Brahmamudi Serial Today Episode: కళ్యాణ్ లోపలికి వెళ్లి రాజ్ ఫోన్ తీసుకొచ్చి చూసి షాక్ అవుతాడు. కావ్య ఆత్రుతగా చూస్తుంటుంది. ఫోన్ చూసిన కళ్యాణ్ వీళ్లిద్దరి మధ్య స్నేహం కన్నా మించింది ఏదో ఉంది. అనగానే కావ్య షాక్ అవుతుంది. అలాగని అప్పుడే మనం ఒక అభిప్రాయానికి రాకూడదు వదిన. నేను ఫోన్ పెట్టేసి వస్తాను. అని లోపల ఫోన్ పెట్టి పక్కకు వెళ్లిపోతారు.


కళ్యాణ్: వదిన కొంచెం గుండె నిబ్బరంతో వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. తొణక్కుండా బెణక్కుండా వెనకడుగు వేయకుండా! సహనంతో ముందడుగు వేయాలి.


కావ్య: అందుకు ఎం చేయాలి.


కళ్యాణ్: మీరు అన్నయ్య పక్కనే ఉండాలి.


కావ్య: మీ అన్నయ్య మనసులో వేరే అమ్మాయి ఉన్నప్పుడు నేను పక్కన ఉండి ఏం చేయాలి కవిగారు.


కళ్యాణ్: అన్నయ్యతో పాటు మీరు ఆఫీసుకు వెళ్లాలి.


కావ్య: ఏ ఇంట్లో ఉండి ఏం చెబుతున్నారు కవిగారు. నేను వెళ్లి అందరికీ కాఫీ, టిఫిన్లు ఏర్పాటు చేయాలి వస్తాను.


  అంటూ కావ్య వెళ్లిపోతుంది. కళ్యాణ్ అలాగే చూస్తుండిపోతాడు. మరోవైపు మూర్తి ఇంట్లోకి రాగానే కనకం వచ్చి టిఫిన్ తినమని చెప్తుంది. అప్పు ఎక్కడా అని మూర్తి అడుగుతాడు. పడుకుంది ఇంకా లేవలేదు. మీరైతే టిఫిన్ చేయండి అంటుంది కనకం. ఇంతలో అప్పు లోపలి నుంచి వచ్చి రెడీ అవుతుంది. ఎక్కడకు అని అడుగుతారు. పిజ్జా డెలివరీ జాబ్ వచ్చింది వెళ్తున్నానని అంటుంది. దీంతో ఈ జాబులు ఎందుకు పై చదువులు చదువుకో అని చెప్తారు. ఏమీ వద్దని మంచి జాబ్ దొరకగానే ఈ పని మానేస్తా అని చెప్పి వెళ్లిపోతుంది అప్పు.  బయటకు వచ్చిన అప్పూను వాళ్ల ఫ్రెండ్ వచ్చి బైక్ పై ఆఫీసుకు తీసుకెళ్తాడు. మరోవైపు రాజ్ ఫోన్ కు శ్వేత కాల్ చేస్తుంది. అక్కడే ఉన్న కావ్య ఫోన్ తీసుకుని చూసి కోపంగా ఫీలవుతుంది. ఇంతలో రాజ్ వచ్చి కావ్య చేతిలోంచి ఫోన్ లాక్కుంటాడు.


కావ్య: ఎందుకు అలా లాగేసుకున్నారు. కుక్క ముక్కను ఎత్తుకుని పరిగెత్తినట్లు.. నేనా ఆ ఫోన్ అందుకుని పరుగెడతానుకున్నావా?


రాజ్: నేను ఎందుకు అలా అనుకుంటాను. కొత్త క్లయింట్..


కావ్య: పాత క్లయింటు కాదా?


  అంటూ కావ్య ఇన్  డైరెక్టుగా మాట్లాడుతుంటే రాజ్ కన్పీజ్ అవుతాడు. మరోసారి వెటకారంగా మాట్లాడితే రాజ్ తికమకపడతాడు. ఇంకా ఏదేదో మాట్లాడి కావ్య బయటకు వెళ్లిపోతుంది. ఒక ముక్కను లాగి మాట్లాడటం దీనికి మాత్రమే తెలిసిన విద్య. అనుకుని ఇరిటేట్ అవుతుండగానే శ్వేత మళ్లీ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేసి ఇవాళ మొత్తం నేను నీతోనే ఉంటానని చెప్తాడు రాజ్. మరోవైపు హాల్ లో అందరూ కూర్చుని ఉండగా కళ్యాణ్ వచ్చి అపర్ణతో గీజర్ రిపేర్ చేయడానికి టెక్నీషియన్ ని రమ్మన్నారు కదా ఎన్ని గంటలకు రమ్మనాలి అంటూ అడగ్గానే అపర్ణ అవసరం లేదని అంతగా అవసరం అనుకుంటే రాజ్ తో  చేయించుకుంటానంటుంది.


కళ్యాణ్: అన్నయ్యను ఎందుకు డిస్టర్బ్ చేయడం పెద్దమ్మ.. నేనున్నానుగా


అపర్ణ: నీకు పని చెప్పడానికి నేనెవరిని చెప్పు.


కళ్యాణ్: అంటే అన్నయ్యను నన్ను వేరుగా చూస్తున్నావా పెద్దమ్మ..


అపర్ణ: నేనెప్పుడు అలా చూడలేదు కళ్యాణ్. కానీ అలా చూసేలా చేస్తున్నారు.


రుద్రాణి: చూసేలా చేస్తున్నారా? చాలా విచిత్రంగా ఉంది వదిన.. నిన్ను కాదని నీ మాటకు విలువ ఇవ్వని వారు ఇంట్లో ఎవరున్నారు.


కళ్యాణ్: అసలేమైంది పెద్దమ్మా ఎందుకు నన్ను దూరం పెట్టాలనుకుంటున్నారు. నేనేం తప్పు చేశాను పెద్దమ్మ.


  అనగానే అవన్నీ ఎందుకులే కళ్యాణ్. నాకు ఏదైనా అవసరం అయితే రాజ్ ఉన్నాడు. లేదంటే మీ పెద్దనాన్న ఉన్నారుగా నీకు మళ్లీ ఏదైనా పని చెబితే నిన్ను ఇంట్లో పనివాణ్ణి చేశామని ఫీలవుతారు అంటూ అపర్ణ అనగానే.. అంత డొంక తిరుగుడు ఎందుకు అక్కా.. నిన్న నేను అన్నదానికే ఇలా మాట్లాడుతున్నానని చెప్పొచ్చు కదా అంటూ ధాన్యలక్ష్మీ కోపంగా అడుగుతుంది. దీంతో ఇద్దరూ వాదులాడుకుంటుంటే.. దూరం నుంచి హ్యాపీగా చూస్తున్న రుద్రాణి వచ్చి మరింత మంట పెడుతుంది. దీంతో ఇందిరాదేవి అందరిని తిట్టి ధాన్యలక్ష్మీ, అపర్ణను  గార్డెన్ లోకి తీసుకెళ్లి ఇద్దరికీ క్లాస్ తీసుకుంటుంది.  నేను మీకు అత్తలా చెప్పడం లేదని.. తల్లిలా చెప్తున్నానని అర్థం చేసుకోండని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మెగా ప్రిన్సెస్ క్లీంకార అమ్మమ్మ ఇంట్లో ఒకరు, నానమ్మ ఇంట్లో మరొకరు - ఊహ తెలిసే వయసుకు ఇంకెన్నో?