Jagadhatri Serial Today Episode : ఎపిసోడ్ ప్రారంభంలో ఆట ఆడుకుందాము దాక్కోమని కీర్తి కి చెప్తాడు యువరాజ్. కీర్తి వెళ్లి ద్ధాత్రి వాళ్ళ రూంలో దాక్కుంటుంది.


యువరాజ్: ఈ డమ్మీ గన్ తో భయపెట్టి వాళ్ళు పోలీసులు అవునో కాదో తేల్చేస్తాను అనుకుంటూ ధాత్రి వాళ్ళ రూమ్ కి వెళ్తాడు.


అప్పుడే ధాత్రి వాళ్ళు ఫేక్ మ్యారేజ్ సర్టిఫికెట్ చేయించాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే యువరాజ్ వచ్చి వెనకనుంచి ధాత్రి తలకి గన్ గురి పెడతాడు.


యువరాజ్: నువ్వు పోలీసని తెలిసిపోయింది, ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగులో గుద్దులాట ముసుకు తీసేయ్ అంటాడు.


ధాత్రి దంపతులిద్దరూ యువరాజ్ కి నిజం తెలిసిపోయిందేమో అని కంగారు పడతారు. అయితే ధాత్రి దాక్కొని ఉన్న కీర్తిని చూస్తుంది. యువరాజ్ కి నిజం తెలియదు కేవలం చీకట్లో బాణం వేస్తున్నాడు అనుకోని వెనక్కి తిరిగి యువరాజు చేతిలో డమ్మీ గన్ లాక్కుంటుంది.


ధాత్రి : నువ్వు దొంగ వని నాకు తెలుసు ఇంకా ఎన్నాళ్ళు ముసుగులో ఉంటావు నువ్వు కూడా ముసుగు తీసి బయటికి రా అంటుంది.


యువరాజ్ : కంగారు పడుతూ నేను దొంగనేమిటి నేను కీర్తి ఆడుకుంటున్నాము అంటాడు.


ధాత్రి: కీర్తి మాట్లాడలేదు కదా అందుకే తన తరఫున నేను మాట్లాడుతున్నాను నేను ఊరికే అన్నాను అనటంతో కీర్తిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యువరాజ్.


ధాత్రి :యువరాజ్ కి మనమే పోలీసులు అని బాగా డౌట్ వచ్చేసింది ఒకవేళ నిజం యువరాజ్ ద్వారా మీనన్ కి తెలిస్తే మనతోపాటు మన ఫ్యామిలీస్ ని కూడా వదిలిపెట్టడు అందుకే మీనన్ ని త్వరగా పట్టుకోవాలి అని కేదార్ తో చెప్తుంది.


ఆ తర్వాత నిషిక దివ్యాంకతో కౌషికిని తక్కువ చేస్తూ ఫోన్ లో మాట్లాడుతుంది.


ధాత్రి : ఆవిడ వదినకి శత్రువు ఆవిడతో మాట్లాడతావేంటి నీకేమైనా పిచ్చా అంటుంది.


కౌషికి: తను నువ్వు అనుకున్నంత మంచిది కాదు తనతో మాట్లాడటం మానేయ్ అంటుంది.


నిషిక: నాకు ఈ జగధాత్రి అంటే పడదు మీరు తనతో మాట్లాడటం మానేస్తే నేను దివ్యాంకతో మాట్లాడటం మానేస్తాను అంటుంది.


నిషిక మొండితనానికి చివాట్లు పెడుతుంది ధాత్రి. ఫోన్లో ఇదంతా వింటున్నా దివ్యాంక ఆనందపడుతుంది.


దివ్యాంక : నిషిక నేను నా ఫ్రెండ్ కౌషికి తో మాట్లాడాలి అనటంతో నిషిక ఫోన్ స్పీకర్ లో పెడుతుంది అప్పుడు దివ్యాంక మాట్లాడుతూ ఇకమీదట నువ్వు కనిపించొద్దు అన్నా కనిపిస్తాను వినిపించొద్దు అన్నా వినిపిస్తాను అని వెటకారంగా అంటుంది. అలాగే రేపు సురేష్ అంబేద్కర్ ఆడిటోరియంలో అవార్డు అందుకుంటున్నాడు నువ్వు అక్కడికి వచ్చేయ్ అంటుంది. రాను అంటుంది కౌషికి. మర్యాదగా వచ్చేయ్ లేదంటే ఎలా రప్పించాలో నాకు తెలుసు అనటంతో కోపంగా ఫోన్ పెట్టేస్తుంది కౌషికి.


కౌషికి : నిషిక ఇన్నాళ్లు ఏం చేసినా ఓపిక పట్టాను కానీ ఇప్పుడు తను చేస్తున్న పని ఎంత ప్రమాదానికి దారితీస్తుందో నేను ఎందుకు ఇంత భయపడుతున్నానో తర్వాత మీకే అర్థమవుతుంది అని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


నిషిక ఎందుకు ఇంత తెలివి తక్కువ పని చేస్తుంది అని చెల్లెల్ని తిట్టుకుంటుంది ధాత్రి.


మరోవైపు స్వామి మీనన్ దగ్గరికి వచ్చి రేపు ఆపరేషన్ కి అన్ని సిద్ధం చేశాను అంటాడు. యువరాజ్ కి ఒకసారి ఫోన్ కలుపు అని మీనన్ అనడంతో యువరాజ్ కి ఫోన్ చేస్తాడు స్వామి. ఆ ఫోన్ పోలీసులకి కనెక్ట్ అవుతుంది. పోలీస్ బాస్ ధాత్రి వాళ్ళకి ఫోన్ కనెక్ట్ చేస్తాడు


మీనన్ : యువరాజ్ రేపు ఒక పెద్ద తలకాయ కిడ్నాప్ జరగబోతుంది. నువ్వు బ్యాకప్ గా ఉంటే చాలు. ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేయి అంటాడు.


యువరాజ్: నేను ఏ పనైనా చేస్తాను కానీ చంపటం చేయలేను దానికోసం ఎవరినైనా చూసుకో అంటాడు.


మీనన్ : నువ్వు చంపనంటే నేను నిన్ను చంపేస్తాను మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా చంపేస్తాను అంటూ బెదిరిస్తాడు.


యువరాజ్: అలా చేయొద్దు నా మాట విను నేను స్పాట్ కి రాను అనట్లేదు వస్తాను అక్కడ ఏ ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా చూసుకుంటాను చంపటం మాత్రం చేయలేను అంటాడు


మీనన్: సరే అయితే ఒక షూటర్ ని పంపిస్తాను ఇది మనకి చాలా ఇంపార్టెంట్ డీలింగ్ ఫెయిల్ అవ్వకుండా చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.


ఈ మాటలు అన్నీ పోలీసులు అందరూ వింటారు పోలీస్ హెడ్ ధాత్రి ని ఈ టాస్క్ కి హెడ్ గా ఉండి మానిటర్ చేయమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.


కేదార్: రేపు ఈ మిషన్ లో పాల్గొన్న వాళ్లందర్నీ చంపేయమని ఆర్డర్స్ వస్తే ఎలా అంటాడు.


ధాత్రి: నాకు సెంటిమెంట్ ఉంటుందేమో కానీ నా యూనిఫారం కి సెంటిమెంట్ ఉండదు అంటుంది ధాత్రి అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Read Also: కొంత మంది ఇడియట్స్ ఆ పని చేశారు, ఈ అవార్డు వాళ్లకే అంకితం: షారుఖ్ ఖాన్