తులసిని మోసం చేసి తన అకౌంటు నుంచి రూ.20 లక్షలు కాజేసినట్టు నందుకి తెలియడంతో లాస్య టెన్షన్ పడుతుంది. అక్కడి నుంచే నేటి ఎపిసోడ్ మొదలవుతుంది. ఈ రోజు 676 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..   


నేను చేసిన మోసం తెలిసి డబ్బు తిరిగి ఇవ్వమని తులసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పడంతో నందు కోపంగా చెంప చెల్లుమనిపించినట్టు లాస్య ఊహించుకుంటుంది. వెంటనే తెరుకుని నందు నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయవ నువ్వు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి ప్లీజ్ నన్నేమి ఆడగకు అని చెప్పి పంపించేస్తుంది. ఇక భాగ్య బావగారికి అంతా చెప్పి ఉండాల్సింది అంటే అప్పుడు నా చెంప పగిలేది నా కాపురం కూలిపోయేదని లాస్య అంటుంది. ఒక్కసారిగా రూ.20 లక్షలు అంటే ఎక్కడ నుంచి తెస్తావ్ అని అడుగుతుంది. అప్పు తీసుకొస్తాను అంటే నిన్ను ఎవరు నమ్ముతారని భాగ్య అంటుంది. నువ్వే నాకు అప్పు ఇవ్వు అని మెలిక పెట్టడంతో భాగ్య బిక్క మొహం వేస్తుంది. తులసి ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులో నీ వాటా రూ.20 లక్షలు ఉన్నాయిగా అవి ఇవ్వమని లాస్య అడుగుతుంది. ఇంకా అవి ఎక్కడ ఉన్నాయి అప్పుడే వాటితో అప్పులు తీర్చుకున్నానని భాగ్య చెప్పి అక్కడ నుంచి జారుకుంటుంది.


లాస్య డబ్బుల కోసం తిప్పలు పడుతూ ఉంటుంది. అదే టైమ్ కి తులసి లాస్యకి ఫోన్ చేసి నీకు ఇచ్చిన గడువులో ఇంకా కొద్ది గంటలే ఉన్నాయి అది గుర్తు చేద్దామని చేశాను అంటుంది. నాకు గుర్తుందని లాస్య విసుగ్గా ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన లాస్య తులసి ఇచ్చిన గడువు అయిపోయింది.. డబ్బు ఎక్కడ పుట్టలేదు అని టెన్షన్ పడుతుంది. నందుకి తులసి మొత్తం చెప్పేస్తుంది నా కాపురం కూలిపోతుంది అని బాధ పడుతుంది. ఇక తులసి దివ్య, అంకితలని పిలిచి నా ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది చూడమంటుంది. రూ.20 లక్షలు డిపాజిట్ అయినట్టు మెసేజ్ వచ్చిందని దివ్య సంతోషంగా చెప్తుంది. తులసి విషయం చెప్దామని లాస్యకి ఫోన్ చేయగా నేను డబ్బు కట్టలేను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని అరుస్తుంది. లాస్య నీకు పిచ్చి పట్టిందా దాని నుంచి నువ్వు ఇంకా బయటకి రాలేదా అని తులసి అంటుంది. నువ్వేసిన 20 లక్షలు నా అకౌంటులో పడ్డాయ్ అని  చెప్పడానికి ఫోన్ చేశాను కాస్త ఈ లోకంలోకి రా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నేను తులసి అకౌంటు లో 20 లక్షలు వెయ్యడమెంటి అని ఆలోచిస్తుండగా వేసింది నేను అని నందు ఎంట్రీ ఇవ్వడంతో లాస్య షాక్ అవుతుంది.


Also Read: జ్వాలకి మరో ఇద్దరు శత్రువులు, నిరుపమ్-శౌర్యని ఒక్కటి చేసేందుకు హిమ ఏం చేయబోతోంది!


