పాపం పెద్ద కోడలు జానకి తోడికోడళ్ళు సినిమాలో సావిత్రి లాగా తెగ కష్టపడిపోతుంది. ఒసేయ్ మల్లిక కాలు తిరిగిన రైటర్ కరెంట్ పోల్ ఎక్కి రాసినట్టు జానకిని భలే ఇరికించేశావ్ అని తెగ సంకలు గుద్దుకుంటుంది. ఇక జానకి తన అసైన్మెంట్ పని పూర్తి చేసేస్తుంది. మరో వైపు జ్ఞానంబ రామాకి ఫోన్ చేసి ఒక వ్యక్తి మనకి డబ్బులు ఇవ్వాలి తీసుకుని రమ్మని పురామయిస్తుంది. 5 గంటల్లోపు చదువుకునే చోట జానకి గారి స్టడీ పేపర్స్ ఇవ్వాలని చెప్పారు కానీ అమ్మ ఇంకో పని అప్పగించారు ఇప్పుడు ఎలా అని కంగారుపడతాడు. ఇదే  విషయాన్ని జానకికి ఫోన్ చేసి చెప్తే దానికి అంతా టెన్షన్ ఎందుకండి నేను ఒక్కదాన్నే వెళ్తానులే అంటుంది. మిమ్మల్ని ఒక్కదాన్నే పంపాలంటే నాకు భయమండి అని అంటాడు. మేరేమీ కంగారూ పడకండి నేను వెళ్లొస్తానులే అని జానకి సర్ది చెప్తుంది.  


ఇక గోవిందరాజులు నడుము నొప్పితో విలవిల్లాడిపోతాడు. నొప్పి తగ్గేందుకు ట్యాబ్లెట్స్ తెప్పించుకోవాలి అనుకుంటాడు. బయటకి వెళ్తున్న జానకికి ట్యాబ్లెట్స్ తెమ్మని మందుల చీటి ఇస్తాడు. అది చూసిన జ్ఞానం ఏమిటవి ఎందుకు తెప్పించుకుంటున్నారని అడుగుతుంది. బి పి ట్యాబ్లెట్స్ తెప్పించుకుంటున్న అని గోవిందరాజులు అసలు విషయాన్ని చెప్పకుండా దాచేస్తాడు. జానకి బ్యాగ్ తగిలించుకుని బయటకి వెళ్ళడం గమనించిన మల్లిక పుల్లలు పెడుతుంది. కానీ వాటిని గోవిందరాజులు సాగనివ్వడు.


Also read: ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్ - రిషిని రెస్టారెంట్ కి రమ్మన్న వసు, సాక్షితో కలసి వెళ్లి షాకిచ్చిన ఈగో మాస్టర్


జానకి అసైన్మెంట్ పేపర్స్ సబ్మిట్ చేయడానికి వెళ్తే టైమ్ అయిపోయిందని అంటాడు. పది రోజులు సమయం ఇస్తే చేయకుండా ఇప్పుడు వచ్చి ఇస్తారా అని ఆయన ప్రశ్నిస్తాడు. ఐ పి ఎస్ తన చిన్నపాటి కల అని పెళ్లి అయ్యాక కూడా ఆ కలని చంపుకోలేక నైట్ కాలేజ్ లో చేరాను అని ప్రాదేయపడుతుంది. అది విన్న ఆయన ఆమెని ప్రశంసిస్తూ అసైన్మెంట్ కాగితాలు తీసుకుంటాడు. ఇక గోవిందరాజులు నడుం నొప్పితో అల్లడిపోతుండటాన్ని జ్ఞానంబ గమనిస్తుంది. నాకు చెప్పకుండా ఎందుకు దాచారు అని బాధపడుతుంది. వెంటనే ఫోన్ తీసుకుని జానకికి చేస్తుంది కానీ తాను లిఫ్ట్ చేయదు. ఇక రామాకి ఫోన్ చేసి నాన్నకి బాగోలేదు త్వరగా రమ్మని చెప్తుంది. నేను వెంటనే డాక్టర్ ని తీసుకుని వస్తాను నువ్వేం కంగారుపడకు అని తల్లికి ధైర్యం చెప్తాడు. ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తాను అన్న జానకి ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది.


Also Read: జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!


జానకి ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి వెళ్లడంతో చిటిలో ఉన్న ఇంజెక్షన్ లేదని చెప్తాడు. దాని కోసం జానకి అన్నీ మెడికల్ షాపులకి తిరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడ దొరకదు. చివరికి ఒక షాప్ లో దొరుకుంటుంది వాటిని తీసుకుని వెంటనే జానకి బయల్దేరుతుంది. నడుం నొప్పితో గోవిందరాజులు బాధపడుతుంటే మల్లిక జానకిని ఇరికించేందుకు నోటికి వచ్చినట్టు వాగుతుంది. మెడికల్ షాప్ కి వెళ్ళిన జానకి ఎందుకు రాలేదు ఎక్కడికి వెళ్లిందో ఏంటో పుల్లలు వేస్తుంది.  ఇంతలో రామా డాక్టర్ ని తీసుకుని వస్తాడు. పరిశీలించిన డాక్టర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అందరూ భయపడతారు.