గాయం నుంచి కాస్త కోలుకున్న తర్వాత వంట గదిలో కాఫీ చేస్తుంటుంది జానకి. అక్కడికి వచ్చిన రామచంద్ర ఏం చేస్తున్నారని అడుగుతాడు. అత్త కోసం ఫిల్టర్ కాఫీ పెడుతున్నాను అంటుంది. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు తనను, నాన్నను కూతురిలా చూసుకునేలా పెద్ద కోడలు రావాలని కోరుకునే వాళ్లని.. ఇప్పుడు కోడలిని మరిపించే కోడలు వచ్చిందని అంటాడు. తనకు ఉన్న పెద్ద లోటు అమ్మానాన్నే అంటుంది. వాళ్లిద్దర్ని ఒకేసారి తీసుకెళ్లిపోయిన దేవుడు... అత్త, మామ రూపంలో తిరిగి ఇచ్చాడని అంటుంది. అందుకే తనకు తోచిన విధంగా సేవ చేసుకుంటున్నానని చెప్తుంది. తర్వాత ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలో జానకికి రామచంద్ర చెప్తాడు.


కాఫీ కావాలని గోవిందరాజు అడుగుతాడు. జ్ఞానాంబ వెళ్లేలోపుజానకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అన్ని పనులు జానకి చేసేసి అత్తను బద్దకస్తురాలని చేస్తున్నావని అంటాడు గోవిందరాజు. అర్థం చేసుకునే కోడల్ని ఇస్తే ఆ ఇల్లు నందనవనం అవుతుందని... కొందరు మాత్రం వేరేలా ఉంటారని అంటాడు గోవిందరాజు. 


కాఫీ బాగుందని అత్తమామ ఇద్దరూ పొగడ్తారు. మల్లికను చూసిన గోవిందరాజు.. మరింతగా రెచ్చిపోతాడు. అక్కడకు వచ్చిన మల్లిక తాను కూడా కాఫీ బాగా పెడాతనంటుంది. అవునవునూ... కాఫీ ఏమో గానీ పుల్లలు బాగా పెడతావంటాడు. 


ఇంతలో మల్లికను జ్ఞానాంబ పిలిచి... మీ ఇద్దరూ కూతుళ్లతో సమానమనీ... ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అనే భేదం లేదని చెప్తుంది. అంతా అక్కడి నుంచి వెళ్లిపోయి బారసాలకు బయల్దేరుతారు. 


బారసాల కోసం జానకికి కోసం భర్త రామచంద్ర చీర సెలెక్ట చేసి ఇస్తాడు. దాన్నే కట్టుకున్న జానకిని చూసి మురిసిపోతుంటాడు. దేవతలా ఉన్నావంటూ పొగుడ్తుంటాడు. 


బారసాలకు బయల్దేరిన మల్లిక కూడా డిఫరెంట్‌ శారీ కట్టుకుంటుంది. దాన్ని చూసిన ఆమె భర్త విష్ణు ఇలా తయారయ్యావేంటీ... ఇలా అమ్మ చూస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. అంత సీన్ లేదు... నేను పట్టించుకోనంటూ కోతలు కోస్తుంది. ఇంతలో అత్త జ్ఞానాంబ పిలుస్తుంది. పరుగెత్తుకొని వెళ్తుంది మల్లిక. ఆ అవతారంలో మల్లికను చూసిన జ్ఞానాంబ తిట్ల దండకం అందుకుంటుంది. బారసాలకు ఎవరైనా ఇలా వస్తారా అని ప్రశ్నిస్తుంది. వెళ్లి చీర మార్చుకొని రమ్మంటుంది. పక్కనే ఉన్న మామ గోవిందరాజు కూడా సెటైర్లు వేస్తాడు. అత్త కూడా కలుగుజేసుకొని జానకి చూడు ఎలా రెడీ అయిందో అని పోల్చి చూస్తుంది. దీంతో కడపు మంటలో రగిలిపోతుంది మల్లిక. 


వాళ్ల గోల భరించలేక వెళ్ల మల్లిక చీర మార్చుకొని వస్తుంది. ఇద్దరు కోడళ్లతో కలిసి అత్త బారసాల ఫంక్షన్‌కు వెళ్తుంది. అక్కడ తెలిసిన వాళ్లు పలకరిస్తారు. ఇంతలో జానకిని పిలిచి ఏమైనా విశేషమా అని అడుగుతారు. అందరి ముందు అలా అడిగేసరికి జ్ఞానాంబ ఫ్యామిలీ షాక్‌ తింటుంది.