నువ్వు ఎందుకు వేశావ్ నందు అని అంటుంది. నేను స్వార్థపరుడినే కావొచ్చు కానీ పరువుగా బతికాను ఎవరిని మోసం చెయ్యలేదు. కానీ నువ్వు నా పరువు తీశావ్.. నన్ను ఒక మోసాగాడిలాగా రోడ్డు మీద నిలబెట్టావ్ అని ఆగ్రహంతో ఊగిపోతాడు. తులసిని మోసం చేసి ఆ డబ్బుతో నా బిజినెస్ స్టార్ట్ చేస్తావా సిగ్గు ఉందా అని అరుస్తాడు. తులసి తప్పు చేసిన ప్రతిసారీ ఆ ఇంటికి వెళ్ళి ఎండగట్టే వాడిని ఈ రోజు నువ్వు చేసిన దరిద్రమైన పనికి తులసి ముందు తలెత్తుకోలేకపోయాను. ఈ హేట్ యు అని గట్టిగా అరుస్తాడు. చెప్పాను అంటూనే తులసి నందుకి విషయం చెప్పేసిందా ఎంత మోసం చేసింది నందుని ఎలా కంట్రోల్ చేయడం  అని లాస్య మనసులో అనుకుంటూ ఉంటుంది. నీ లాంటి దాని కోసం నా వాళ్ళని వదులుకొని వచ్చి తప్పు చేశాను.. ఆ తప్పుని కూడా ఈ రోజు దిద్దుకుంటాను. మన రిలేషన్ ఈ రోజుతో తెగిపోయింది ఇక మనం కలిసి కాపురం చేసే ప్రసక్తే లేదు గుడ్ బై అని వెళ్లబోతుంటే లాస్య ఆపుతుంది. ఇక నుంచి ని బతుకు నీది నా బతుకు నాది నా వెంట పడొద్దు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


ఇక తులసికి లాస్య ఫోన్ చేసి ఏకిపారేస్తుంది. నిజాయితీ ఉన్న దానివి అంటావ్ మరి నందుకి ఎందుకు చెప్పావ్ నా కాపురం పోయేలా చేశావ్ అని అరుస్తుంది. నేను లాస్యని కాదు తులసిని.. ఒకవేళ గడువులోపల డబ్బు రాకపోయినా నీ నందుకి నేను నిజం చెప్పేదాన్ని కాదని అంటుంది. తులసి చెప్పకపోతే మరి ఎవరు చెప్పారు అని ఆలోచిస్తుండగా తన ఫ్రెండ్  నుంచి ఫోన్ వస్తుంది. నేను డబ్బు ఇచ్చాను అని నందగోపాలగారికి ఎందుకు చెప్పావ్ ఏంటి ఈ నాటకాలని నిలదిస్తుంది. ఇందాక నందు నాకు థాంక్స్ చెప్పడంతో విషయం తెలిసిందని చెప్తుంది. ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నా కాపురం ఏం కావాలి అని నిలదీస్తుంది. ఇంకోసారి ఇలా జరగదు అని సారీ చెప్పి లాస్య ఫోన్ పెట్టేస్తుంది.


Also Read: జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!


ఏదో విధంగా నందుని ఆపేందుకు లాస్య భాగ్యతో కలిసి  డ్రామా మొదలుపెడుతుంది. నా నందు మీద ప్రేమతో నేను చేయకూడని తప్పు చేశాను భాగ్య నా నందు ముఖంలో నవ్వు చూడాలని గీత దాటి ప్రవర్తించాను అని అంటుంది. వాళ్ళ మాటలు విని నందు కరిగిపోతాడు. నందు బాధ చూడలేక అలా చేశాను అని పాయిజన్ తీసుకుని తాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు నటిస్తుంది. వెంటనే నందు వచ్చి లాస్యని ఆపి కౌగలించుకుంటాడు. తన ప్లాన్ వర్కౌట్ అయిందని ఓ వైపు సంబరపడుతూనే మరో వైపు సారీ నందు అని ఏడుస్తుంది. నువ్వు నా కోసం ఎంత తపన పరితపించావో తెలుసుకోలేకపోయాను సారీ లాస్య అని ఎమోషనల్ అవుతాడు. నా మీద ప్రేమతోనే తులసిని మోసం చేశావాని గుర్తించలేకపోయాను సారీ లాస్య  అంటాడు. నువ్వు నాతోనే ఉంటావ్ కదా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవ్ కదా అని అంటే ఎక్కడికి వెళ్ళాను అని నందు ఓదారుస్తాడు.


తరువాయి భాగంలో..


మా ప్రేమ్ కి కూడా ఆ పోటీలో పాల్గొనే ఛాన్స్ ఇస్తారా అని తులసి తన ఫ్రెండ్ ని అడగ్గా తప్పకుండా సాయం చేస్తానని ఆమె చెప్తుంది. ఇక ఎంట్రీ ఫామ్ తెచ్చి శ్రుతికి ఇవ్వగా అది ప్రేమ్ ముందు పెడతుంది. ఆ ఫామ్ ని చింపి అవతల పారేయ్ ని కొడుకు చేతకాని వాడని మా అమ్మకి చెప్పు అని అంటూ ఉంటే వెనుకే తులసి బాధగా నిలబడి ఉంటుంది.