అన్నా చెల్లెళ్ల బంధం భగవంతుడు ఇచ్చిన వరం కోపతాపాలకు ఆ బంధం అంతా తేలికగా తెగిపోకూడదు. మీ మధ్య ఉన్న మనస్పర్థలని పక్కన పెట్టి రాఖీ పండగని సంతోషంగా జరుపుకోమని జ్ఞానంబ జానకికి చెప్పి కట్టమని రాఖీ ఇస్తుంది. అన్నకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది జానకి. తెలిసో తెలియకో తప్పు చేస్తే ఈ అన్నయ్యని పూర్తిగా దూరం పెట్టేస్తావా అని ఎమోషనల్ అవుతాడు. బావగారు ఆ ఆరోజు మాట మాట పెరిగి అలా మాట్లాడాను క్షమించమని  రామాని అడుగుతాడు. మీ అబ్బాయిని బాధపెట్టినందుకు మీ స్థానంలో మరొకరు ఉంటే నా చెల్లిని బాధపెట్టేవారు కానీ మీరు మాత్రం నా చెల్లిని ఒక అమ్మలాగా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు అని కృతజ్ఞతలు చెప్పి జానకి అన్నయ్య వెళ్ళిపోతాడు.


జానకి ఈ శ్రావణ పౌర్ణమి రోజు పెద్ద కోడలు అమ్మవారికి పొంగల్ చేసి నైవేద్యంగా సమర్పించాలి. ఆవు పాలతో నువ్వు పొంగల్ తయారు చెయ్యి మేము పూజ ఏర్పాట్లు చేస్తామని జ్ఞానంబ చెప్తుంది. చాలా నిష్టతో జాగ్రత్తగా తయారు చెయ్యమని మరి మరి చెప్తుంది. అది విన్న మల్లిక కుళ్ళుకుంటుంది. తోటి కోడలు ఇంత సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒక మంట పెట్టాల్సిందే.. పోలేరమ్మ జానకికి ఇచ్చిన ఐదు అవకాశాల్లో ఒక తప్పు ఈరోజు జరగాల్సిందే తగ్గేదెలే అని మల్లిక మనసులో అనుకుంటుంది. అఖిల్ మాత్రం పూజ త్వరగా అయిపోతే బాగుండు వెళ్ళి జెస్సి బర్త్ డే సెలెబ్రేట్ చేయొచ్చని అనుకుంటూ ఉంటాడు. ఏదో ఒకటి చేసి పోలేరమ్మ ముందు ఇరికించాలి, అప్పుడు జానకి పేరు కోటప్పకొండ ప్రభలాగా ధగధగా వెలిపోతుందని మనసులో అనుకుంటుంది.


Also Read: తులసి మీద అరిచిన సామ్రాట్, నీచంగా మాట్లాడిన లాస్య- ప్రేమ్ దగ్గరకి వెళ్లనని తేల్చి చెప్పిన శ్రుతి


మల్లిక గుడి నుంచి బయటకి వెళ్తూ ఒకామెని ఢీ కొడుతుంది. దీంతో పిల్లాడికి తాగించే పాల డబ్బా కిందపడిపోతుంది. ఆమె జానకి వాళ్ళు వంట చేస్తున్న దగ్గరకి వచ్చి బాబు ఏడుస్తున్నాడు కొంచెం పాలు ఇవ్వమని అక్కడి వాళ్ళని అడుగుతుంది. దేవుడు ప్రసాదం కోసం తీసుకుని వచ్చిన పాలు ఇవ్వలేమని చెప్తారు. జానకి తన బాధ చూసి పాలు ఇస్తుంది. అలా నైవేద్యం పాలు ఇవ్వకూడదని పక్కన ఉన్న అమ్మలక్కలు చెప్తారు కానీ జానకి మాత్రం పాలు ఇస్తుంది. అది చూసిన మల్లిక భలే దొరికావ్ జానకి ఎంగిలి పాలతో నైవేద్యం చేస్తున్నవని పోలేరమ్మ దగ్గర నాదస్వరం ఊదుతాను తను విరుచుకుపడుతుంది అని తెగ సంబరపడుతుంది. జ్ఞానంబ పూజ ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడే జానకి నైవేద్యం తీసుకుని వచ్చి పూజారికి ఇస్తుంటే మల్లిక ఆపుతుంది.


