Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక, సుభాష్‌లను రత్నబాబు కలుస్తాడు. అంబిక వాళ్లకి సాయం అడుగుతాడు. విహారి ఎక్కడికి వెళ్తాడు ఏం చేస్తాడు మొత్తం చెప్పమని అంటాడు. అంబిక, సుభాష్ సరే అంటారు. రత్నబాబు డబ్బు ఇస్తానని అంటే అంబిక వద్దని అనేస్తుంది. ఖర్చు లేకుండా సాయం చేస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్తాడు.
విహారి, లక్ష్మీలు రత్నబాబుని ఎలా ఓడించాలా అని ఆలోచిస్తున్నారు. చారుకేశవ వచ్చి రత్నబాబు మనుషులే అందరూ మనం గట్టిగా ప్రయత్నించాలని అంటాడు. ఆ రత్నబాబు మీద గెలవాలి అంటే రాంగ్ వేలో వెళ్లాలి అని చారుకేశవ అంటాడు. తప్పు దారిలో గెలవడం నా వల్ల కాదని విహారి అంటాడు. మరోవైపు ప్రకాశ్ నడుచుకుంటూ వస్తుంటాడు. నడవ లేక నడవ లేక నడుస్తూ లిఫ్ట్ అడిగినా ఎవరూ ఇవ్వరు. మొత్తానికి మొత్తం నడిచినడిచి ప్రకాశ్ ఇంటికి వస్తాడు. ఇంత నడిపించే బదులు నా కాళ్లు విరిచేసున్నా బాగున్ను అనుకుంటాడు. పండుని పిలిచి వేడి నీళ్లు అడుగుతాడు. పండు వేడి వేడి నీరు ఇవ్వడంతో ప్రకాశ్ భగభగ మరిగిన నీళ్లలో కాలు పెళ్లి కెవ్వుమంటాడు.
మరోవైపు లక్ష్మీ యమునమ్మ ఇచ్చిన విడాకుల పేపర్ల మీద విహారితో సంతకం పెట్టించాలని అనుకుంటుంది. లక్ష్మీ తాళి పట్టుకొని సంతకాలతో తాళి బంధం తెగిపోతుందా అని ఏడుస్తుంది. విహారి తనతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది. పండు ఫైల్స్ తీసుకొని విహారి దగ్గరకు వెళ్లడం చూసి లక్ష్మీ పిలిచి ఓ ఫైల్లో పెట్టి విహారి అన్నింటితో పాటు అయితే చూడకుండా సంతకం పెట్టేస్తాడని అనుకుంటుంది. పండు విహారికి ఫైల్స్ ఇస్తాడు. లక్ష్మీ చాటుగా చూస్తుంటుంది. విహారి ఒక్కో ఫైల్ చెక్ చేసి సంతకం పెట్టాలని అనుకుంటాడు. విహారి ఫైల్స్ చెక్ చేయడం చూసిన లక్ష్మీ వాటిని చూసేస్తే ఎందుకు వచ్చాయా అని ప్రశ్నించి అందరికీ విషయం చెప్పేస్తారని అనుకుంటుంది. విహారిని ఎలా ఆపాలా అనుకునే టైంకి సరిగ్గా ఫైల్ చూసే టైంకి ఫోన్ రావడంతో విహారి వెళ్తాడు.
లక్ష్మీ విడాకుల ఫైల్స్ తీసుకుంటుంది. అన్నీ చెక్ చేసి ఇస్తానని తీసుకుంటుంది. ప్రకాశ్ లక్ష్మీ దగ్గర ఫైల్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తే లక్ష్మీ సీరియస్ అవుతుంది. నా విషయంలో దూరితే చంపేస్తా అంటుంది. ఇక రత్నబాబు రెడీ చేయించిన బట్టల క్వాలిటీ చెక్ చేయిస్తా అనుకుంటూ వాటిని ముందు వేసుకొని చూస్తుంది. అవి చేనేత కార్మికులు చేసిన బట్టలు కావు. బయట నుంచి తెచ్చారని అనుకొని చారుకేశవకి కాల్ చేస్తుంది. రత్నబాబు విదేశీ మెటీరియల్ తీసుకొచ్చి యూనిఫాంలు చేయిస్తున్నాడు వాడి బాగోతం బట్టబయలు చేస్తే విహారి గారు గెలుస్తారని అంటుంది.
విహారి ఉదయం బయటకు వచ్చి లక్ష్మీ లేదేంటి అనుకుంటాడు. యమున వాళ్లు లక్ష్మీ కనిపించడం లేదని మాట్లాడుకుంటారు. పద్మాక్షి లక్ష్మీని తిడితే తను పని మనిషి కాదు ఇంటి మనిషి అంటాడు. నా దృష్టిలో అది పనిమనిషే అని పద్మాక్షి అంటుంది. అందరూ లక్ష్మీ ఎక్కడుందా అనుకుంటారు. లక్ష్మీ, చారుకేశవలు ముస్లింలులా రెడీ అయి రత్నబాబు ఇంటికి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.