Jagadhatri Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో ఇంటికి వచ్చిన దివ్యాంకని గుమ్మంలోనే ఆపేస్తుంది ధాత్రి.


ధాత్రి: ఎదుటి వాళ్ళు ఏడిస్తే పండగ చేసుకోవాలనుకునే నీలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు, అయినా వద్దు అంటుంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తావు  అంటుంది.


దివ్యాంక : నన్ను అభిమానించే వాళ్ళు పిలిస్తేనే ఇక్కడికి వచ్చాను అంటుంది.


నిషిక: నా గెస్ట్ లని నువ్వు ఇంటికి రావద్దు అని చెప్పటం ఏమిటి అని కోప్పడి దివ్యాంక వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళ్లిపోతుంది.


ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ కౌషికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది.


వైజయంతి : నిషికి ఉద్యోగం వచ్చిందని చిన్న పార్టీ ఇస్తుంది. నచ్చిన వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతారు లేని వాళ్ళు వాళ్ళ రూంలోకి వెళ్లిపోతారు అంటుంది.


కౌషికి : తను స్నేహం చేసే వాళ్ళు మంచి వాళ్ళు కాదు అంటుంది.


దివ్యాంక: నన్ను సురేష్ ని పక్కపక్కన చూసి ఓర్వలేక ఆ కోపాన్ని నిషిక మీద చూపిస్తే ఏం లాభం అంటుంది.


కౌషికి: మీరు ఏ గంగలో దూకితే నాకేంటి అంటుంది.


దివ్యాంక : నీ బాధ నీ కళ్ళల్లో తెలిసిపోతుంది బయట పెట్టు లేదంటే గుండాగి చచ్చిపోతావ్ అంటుంది.


కేదార్: ఇంటికి వచ్చిన గెస్ట్ కాబట్టి ఊరుకుంటున్నాను లేదంటే మా అక్కని ఇలా అన్నందుకు ఊరుకునే వాడిని కాదు అంటాడు.


కేదార్ ని మందలిస్తుంది వైజయంతి.


ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళిపోతుంది కౌషికి. తన గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటే దివ్యాంక సురేష్ ని తీసుకొని అక్కడికి వస్తుంది.


దివ్యాంక : తన కాలు నొప్పి గురించి మాట్లాడుతూ సురేష్ వినకుండా కౌషికి చెవి దగ్గరికి వెళ్లి నీ అనుమతి లేకుండా నీ ఇంట్లోకి చీమ కూడా దూరదు అని విర్రవీగేదానివి అలాంటిది నీ ముందర నిలబడి నీకే వార్నింగ్ ఇస్తున్నాను అంటే నీ పతనం ప్రారంభమైంది అని చెప్పి సురేష్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


మరోవైపు ధాత్రి దంపతులు మాట్లాడుకుంటూ ఆ వచ్చిన వాళ్ళు వదిన దగ్గర ఉన్న ఎవిడెన్స్ కోసం వచ్చారు. ఎలా అయినా అది వాళ్ళ చేతికి చిక్కకుండా చేయాలి అనుకుంటారు.


మరోవైపు ధాత్రి  పోలీస్ అవునా కాదా అని తెలుసుకోవడం కోసం యువరాజ్ ఒక ప్లాన్ వేస్తాడు. ధాత్రి తో వడలు వేయించేలాగా ప్లాన్ చేస్తాడు.


ధాత్రి వడలు పిండి కలుపుతూ ఉంటే చేతికి ఉన్న గాయాన్ని చూసి ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకుంటాడు.


యువరాజ్: నువ్వు జగదాత్రి ఐపీఎస్ వని నాకు తెలుసు ఇప్పటికైనా ఒప్పుకో అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కేదార్ ని చూసి మర్యాదగా నిజం ఒప్పుకోండి మీరు పోలీసులే కదా అంటాడు.


ఇంతలో నిషిక, వైజయంతి అక్కడికి వస్తారు.  మీరు ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది నిషిక.


యువరాజ్: వీళ్ళిద్దరూ స్కూల్లో టీచింగ్ చేయడం లేదు వీళ్ళు పోలీసులు అంటాడు.


నిషిక : వాళ్లే పోలీసులని నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది.


యువరాజ్: నిన్న సెక్యూరిటీ అతను జగదాత్రిని గుర్తుపట్టాడు. అక్క కూడా చెప్పింది కదా తనని కాపాడిన అమ్మాయికి చేతి మీద గాయం అయిందని ఇదిగో చూడు అంటూ ధాత్రి చేయి పట్టుకుని చూపిస్తాడు.


నిషిక : ఒక్క నిమిషం పాటు వాళ్లు పోలీసులు అంటే నమ్మేసాను. ఆ గాయం నిన్న కాయగూలు కోస్తుంటే అయింది అని చెప్తుంది.


ఆశ్చర్య పోవడం యువరాజ్ వంతు అవుతుంది. అప్పటివరకు భయం నటించిన ధాత్రి దంపతులు చిన్నగా నవ్వుకుంటారు.


అంతకు ముందు రోజు రాత్రి ఏం జరుగుతుందంటే  ధాత్రి దగ్గరికి వచ్చిన కేదార్ యువరాజ్ పోలీసు ఎవరు వెతికే పనిలో ఉన్నారు ఇప్పుడు నీ గాయాన్ని చూసి నువ్వే పోలీసు అని గుర్తుపడతాడేమో అంటాడు.


అందుకు నేను ఒక ప్లాన్ వేసాను అంటుంది ధాత్రి. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.