Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో మాట్లాడితే నాకు ఏ హక్కు లేదంటావు, అసలు నాకు ఏం హక్కు ఉన్నదో నీకేం తెలుసు. ఇంకా గట్టిగా మాట్లాడితే నీ కన్నా ఎక్కువ హక్కు ఉంది అంటుంది ధాత్రి.
నిషిక : ఏం మాట్లాడుతున్నావ్, ఎలా నాకన్నా నీకు ఎక్కువ అధికరాలు వస్తాయి అని అడుగుతుంది.
ధాత్రి: కొద్దిరోజులు ఓపిక పడితే అన్ని నిజాలు తెలుస్తాయి, అందరి నోరు మూయిస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
వైజయంతి: తనేంటమ్మా అలా మాట్లాడుతుంది అని కోడలి దగ్గరికి వచ్చి అంటుంది.
నిషిక : దాని మాటలు పట్టించుకోకుండా అత్తయ్య అది ఎలాగో మరొక వారంలో ఇక్కడనుంచి వెళ్ళిపోతుంది అప్పుడు నేనే ఈ ఇంటికి మహారాణి అని చెప్పి దివ్యాంకని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది.
బయటికి వచ్చిన తర్వాత దివ్యాంక ఆ ధాత్రి కి ఈ ఇంట్లో ఇంత పవర్ ఉందని నాకు తెలియదు అంటుంది.
నిషిక: అలాంటిదేమీ లేదు తను ఒక వారం రోజుల్లో వెళ్ళిపోతుంది అంటుంది.
దివ్యాంక: తన కాన్ఫిడెన్స్ చూస్తుంటే తను బయటికి వెళ్లి పోయే మనిషిలా కనిపించడం లేదు ఇంట్లో పాతుకు పోయే మనిషిలాగ కనిపిస్తుంది ఇకపై ఈ ఇంట్లో నాకు ఇద్దరు శత్రువులు అన్నమాట అనుకుంటుంది. ఆ తర్వాత నిషికకి తన కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు ఆఫర్ చేస్తుంది.
నిషిక : ఆనందంతో పొంగిపోతుంది. నా టాలెంట్ ని మా ఇంట్లో వాళ్ళు గుర్తించలేదు కానీ మీరు గుర్తించారు అంటుంది.
దివ్యాంక : నీకు ఈ జాబ్ ఆఫర్ చేసింది నీ మీద ప్రేమతో కాదు ఆ కౌషికి మీద పగతో నీ చేత ఇల్లీగల్ పనులు చేయించి ఆ కౌషికిని ఇరకాటంలో పెడతాను అనుకుంటుంది.
మరోవైపు ధాత్రి వాళ్ళు సూరి మామ ఇంటికి బయలుదేరుతారు. ఇన్నాళ్లు తండ్రి ఎవరో తెలియని కొడుకు లాగా పెరిగాను ఇకపై అన్ని ప్రశ్నలకు సమాధానంగా సాక్ష్యం దొరకపోతుంది అని భార్యతో చెప్పి ఆనందపడతాడు కేదార్.
ఇంతలో యువరాజ్ సూరి మామ ఇంటికి వెళ్తాడు.
యువరాజ్: సూరి మామ అంటే మీరే కదా అని అడుగుతాడు.
సూరి మామ: అవును నాయనా నువ్వు ఎవరు అని అడుగుతాడు.
యువరాజ్: నేను కేదార్ ఫ్రెండ్ ని మీరు ఈరోజు ఏదో సాక్ష్యం ఇస్తానన్నారు కదా తను బిజీగా ఉండి నన్ను పంపించాడు అంటాడు.
సూరి మామ: ముందు నమ్ముతాడు కానీ ఎందుకో అనుమానం వచ్చి ఒకసారి కేదార్ చేత ఫోన్ చేయించు అంటాడు.
యువరాజ్: సూరి మామ మనవరాలు పీక మీద కత్తి పెట్టి సాక్ష్యాధారాలు తీసుకురమ్మని బెదిరిస్తాడు.
సూరి మామ భయంతో సుధాకర్, సుహాసిని ఫోటో తీసుకువస్తాడు. ఇది కేదార్ తల్లిదండ్రుల ఫోటో అని చెప్తాడు.
యువరాజ్ షాక్ అయిపోతూ ఆ ఫోటో తీసుకుంటాడు. వెంటనే ఎలర్ట్అ యిన సూరి మామ యువరాజ్ కళ్ళల్లో కారం కొట్టి మనవరాలు తీసుకుని వెళ్ళబోతూ యువరాజ్ చేతిలో ఫోటో లాక్కుంటాడు కానీ ఫోటో చిరిగిపోయి ఒక ముక్క మాత్రమే సూరి మామ చేతిలోకి వస్తుంది అయినా అక్కడినుంచి పారిపోతాడు సూరి మామ.
ఇంతలో ధాత్రి వాళ్ళు అక్కడికి వస్తారు. కింద పడి ఉన్న వస్తువులను చూసి మనం రాకముందు ఇక్కడ ఏదో జరిగింది అనుకుంటారు. అంతలో పక్కన సౌండ్ రావడంతో అక్కడికి వెళ్లి చూస్తారు. అక్కడ యువరాజ్ గోడదూకి పారిపోవటం కనిపిస్తుంది. విషయం అర్థం చేసుకుంటారు ధాత్రి దంపతులు.
కేదార్: యువరాజ్ కి నిజం తెలిసిపోయింది ఉన్న ఒక్క సాక్ష్యం కూడా పోయింది అని బాధపడతాడు.
ధాత్రి : నీ తండ్రి చేతిలో నీ చేయి పెడతానని మాట ఇచ్చాను మాట తప్పను అని కేదార్ కి ధైర్యం చెప్తుంది.
మరోవైపు యువరాజ్ తండ్రి చేసిన మోసాన్ని భరించలేక పోతాడు. భార్యకి నిజం తెలిస్తే ఎక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతుందో అని భయపడతాడు. ఈ విషయం ఎప్పటికీ నిషికకి తెలియకూడదు అనుకుంటాడు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.