Jagadhatri November 30th Episode: మా ఫ్రెండ్ ముందు నన్ను అవమానిస్తావు కదా నిన్ను ఇంతకంటే ఘోరంగా అవమానిస్తాను అని మనసులో అనుకుంటుంది నిషిక.
మరోవైపు కీర్తి బర్త్ డే ఉంది అని పార్టీ నుంచి బయలుదేరుతుంది మాధురి. అక్కడ ఉన్న ఒక ఫ్రెండ్ నాకూడా పని ఉంది నేను కూడా నీతోనే వచ్చేస్తాను అని ఆమెతో పాటు బయలుదేరుతాడు. దారిలో మాధురి ఇందాక అవమానించిన వ్యక్తి వెంటపడి ఆమెతో మిస్ బిహేవ్ చేస్తాడు. పక్కనే ఉన్న ఫ్రెండ్ వారించబోతే వాడిని కొడతాడు. ఆ ఫ్రెండ్ మన ఫ్రెండ్స్ ని తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు అయితే మాధురి మిస్ బిహేవ్ భరించలేక అతడిని గట్టిగా కొడుతుంది ఆ దెబ్బకు అతను చనిపోతాడు. అది చూసి కంగారుగా బయటికి వచ్చేస్తుంది మాధురి. ఇందాక ఫ్రెండ్ ని తీసుకువస్తాను అని చెప్పిన ఫ్రెండ్ ఎదురైతే అతనిని తీసుకువెళ్లి చనిపోయిన వాడిని చూపిస్తుంది. వాడు చనిపోయాడు అని చెప్తాడు ఫ్రెండ్.
మాధురి: కంగారుపడుతూ పోలీసులకి ఫోన్ చేయమంటుంది.
ఫ్రెండ్: ఏమీ వద్దు ముందు ఇక్కడి నుంచి పదా అని చెప్పి ఆమెని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ ఆ డెడ్ బాడీని చూసి భయపడి కేసు మనమీదకు వస్తుంది అని చెప్పి పారిపోతారు.
మరోవైపు కౌశికి ఇంటికి సురేష్ వచ్చి ధాత్రికి ఫోన్ చేస్తాడు. బయటికి వచ్చిన ధాత్రితో ఇలా అంటాడు.
సురేష్: లోపలికి వస్తే గొడవవుతుంది ఈ గిఫ్ట్, కేకు కీర్తికి ఇచ్చేయ్.
ఇంతలోనే అక్కడికి వచ్చిన కీర్తిని ఆనందంగా హగ్ చేసుకుంటాడు సురేష్. అది చూసి ఎమోషనల్ అవుతారు ధాత్రి, కేదార్. కూతుర్ని తీసుకు వెళ్లి బండిమీద కేకు కట్ చేయించి గిఫ్ట్ ఇస్తాడు సురేష్.
సురేష్: ధాత్రికి థాంక్స్ చెప్పి మీ ఇద్దరినీ ఇలా చూస్తే చాలా సంతోషంగా ఉంది అయినా మీ ఇద్దరు ఈ ఇంట్లో ఎందుకు ఉన్నారు.
ధాత్రి : అదంతా పెద్ద కథ తర్వాత చెప్తాను.
సురేష్ : నేను ఇక్కడ నుంచి వెళ్తాను.. మళ్ళీ ఎవరైనా చూస్తే గొడవవుతుంది.
కీర్తి: తనతో పాటు లోపలికి రమ్మంటుంది.
ధాత్రి : కీర్తి ఊరుకునేలాగా లేదు తన సంతోషం కోసమే కదా ఇక్కడ వరకు వచ్చారు పర్వాలేదు లోపలికి రండి అనటంతో అందరూ ఇంట్లోకి వెళ్తారు.
కౌషికి: సురేష్ ని చూసి కోపంతో రగిలిపోతుంది. ఎందుకు వచ్చావు అని కేకలు వేస్తుంది.
వైజయంతి : మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వవా కీర్తిని కౌషికిని వదిలేయటానికి ఎంత కావాలి అని అడుగుతుంది.
సురేష్: బంధాలకి విలువ కట్టే అంత దిగజారిపోలేదు అంటూ కౌషికి వైపు తిరిగి నీకు భర్త అవసరం లేకపోవచ్చు కానీ నా బిడ్డకి తండ్రి అవసరం ఉంది తనకి తండ్రి అవసరమైన ప్రతిసారి నేను వస్తాను.
ఆ ఇంట్లో వాళ్ళందరూ సురేష్ ని అవమానించేలాగా మాట్లాడి బయటికి పొమ్మంటారు.
ధాత్రి : ఆ తండ్రికి ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ అందరి తండ్రులకి ఉంటే కొంత మంది జీవితాలు బాగుపడేవి అని కేదార్ తండ్రి ని కోపంగా చూస్తూ మాట్లాడుతుంది.
వైజయంతి : ఇది మా ఇంటికి సంబంధించిన విషయం మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది అంటూ కీర్తి చేతిలో ఉన్న బొమ్మ లాక్కొని పగలగొడుతుంది.
ధాత్రి : కోపంతో అత్తయ్య అని అరుస్తుంది.
సురేష్: వద్దమ్మా, వీళ్ళు ఎప్పటికైనా మారతారు అనుకున్నాను కానీ వీళ్ళలో ఇంక మార్పు రాదు వదిలేయ్ అంటూ నిషిక దగ్గరికి వెళ్లి మీ పెళ్ళికి రాలేకపోయాను అంటూ ఆమె చేతిలో గిఫ్ట్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు.
నిషిక: అప్పటికే కౌశిక్ మీద కోపంతో ఉన్న నిషిక నన్నే అవమానించావు కదా ఇప్పుడు చూడు అని మనసులో అనుకుంటూ ఆగండి అన్నయ్యగారు అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply