Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు రిలీజ్ చేయరు? మా నాన్నని మాతో పంపిస్తే తీసుకొని వెళ్ళిపోతాం అంటాడు యువరాజ్.


ఎస్సై: నన్ను కాదని ఈ స్టేషన్ నుంచి మీ నాన్నని తీసుకెళ్లగలవా ప్రయత్నించి చూడు అని పొగరుగా అంటాడు.


ధాత్రి: పోనీ ఒక పది నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాం అంటుంది.


ఎస్సై కుదరదు అనడంతో కౌషికి ఇదే మాట మీడియా ముందు చెప్తారా అంటుంది. సరే అయితే పది నిమిషాల్లో మాట్లాడవచ్చేయండి అని పర్మిషన్ ఇస్తాడు ఎస్ఐ


మేము మాట్లాడి వస్తాము అని కౌషికితో చెప్పి సుధాకర్ దగ్గరికి వెళ్తారు రాత్రి దంపతులు.


యువరాజ్: అసలు ఈ ధాత్రి వాళ్ళు ఇంట్లో చెప్పకుండా ఏదో చేస్తున్నారు. ఇంట్లో వంట చేసుకునే ధాత్రి కి ఇన్ని సెక్షన్ల గురించి ఎలా తెలుసు? మీనన్ చెప్పినట్లు తనే పోలీసా అని అనుమాన పడతాడు.


మరోవైపు సుధాకర్ దగ్గరికి వెళ్లిన కేదార్ దంపతులు సుధాకర్ తో మాట్లాడి అతనికి ధైర్యం చెప్తారు.


ధాత్రి : తలదించుకున్న సుధాకర్ తో మీరు తలదించుకోకండి మావయ్య, మీరు తప్పు చేయరని మాకు తెలుసు అసలు మీరు అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతుంది.


సుధాకర్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఇంతలో రెడ్డితో సహా అక్కడికి వచ్చిన ఎస్ఐ వాళ్ళు మాట్లాడుకోకుండా డిస్టబెన్స్ చేస్తూ ఉంటారు. ధాత్రి మందలిస్తుంది కానీ వాళ్ళు పట్టించుకోరు.


ధాత్రి : రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్ లో ఉన్నందువల్ల సాక్ష్యాలు అన్ని మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినా ఏం పర్వాలేదు నిజం దానంతట అదే బయటకు వస్తుంది అంటుంది.


కేదార్ గూడా తండ్రికి ధైర్యం చెప్తాడు.


రెడ్డి : ఎస్ఐ తో మాట్లాడుతూ మీరేం చేస్తారో నాకు తెలియదు రేపు కోర్టులో అతనే హత్య చేశానని ఒప్పుకోవాలి అంటాడు.


మీరేం కంగారు పడకండి మరో రెండు హత్య కేసులు ఒప్పుకోమన్నా కూడా ఒప్పుకునే లాగా చేస్తాను అంటాడు ఎస్సై.


ధాత్రి: వాళ్ల దగ్గరికి వచ్చి మా మామయ్య గారిని నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో నాకు తెలుసు కానీ ఆయన ఒంటి మీద చిన్న గీతపడినా ఊరుకునేది లేదు అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


బయటికి వచ్చిన తర్వాత బాబాయ్ గురించి భయంగా ఉంది ఆయన తప్పు చేసే మనిషి కాదు అని ధాత్రి వాళ్ళ దగ్గర భయపడుతుంది కౌశికి.


ధాత్రి : మీరేమీ ఏ కంగారు పడకండి మనం సాయంత్రం మళ్ళీ వచ్చి ఒకసారి మావయ్య గారిని చూద్దాం అంటుంది.


యువరాజ్: ధాత్రి దగ్గరికి వచ్చి అసలు ఎవరు నువ్వు, ఇంట్లో ఎలుకకి కూడా భయపడే నువ్వు ఎక్కడ ఇంత మందిని భయపెడుతున్నావు అని నిలదీస్తాడు.


కేదార్: వెంటనే అవును ధాత్రి నాక్కూడా అదే అనుమానంగా ఉంది అంటూ ఏమి తెలియని వాడిలాగా అడుగుతాడు.


ధాత్రి: నా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను అంటుంది.


ఇంతలో సీనియర్ ఆఫీసర్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో మేమిద్దరం బండి మీద వస్తాము మీరు కారులో బయలుదేరండి అని కౌషికి వాళ్ళకి చెప్పి పక్కకి వచ్చిన ధాత్రి దంపతులు సీనియర్ తో మాట్లాడతారు. విషయం అంతా తెలుసుకున్న సీనియర్ ఈ కేసు సిఐడి కి వెళ్లే లాగా ఉంది. ఈ కేసు మీకే అప్పగిస్తాను త్వరగా ప్రాబ్లం సాల్వ్ చేయండి. అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సీనియర్. తరువాత యువరాజ్, కౌషికి కారులో కూర్చున్న తర్వాత మీనన్ దగ్గరనుంచి యువరాజ్ కి ఫోన్ వస్తుంది.


మీనన్: నాకు ఎలాగైనా పెన్ డ్రైవ్ కావాలి, అందుకు మీ అక్క అడ్డం అనుకుంటే దానిని అడ్డుతప్పిస్తాను అని బెదిరిస్తాడు.


యువరాజ్: నా కుటుంబం జోలికి రావద్దు ఎలాగైనా నీకు ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి మళ్ళీ కార్లో కూర్చుంటాడు.


కౌషికి : నువ్వు ఇప్పుడు మీనన్ తో మాట్లాడావా అని అనుమానంగా అడుగుతుంది.


యువరాజ్: కంగారుపడుతూ లేదక్క మా ఫ్రెండ్ మాధవ్ తో మాట్లాడాను అని చెప్పి తప్పించుకుంటాడు.


మరోవైపు బాధపడుతున్న అత్తగారికి ధైర్యం చెప్తూ ఉంటుంది నిషిక. అంతలోనే అక్కడికి కాచి, బూచి వస్తారు.


బూచి : మావయ్య గారు ఒకవేళ అరెస్టు అయితే మనకే నష్టం అంటాడు.


ఏం మాట్లాడుతున్నారు అంటుంది నిషిక.


కాచి : అవును ఆఫీస్ అంతా మేనేజ్ చేసేది అక్క అయినప్పటికీ నిర్ణయాలు తీసుకునేది మాత్రం పెదనాన్నే. ఇప్పుడు అలాంటి పెదనాన్న జైలుకు వెళ్తే ఇక మొత్తం పెత్తనం అక్క చేతిలోకి వెళ్ళిపోతుంది, లేదంటే ఆ ధాత్రి వాళ్ళకి అప్పగిస్తుంది అని చెప్తారు.


ఆ మాటలకి నిషిక భయపడిపోతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.