Janaki Kalaganaledhu August 18th: ఇక తన అన్నయ్యలు ఎలాగైనా అత్తారింటికి వెళ్లి మమ్మల్ని మర్చిపోతావు కదా ఇప్పుడు మాతో కాసేపు సమయాన్ని కేటాయించవచ్చు కదా అని అంటారు. దాంతో వెన్నెల నాకు పెళ్లి వద్దు అని అంటుంది. ఏం జరిగిందని ఇంట్లో వాళ్ళు అనటంతో.. మరేంటి పెళ్లయ్యాక నేను మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోను అని ఎమోషనల్ అవుతుంది.


దాంతో జానకి తనను కూల్ చేస్తుంది. ఇప్పుడు ఇలాగే ఉంటుంది కానీ తప్పదు అని అంటుంది. ఇక అత్తారింటికి వెళ్ళాక కూడా పుట్టింటి వాళ్ల గురించి మాట్లాడుతారు అని.. ఇక పుట్టింటికి వచ్చాక అత్తారింటి గురించి గొప్పగా చెబుతుంటారు అని అంటుంది. ఇక ఇంట్లో వాళ్ళు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండటంతో ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు. ఇక పువ్వుల కోసం జానకి తన గదిలోకి వెళ్ళగా వెనకాలే రామ కూడా వెళ్లి తనతో సరసాలు ఆడుతూ ఉంటాడు.


అప్పుడే జ్ఞానంబ పిలవటంతో బయటికి వెళ్తారు. పెళ్లి కొడుకు వాళ్లకు ఎక్కడ ఉన్నారో ఫోన్ చేశారా అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే జానకికి ఉగ్రవాదుల జాడ దొరికిందని డ్యూటీకి రమ్మని ఫోన్ రావటంతో ఇప్పుడే వస్తాను అని అంటుంది జానకి. ఫోన్ కట్ చేసి తను అర్జెంటుగా వెళ్లాలి అని ఉగ్రవాదుల జాడ దొరికింది అని ఎలాగైనా వారిని పట్టుకోవాలి అని తన అత్తయ్యతో అంటుంది. కానీ జ్ఞానంబ ఈ సమయంలో ఎక్కడికి వెళ్తావు.. పెళ్లి పెట్టుకొని వెళ్లడం కరెక్టు కాదు కదా అని అంటుంది.


అందరూ ఇంటి పెద్ద కోడలు ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి అని అంటుంది. ఆయన ఇంట్లో ఉన్నంత సేపు నువ్వు రామ భార్యగా ఉండాలి కదా అని అంటుంది. ఇక రామ కూడా జానకి ఎలాగైనా వెళ్లి తీరాలి అని ఉగ్రవాదులను పట్టుకోవాలి అని అనడంతో.. మీరిద్దరూ ఒకే నిర్ణయంలో ఉన్నప్పుడు నేనేం చేస్తాను అని జ్ఞానంబ అంటుంది. వెంటనే జానకి పెళ్లి ముహూర్తం వరకు వచ్చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది.


ఇక కాసేపు తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు. జ్ఞానంబ కుటుంబం వారికి ఎదురెళ్లి ఆహ్వానిస్తారు. కిషోర్ మాత్రం వెంటనే ఈ పెళ్లి అయిపోవాలి అని లేదంటే జానకి తనకు ఉరి వేస్తుంది అని భయపడుతూ ఉంటాడు. ఇక జానకి కనిపించకపోయేసరికి టెన్షన్ పడతాడు. జానకి సిస్టర్ ఎక్కడ అని అడగటంతో వెంటనే రామ ఉగ్రవాదుల జాడ దొరికిందని వాళ్లను అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళింది అని అనటంతో కిషోర్ మరింత భయపడతాడు.


కిషోర్ కంగారు పడుతున్న దాన్ని చూసి.. ఏం కంగారు పడకు వెన్నెల చాలా మంచిది అని లోపలికి తీసుకొని వెళ్తారు. ఇక కిషోర్ తన వాళ్లకి ఫోన్ చేసి ఎలాగైనా పారిపోమని చెప్పాలి అని అనుకుంటాడు. ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే మలయాళం కాఫీ తీసుకొని రావటంతో కిషోర్ కాఫీ తీసుకోకుండా ఆలోచనలో పడుతూ ఉంటాడు.


ఇక పక్కనే ఉన్న తన తండ్రి కాఫీ తీసుకోమని అనడంతో అతనిపై అరుస్తాడు కిషోర్. ఇక అక్కడున్న వాళ్లంతా షాక్ అవ్వగా నాకు మా నాన్నకి ఇవన్నీ మామూలే అని అంటాడు. ఇక కంగారుపడుతున్న కిషోర్ ని చూసి విష్ణు వెన్నెల కోసమా అని అడగటంతో కాదు వాష్ రూమ్ కి వెళ్ళాలి అని అంటాడు. ఇక అఖిల్ తనను వాష్ రూమ్ కి తీసుకెళ్తాడు. మరోవైపు జానకికి ఉగ్రవాదులు కంటపడటంతో వెంటనే వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.


వాళ్లని చంపకూడదు అని తమ లీడర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని అంటుంది. కానీ అందులో ఉన్న ఒక ఉగ్రవాది కూడా తనే గన్నుతో కాల్చుకొని చనిపోతాడు. దాంతో జానకి ఉన్న ఒక అవకాశం పోయిందని అనుకుంటుంది. ఆ ఉగ్రవాది ఫోన్ తీసుకొని   అందులో తరచుగా వచ్చిన ఒక నెంబర్ ను తన ఫోన్లో టైప్ చేసి చూడటంతో అది కిషోర్ నెంబర్.


మరోవైపు కిషోర్ వెళ్లి పూజలో కూర్చుంటాడు. కిషోర్ ఇతనికి ఎందుకు ఫోన్ చేశాడు అని అనుమానం పడుతుంది జానకి. ఇక ఇదే ఫోన్ నుంచి కిషోర్ కి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని కిషోర్ కి ఫోన్ చేస్తుంది. ఇక కిషోర్ ఫోన్ లిఫ్ట్ చేసి జానకికి మనం ఎక్కడ ఉన్నామో తెలిసిపోయింది.. ఇక్కడ పెళ్లి కాగానే నేను మీ దగ్గరికి వస్తాను అని మెల్లిగా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే జానకి ఆ ఉగ్రవాది ఎవరో కాదు కిషోర్ అని తెలుసుకొని 
షాక్ అయ్యి.. గతంలో అతడు మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు చేసుకొని వెంటనే పెళ్లి ఆపాలి అని బయలుదేరుతుంది.


ఇక పెళ్ళికొడుకు బట్టలు మార్చుకోమని పంతులు చెప్పటంతో కిషోర్ గదిలోకి వెళ్లి కంగారు పడుతూ ఉంటాడు. మరోవైపు జానకి కారులో ఇంటికి వస్తుంది. ఇక కిషోర్ మళ్లీ ఫోన్ చేయటంతో జానకి లిఫ్ట్ చేయరు. దాంతో కిషోర్ కి అనుమానం వస్తుంది. ఇకనుండి ఎస్కేప్ అవ్వడమే బెటర్ అని అనుకోగా అప్పుడే రామ అక్కడికి వస్తాడు. రెడీ అయి వస్తాను అని చెప్పి రామను బయటికి పంపిస్తాడు. 


 


also read it : Prema Entha Madhuram August 17th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అనుకు వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవ, ఆర్యకు కాల్ చేసిన అను?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial