షి చాలా ఎమోషనల్ అయిపోతుంది. అందరూ మాట్లాడుతూ ఉంటే అంబిక, లక్ష్మీని పక్కకి తీసుకెళ్తుంది. 

లక్ష్మీతో కోపంగా మా కంపెనీలో నీ పెత్తనం ఏంటే.. నా డబ్బు నేను తీసుకోవడానికి నీ పర్మిషన్ ఏంటే అని అంబిక అంటుంది. దానికి లక్ష్మీ ఇప్పుడు అన్ని బిజినెస్‌లకు విహారి గారే సీఈవో మీరు జస్ట్ బోర్డ్ మెంబరు మాత్రమే సో మీకు ఏం కావాలి అన్నా విహారిగారినే అడగాలి అంటుంది. దానికి అంబిక లక్ష్మీ వెనకుండి నువ్వేం చేయిస్తున్నావో నాకు తెలుసు నీ ఆటలు ఎక్కువ కాలం చెల్లవు అని అంబిక అంటుంది. మీరు వెనక ఉండి ఏం చేస్తున్నారో నాకూ తెలుసు అని లక్ష్మీ అంటుంది. వంద కోట్లు స్కామ్ మీరు వెనకుండి చేయించారు అని కూడా నాకు తెలుసు అని లక్ష్మీ అంటుంది. 

అంబిక షాక్ అయి పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అని అంటుంది. నేను అలా మాట్లాడే దాన్ని అయితే ఈ విషయం విహారి గారికి చెప్పేదాన్ని అని అంటుంది. ఆధారాలు లేకుండా మాట్లాడకు అని అంబిక అంటే ఆధారాలు ఉన్నాయి అని లక్ష్మీ అంటుంది. యమునమ్మగారి నగలు దొంగతనం చేసిన వ్యక్తికే 30 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యావి అతన్ని మీరు బయట కలవడం నేను చూశా..అతని పేరు సిద్ధార్థ్.. అని లక్ష్మీ చెప్పగానే అంబిక బిత్తర పోతుంది. ఈ సాక్ష్యం సరిపోతుందా అని లక్ష్మీ అంటుంది. సిద్ధార్థ్ ఎవరో నాకు తెలీదు అని అంబిక అంటే మీరు అబద్ధాలు చెప్పినా ఎవరూ వినరు. నేను కేవలం ఈ కుటుంబం కోసం మీ గురించి చెప్పడం లేదు కానీ ఈ సారి ఏమైనా తప్పు చేస్తే అప్పుడు చెప్పేస్తా జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చి లక్ష్మీ వెళ్లిపోతుంది. 

అంబిక దగ్గరకు చారుకేశవ వచ్చి ఏంటి నిన్నటి నుంచి తెగ టెన్షన్ పడుతున్నావ్ అని అడుగుతాడు. కొంపతీసి ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అంటాడు. నన్ను ఇరిటేట్ చేయకు బావ అని అంబిక వెళ్లిపోతుంది. ఇక చారుకేశవ లక్ష్మీతో అంబిక టెన్షన్‌గా ఉందని చెప్తాడు. అంబికే ఇదంతా చేసుంటుందని ఈ ఆర్డర్ తీసుకొచ్చింది అంబికనే అని అంటాడు. ఇక క్లే బుక్ చేసిన ఐడీని ఉపయోగించి వాళ్ల డిటైల్స్ తెలుసుకోవచ్చని వెళ్తాడు. ఇక అదంతా విన్న సహస్ర చాలా కంగారు పడుతుంది. ఇక మేనేజర్ లక్ష్మీకి కాల్ చేసి అంబిక డబ్బు అడిగిన విషయం చెప్తాడు. 

