Jagadhatri Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో ఆ పెన్ డ్రైవ్ ఇచ్చెయ్ అక్క లేకపోతే వాళ్లు నిన్ను ఏమైనా చేస్తారు అని భయపెడతాడు యువరాజ్.


కేదార్: అక్క జోలికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా చంపేస్తాను తను నిజం చెప్పాలనుకుంటుంది, నిజం చెప్తుంది అంతే అంటాడు.


కౌషికి : ధైర్యం చెప్పవలసిన తమ్ముడు భయం నూరు పోస్తుంటే ఏ సంబంధం లేని వాడు కవచమై కాపాడుతానంటున్నాడు అంటుంది.


నిషిక: మీ గురించి బాధపడుతున్నారు కాబట్టే పెన్ డ్రైవ్ ఇచ్చేయమంటున్నారు బయట వాడు కాబట్టే సినిమా డైలాగులు చెప్తున్నాడు అంటుంది.


సుధాకర్: ఈసారి నాకు కూడా ఎందుకో కంగారుగా ఉందమ్మ ఆ పెన్ డ్రైవ్ ఇచ్చేయ్ మళ్లీ మినిస్టర్ తప్పులు చేయకపోడు మనకి దొరక్కపోడు అప్పుడు చూసుకుందాం అంటాడు.


కౌషికి : ఏం జరిగితే అదే జరిగింది బాబాయ్ ఎలా అయినా ఆ న్యూస్ నేను టెలికాస్ట్ చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది.


యువరాజ్: ఈ విషయం మీనన్ కి చెప్పాలి తను వేరే ప్లాన్ ఏదైనా వేస్తాడు అని మనసులో అనుకొని లోపలికి వెళ్ళిపోతాడు.


నిషిక : ఈ విషయం దివ్యాంక కి చెప్పాలి తను వేరే ప్లాన్ ఏదైనా వేసి ఆ పెన్ డ్రైవ్ సాధిస్తుంది అనుకొని తన రూమ్ కి వెళ్ళిపోతుంది.


జగదాత్రి: అందరూ వెళ్ళిపోయిన తర్వాత యువరాజ్ పెన్ డ్రైవ్ కోసం అంత ఫోర్స్ చేస్తున్నాడు అంటే మీనన్ దగ్గరనుంచి ఫోన్ వచ్చి ఉంటుంది. అంటే ఈ న్యూస్ టెలికాస్ట్ కాకుండా చూడటం కోసం మీనన్ ఎంత పనైనా చేస్తాడు అంటుంది. ఇంతలో ఇంటికి ఒక వ్యాన్ రావడం గమనిస్తుంది. మన ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు పద వాళ్ల సంగతి చూద్దాం. ఎవరు అటాక్ చేయడానికి వచ్చారో,ఎవరు సేవ్ చేయడానికి వచ్చారో ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే అంతా జరిగిపోవాలి అంటుంది.


దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కౌషికి పీక మీద కత్తి పెట్టి పెన్ డ్రైవ్ అడుగుతాడు. తను ఇవ్వను అంటే నీ కూతురు బ్రతకాలంటే నువ్వు పెన్ డ్రైవ్ ఇచ్చి తీరాల్సిందే అని కీర్తి వైపు చూపిస్తాడు. అక్కడ కీర్తి పక్కన ఒక దుండగుడు ఆమె పీక మీద కత్తి పెట్టి రెడీగా ఉంటాడు. దాంతో భయపడిన కౌషికి పెన్ డ్రైవ్ అతని చేతిలో పెట్టబోతుంది. అంతలో ధాత్రి ముసుగులో వచ్చి కౌషికి ని వాడి నుంచి కాపాడుతుంది. పెన్ డ్రైవ్ కూడా అతనికి అందనివ్వదు. మరో రౌడీ సుధాకర్ మీదకి అటాచ్ చేయబోతే కేదార్ కాపాడుతాడు. సుధాకర్ కి తన వెనుక ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది కానీ వెనక్కి తిరిగేసరికి ఎవరూ ఉండరు.


అలాగే నిషిక రూమ్ లోకి వెళ్లి ఆమెపై అటాక్ చేయబోతాడు ఒక దుండగుడు. భయంతో ఆమె కేక వేస్తుంది. కేదార్ ఆ దుండగుడితో ఫైట్ చేసే వాడిని అక్కడి నుంచి పట్టుకుపోతాడు. ధాత్రి దంపతులు ఇద్దరు రౌడీలని బయటపడేసి ఇది ఇక్కడితో ఆగదు మనం ప్రతి నిమిషం అలర్ట్ గా ఉండాలి అనుకుంటారు.


వైజయంతి: కోడలు దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది.


నిషిక: జరిగిందంతా చెప్తుంది. వైజయంతి కోడల్ని తీసుకుని కిందికి వెళ్ళిపోయి జరిగిందంతా భర్తకు చెప్తుంది.


అప్పుడే కౌషికి కిందికి వస్తుంది ఆమె కూడా తనకు జరిగిన అనుభవం చెప్తుంది.


వైజయంతి: మరి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డావు అని అడుగుతుంది.


కౌషికి : ఎవరో ఒక అమ్మాయి వచ్చి సేవ్ చేసింది ఆమె ఫైటింగ్ చేసిన విధానం చూస్తే రెండు కళ్ళు చాలలేదు ఆ సమయంలో ఆమె చేతికి గాయం కూడా అయింది అంటుంది.


యువరాజ్: ఆడవాళ్ళందరి చేతులు ఎవరికి అనుమానం రాకుండా గమనిస్తాడు ఎవరి చేతికి గాయం కనిపించకపోవడంతో ఎవరు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్? మా ఇంట్లో సమస్య వస్తున్నట్లు తనకి ముందుగానే ఎలా తెలుస్తుంది అని అనుకుంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.