అత్తయ్యగారు ఎంగిలి పాలతో నైవేద్యం చేసినది సమర్పించవచ్చా అని మల్లిక అడుగుతుంది. బుద్ధి ఉందా నీకు దేవుడికి సమర్పించేది శ్రేష్టంగా ఉండాలని ఆ మాత్రం తెలియదా అని అరుస్తుంది. జానకి ఎంగిలి పాలతో నైవేద్యం తయారు చేసిందని మల్లిక చెప్తుంది. ఆ మాటకి జ్ఞానంబ కోపంతో ఊగిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు తోటి కోడలి మీద చాడీలు చెప్పడం మానుకోవా అని తిడుతుంది. నేను చెప్పింది నిజమో అబద్ధమో అడగండి అని మల్లిక అంటే నువ్వేమి మాట్లాడవేంటి అని జ్ఞానంబ అంటుంది. పాల కోసం పసిపిల్లవాడు ఏడుస్తుంటే కొన్ని పాలు తీసి ఇచ్చినట్టు జానకి చెప్తుంది. విన్నారు కదా ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది చాడిలో జాడిలో అని మల్లిక మంట పెడుతుంది. నేను నీకు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి అమ్మవారికి చేసే నైవేద్యం శ్రేష్టంగా నియమ నిష్టలతో చెయ్యాలని ముందే చెప్పను అపవిత్రం అయితే అమ్మవారి ఆశీస్సులు మన కుటుంబానికి లభించవని చెప్పాను కదా, చాలా భక్తి శ్రద్ధలతో చెయ్యాలని చెప్తే నా మాట నీ చెవికి ఎక్కలేదా నైవేద్యం పవిత్రత నీకు అర్థం కాలేదా అని తిడుతుంది. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే అని జానకి చెప్తుంటే నీ ఆలోచన మంచిదే కానీ బయట కోటలో కొనక్కొచ్చి ఇవ్వొచ్చు కదా కానీ నైవేద్యం కోసం ఉంచిన పాలు ఎంగిలి అయ్యాయి అది అపవిత్రం అని నీకు తెలియదా అని నిలదిస్తుంది. మధ్యలో మల్లిక అత్తయ్యగారు మీరు పెట్టిన ఐదు షరతుల్లో జానకి ఒక తప్పు చేసేసింది ముందు వాటి లాగా తూచ్ అనడానికి వీల్లేదు ఇది మన కుటుంబ ఆచార్య వ్యవహారాలకి సంబంధించిన విషయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కచ్చితంగా ఒక అంకె కొట్టేసి తీరాల్సిందే అని పుల్లలు వేస్తుంది.


Also Read: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి


జ్ఞానంబ జానకిని తిట్టబోతుంటే పాలు తీసుకున్న ఆమె అక్కడికి వస్తుంది. ‘దేవుడి కోసం ఉంచిన పాలు నా బిడ్డకి ఇవ్వడం తప్పో కాదో నాకు తెలియదు కానీ మీ కోసలు మాత్రం నా బిడ్డ ప్రాణాలు కాపాడిన దేవత. నా ఆరోగ్యం కారణంగా నా బిడ్డకి పాలిచ్చే పరిస్థితి లేదు, మల్లికని చూపిస్తూ ఈవిడగారు తగలడం వల్ల బాటిల్ లో పాలు కింద పడిపోయాయి. బాబు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయాడు, ఆ పాలతో తను నా బిడ్డకి ప్రాణం పోసింది లేదంటే నాకు కడుపు కోత మిగిలేది దయచేసి ఆవిడని ఏమి అనకండి’ అని చెప్పి వెళ్ళిపోతుంది. జ్ఞానంబ మల్లిక వైపు కోపంగా చూస్తుంది. కంగారుగా వెళ్తుంటే అనుకోకుండా చెయ్యి తగిలింది నన్ను కొట్టాలన్నా తిట్టాలన్నా ఇంటికి వెళ్ళినాక చెయ్యండి లేదంటే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ప్లీజ్ అని వేడుకుంటుంది. మానవత్వంతో జానకి గారు పసి బిడ్డ ప్రాణం కాపాడారు అది తప్పు ఎలా అవుతుందని రామా కూడా అంటాడు. పూజారి కూడా మంచి పనే చేసింది  ఏం పరవాలేదు నైవేద్యం ఇప్పించమని చెప్తాడు. పూజ చక్కగా పూర్తవుతుంది.