ఒడిబియ్యం కార్యక్రమం మొదలవుతుంది. ఇంటి కోడలిగా ఇంటి ఆడబిడ్డలకు ఒడిబియ్యం పోయమ్మా అని సహస్రతో యమున చెప్తుంది. సహస్ర చాలా సంతోషంగా తల్లి పిన్నులకు ఒడి బియ్యం పోస్తుంది. లక్ష్మీ చూస్తూ బాధ పడుతుంది. పద్మాక్షి యమునతో వదిన ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోను నా కూతురితో నాకు ఒడిబియ్యం పొయిస్తున్నావని అంటుంది. ఇక పద్మాక్షి యమునతో వదినా ఒడిబియ్యమేనా ఆడపడుచు లాంఛనాలు లేవా మీ పెళ్లి కూడా చెప్పకుండా చేసుకున్నారా అని అంటుంది. 

యమున విహారికి డబ్బులు తీసుకురమ్మని చెప్తుంది. కావాలనే అడిగారా లేక ఇస్తారా లేదా అని టెస్ట్ చేస్తున్నారా అని చారుకేశవ కామెడీ చేస్తాడు. ఇక విహారి పది పది లక్షలు తీసుకొచ్చి సహస్రకు ఇచ్చి వసుధ, పద్మాక్షికి ఇప్పిస్తాడు. అంబికతో నీకు పెళ్లి అయింటే నీకు పది లక్షలు వచ్చేవి అని చారుకేశవ అంటాడు. నాకేం అవసరం లేదని అంబిక అంటుంది. ఇక లక్ష్మీ ఒడిబియ్యం పోయడానికి వెళ్తే పద్మాక్షి వద్దని నీతో పోయించుకోవడం ఏంటి నువ్వెంత నీ బతుకెంత అని అంటుంది. నేను హ్యాపీగా ఉన్నాను నా మూడ్ పాడు చేయొద్దు అని అంటుంది. యమున ఒడిబియ్యం పోయొద్దు అని లక్ష్మీతో చెప్తే వసుధ తనకు వేయమని అంటుంది. 

లక్ష్మీ వసుధకు ఒడిబియ్యం వేస్తుంది. యమున, సహస్ర, అంబికలు చిరాకు పడతారు. ఇక యమున విహారి, సహస్రలకు పంతులు గారి ఆశీర్వాదం తీసుకోమని అంటుంది. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సంతోషంగా ఉండమని పంతులు దీవిస్తారు. పద్మాక్షి ఎమోషనల్ అయిపోతుంది. ఒకప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకున్నావు.. నా కూతురి ఎప్పుడూ బాధ పడకూడదు అని నేను అనుకునేదాన్ని.. నా కూతురు ఇప్పుడు ఈ ఇంటి కోడలు దాని మీద నాకు హక్కు ఉంది అనుకున్నా కానీ దాని మీద సర్వహక్కులు నీకు నీ కొడుకుకే ఉన్నాయి.. నేను అప్పగింతలు ఇవ్వకపోయినా ఇది ఈ ఇంటి మనిషి అని ఏడుస్తుంది. ఇలా మాట్లాడుతావేంటి అమ్మా అని సహస్ర ఏడుస్తుంది. విహారి ఇక తన విషయంలో నేను ఎక్కువ కలుగజేసుకోను.. దాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో అని అంటుంది. విహారి పద్మాక్షితో సహస్ర ఎప్పటికీ మీ బిడ్డే అంటాడు. అదేంటి అని సహస్ర తండ్రి అంటే మనందరం ఒకటే కదా అని యమున అంటుంది. 

పద్మాక్షి సహస్ర కోసం పుట్టింటి సారె ఇచ్చి నా కూతురు అల్లుడిని సంతోషంగా చూసుకునే బాధ్యత నీదే అని అంటుంది. యమున మనసులో వదిన చాలా ఆశలు పెట్టుకుంది. అది లక్ష్మికి అర్థమయ్యేలా చేయాలి అనుకుంటుంది. ఇక అంబిక సుభాష్‌కి కాల్ చేసి సహస్ర 20 లక్షలు అడగమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.