మల్లిక తీసుకుని వెళ్తున్న కాగితాల్లో ఏదో రాసి ఉండటాన్ని గమనించిన జ్ఞానంబ ఆపి అవేంటో చూడమని అఖిల్ కు చెప్తుంది. అదే టైమ్ కి ఫోన్ రావడంతో అందులో ఉన్న జానకి స్టడీ పేపర్స్ అఖిల్ గమనించకుండా పనికిరానివే అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇవి పనికిరాని కాగితాలే.. నేనేమైనా బుర్రతక్కువ దాన్న ఏంటి అని మల్లికా అంటే గోవిందరాజులు కౌంటర్ ఇస్తాడు. నీ బుర్ర గురించి ఎందుకెళ్ల అది వింటే మా బుర్రపోతుందని అంటాడు. కాసేపు మల్లిక వాగుతూ ఉంటే అదేమీ పట్టించుకోకూన జ్ఞానంబ వాళ్ళు వెళ్లిపోతారు.


ఇక మల్లిక న్యూస్ పేపర్స్ తో పాటు జానకి స్టడీ పేపర్స్ కూడా కాగితాలు అమ్మేవాడికి ఇచ్చేస్తుంది. వాటిని తీసుని అతడు వెళ్ళిపోతాడు. తర్వాత గదిలోకి వచ్చిన జానకి టేబల్ మీద పెట్టిన ఆ కాగితాల కోసం వెతుకుతుంది. అవి ఏమైపోయాయ అని టెన్షన్ పడుతూ గది అంతా వెతుకుతుంది. రూంలో కొన్ని పేపర్స్ పెట్టాను అవి కనిపించడం లేదని చికితని పిలిచి జానకి అడుగుతుంది. అప్పుడు మల్లిగా అమ్మగారు పాత పేపర్లు అమ్మారు వాటితో పాటు ఇవి కూడా వేశారేమో అని అంటుంది. అవునా అతను వెళ్ళిపోయి ఎంతసేపు అయింది అని అంటే చాలాసేపు అయింది మన వీధి కూడా దాటి వెళ్ళిపోయి ఉంటాడని చికిత చెప్తుంది. దీంతో జానకి కూలబడిపోతుంది.


ఏమైందని మల్లిక వచ్చి జానకిని అడుగుతుంది. నా రూంలో ఉన్న పేపర్స్ ఎందుకు తీశావాని తిడుతుంది. అక్కడికి జ్ఞానంబ వాళ్ళు రావడం చూసి మల్లిక ఓవర్ యాక్షన్ చేస్తుంది. అందులో అంత కావాల్సిన పేపర్లు ఏమున్నాయని నిలదీస్తుంది. పక్కనే ఉన్న జ్ఞానంబ కి జానకి మీద ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. కారణం లేకుండా ఎవ్వరిని ఒక్క మాట కూడా అనవు మరి మల్లిక మీద అరిచావంటే ఆ కాగితాల్లో ఏముందని జ్ఞానంబ జానకిని అడుగుతుంది. అయిన కూడా మల్లికా ఇంకా ఎక్కించే ప్రయత్నం చేస్తుంటే గోవిందరాజులు అడ్డుకుంటాడు. పుల్లల మల్లిక నువ్వు పెట్రోల్ పోసే పనులు ఆపు అని అంటాడు. జ్ఞానంబ అడుగుతుంటే జానకి మౌనంగా ఉంటుంది. అవి స్వీట్ షాప్ కోసం కవర్లు చెయ్యమని ఆయన ఇచ్చారని కవర్ చేస్తుంది. ఇంత చిన్న విషయం కోసం నువ్వు నన్ను తిడతావ అని మళ్ళీ ఎక్కించడానికి ప్రయత్నిస్తే జ్ఞానంబ తిడుతుంది. వెళ్ళి పనులు చేసుకోమని చెప్తుంది. ఇక లేనిపోని నొప్పులు వచ్చినట్టు మల్లిక డ్రామాలు మొదలు పెడుతుంది.


గదిలోకి వెళ్ళిన తర్వాత గోవిందరాజులు ఒక్కసారిగా నడుం నొప్పితో అరుస్తాడు. ఏమైందని జ్ఞానంబ అడగ్గా ఏం లేదని చెప్పి బయటకి పంపించేస్తాడు. ఈ విషయం చెప్తే జ్ఞానం భయపడుతుంది ఎందుకు చెప్పడం అని అనుకుంటాడు. ఇక వంట పనిలో ఉన్న జానకి పోయిన ఎస్సైనమెంట్ కాగితాల గురించి బాధపడుతుంది. సాయంత్రంలోగా వాటిని మళ్ళీ చేయాలి అని అనుకుంటుంది. ఓ వైపు వంట పని చేసుకుంటూనే మరో వైపు ఎస్సైనమెంట్ రాసుకుంటుంది. నేటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Also Read: వసు వేసిన పూలదండ చూసి మురిసిన రిషి, పేపర్లో రిషిధార ఫొటో చూసిన దేవయాని-సాక్షికి షాకిచ్చిన జగతి-వసుధార