Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీతో ఇంట్లో అందరితో మన బంధం గురించి చెప్పేస్తానని అంటాడు. లక్ష్మీతో పాటు చారుకేశవ, వసుధలు కూడా యమున గురించి ఆలోచించి ఆగిపోమని అంటారు. మీ అమ్మకి నయం అయ్యేవరకు నిజాలు చెప్పొద్దు అని దండ కార్యక్రమం ఆగేలా నేను చూసుకుంటా అని చారుకేశవ అంటాడు.
పండు చారుకేశవతో విహారి బాబు నిజం చెప్తా అంటే మీరు ఎందుకు సార్ ఆపుతున్నారు. ఇలా అయితే నా చెల్లి ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అని అడుగుతాడు. దాంతో చారుకేశవ లక్ష్మీ సంతోషంగా ఉండటం తనకు చూడాలని ఉంది అని కానీ విహారి ఎప్పుడైనా నిజం చెప్తానని అంటే ఆపమని లక్ష్మీ మాట తీసుకుందని చెప్తాడు. లక్ష్మీ తనకు తానే శిక్ష వేసుకుంటుందని అనుకుంటారు. ఇక ప్రకాశ్ లక్ష్మీ మెడలో దండ వేయకుండా నేను చూసుకుంటా అని చారుకేశవ అంటాడు. ఉదయం సహస్ర ప్రకాశ్, లక్ష్మీలు దండలు మార్చుకునే కార్యక్రమం గురించి హడావుడిగా అన్ని పనులు చేస్తుంది. యమున రావడంతో ఆ పనులు చూసుకోండి అని అందర్ని పిలుస్తానని అంటుంది.
ప్రకాశ్ లక్ష్మీ దగ్గరకు వెళ్లి నేను ఎంత బాగా రెడీ అయ్యానో చూడు నువ్వు కూడా కొత్త బట్టలు కట్టుకో అని అంటాడు. లక్ష్మీ ప్రకాశ్‌తో విహారి బాబు చూస్తుండగా నువ్వు నా మెడలో దండ వేయగలవా అని అడుగుతుంది. దాంతో ప్రకాశ్ సహస్ర, పద్మాక్షి ఆంటీలు ఉండగా నువ్వు వేయించుకోకుండా ఉంటావా అని అంటాడు. ఇంతలో సహస్ర వచ్చి లక్ష్మీని రెడీ అవ్వమని హడావుడి చేస్తుంది. లక్ష్మీ రెడీ అవ్వడంతో కిందకి తీసుకెళ్తుంది. లక్ష్మీ వాళ్లు వెళ్లగానే అంబిక ఆ గదిలోకి దూరి అందరూ ఫంక్షన్ హడావుడిలో ఉంటారు కాబట్టి లక్ష్మీ పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టినా తీసుకోవాలని మొత్తం లక్ష్మీ గది వెతుకుతుంది.
విహారి కిందకి వస్తాడు. దండలు త్వరగా మార్చేయండి అని పద్మాక్షి అంటుంది. సహస్ర లక్ష్మీ గదిలో దండలు మర్చిపోయా అని పండుకి తీసుకురమ్మని చెప్తుంది. పండు వెళ్లడం చూసిన అంబిక తప్పించుకొని కిందకి వచ్చేస్తుంది. పండు దండలు తీసుకొని వస్తాడు. యమున మనసులో ప్రకాశ్ లక్ష్మీ మెడలో దండ వేయడం కరెక్ట్ కాదు కానీ నేను జరిగేది చూడటం తప్ప ఇంకేం చేయలేను అనుకుంటాడు. పండు దండలు తీసుకొస్తే సహస్ర లక్ష్మీ, ప్రకాశ్‌లకు ఇవ్వమని అంటుంది. లక్ష్మీ దండ తీసుకొని బాధగా నిల్చొంటుంది. విహారి కోపంగా దూరంగా ఉంటే సహస్ర వెళ్లి భర్తని తీసుకొని దగ్గరకు వచ్చి నీ బెస్ట్ ఫ్రెండ్, నీ అభిమాని లక్ష్మీల దండల మార్చే కార్యక్రమానికి నువ్వు దూరంగా ఉండటం ఏంటి అని దగ్గరకు తీసుకెళ్తుంది.
వసుధ వాళ్లు ఆపాలని ప్రయత్నిస్తే సహస్ర అందరితో లక్ష్మీని నేను అక్కలా చూస్తున్నా ఒక చెల్లిగా అక్కకి ఏం చేయాలో అది చేస్తున్నా అంటుంది. ప్రకాశ్ లక్ష్మీ మెడలో దండ వేసే టైంకి విహారి ప్రకాశ్ చేతిలో దండ లాక్కొని విసిరేసి నువ్వు లక్ష్మీ భర్తవా ఏంట్రా నీ నాటకాలు అని ప్రకాశ్‌ని వాయిస్తాడు. తన భార్య మెడలో వాడు పూల దండ వేయడం తప్పా అని పద్మాక్షి అడిగితే విహారి తప్పే అని ప్రకాశ్ లక్ష్మీ భర్త కాదని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. చారుకేశవ ఆపాలని చూసినా విహారి ఆగడు. నిజం అందరికీ తెలియాలి.. ఎన్నాళ్లు నేను వెయిట్ చేయాలి అని విహారి అంటాడు. నిజం ఏంట్రా అని పద్మాక్షి అడిగితే నిజం లేదు ఏం లేదు అని యమున అంటుంది. ఎవరూ ఆగమని చెప్పినా విహారి వినకుండా లక్ష్మీ మెడలో తాళి కట్టింది నేనే అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. పద్మాక్షి సహస్రని తీసుకొని పదవే వెళ్లిపోదాం వాడు నిన్ను మోసం చేశాడు.. దాని మెడలో తాళి కట్టిన తర్వాత నీ మెడలో తాళి కట్టాడు అంటే నీవు దానికి సవతివే.. నా కూతురికి అంత ఖర్మ పట్టలేదు. వీడు చేసిన పనికి నేను నా పుట్టింటిని వదిలేస్తా అని అంటుంది. యమున విహారి చేసిన తప్పుని సరిదిద్దుతా అని అంటుంది. అందరూ ఎంత ఆపినా పద్మాక్షి ఆగదు. సహస్రని తీసుకొని వెళ్లిపోతుంది. యమున కోడలు వెళ్లిపోవడంతో గుండె నొప్పి వచ్చి కూలబడిపోతుంది. తీరా చూస్తూ ఇదంతా విహారి కల. తేరుకొని తల్లిని, సహస్రని చూసి ఆగిపోతాడు. దండలు మార్చుకోమని సహస్ర చెప్తుంది. ప్రకాశ్ లక్ష్మీ మెడలో దండ వేసే టైంకి ఇద్దరు భార్యాభర్తలు వచ్చి ఆపరా అని అరుస్తారు. ఎవరు మీరు అని సహస్ర అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.