Jagadhatri Today Episode : ఈరోజు ఎపిసోడ్ లో యువరాజ్ తన తల్లి గురించి తప్పుగా మాట్లాడంతో అతనిపై చేయి చేసుకుంటాడు కేదార్.


కేదార్ : నా తల్లి గురించి మళ్ళీ తప్పుగా మాట్లాడావంటే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇస్తాడు.


యువరాజ్: మళ్లీ మళ్లీ మాట్లాడుతాను, ఇప్పుడే మాట్లాడుతాను ఏం చేస్తావ్ అని కేదార్ షర్ట్ పట్టుకుంటాడు యువరాజ్.


వాళ్ళిద్దర్నీ విడిపిస్తారు కౌషికి, ఆమె చిన్నాన్న.


యువరాజ్: తండ్రితో మాట్లాడుతూ వాడితో నీకు ఏదైనా బంధం ఉన్నట్లు తెలిస్తే మాత్రం మా ఇద్దరిలో ఎవరో ఒకరు మిగులుతారు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


కౌషికి : ఇప్పుడు సంతోషంగా ఉందా.. నీకు కావాల్సింది ఇదే కదా అయినా సాక్షాలు లేకుండా మా చిన్నాన్నని నాన్న అని పిలవద్దు అని కేదార్ ని హెచ్చరిస్తుంది.


కేదార్: సరే, కానీ ఈలోపు మా అమ్మ గురించి యువరాజ్ తప్పుగా మాట్లాడితే నేను కూడా ఊరుకునేది లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


ఆ తర్వాత భోజనాల దగ్గర ఒక్కడే కూర్చున్న యువరాజ్ అవమానభారంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ధాత్రి వస్తుంది.


యువరాజ్: ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటారు, అసలు మీకు ఏం కావాలి అయినా మీకు పరాయి ఇంట్లో పడి తినడానికి సిగ్గుగా లేదా అని అడుగుతాడు.


ధాత్రి : నువ్వు ఆవేశంగా ఉన్నావు తర్వాత మాట్లాడదాం.


యువరాజ్: మీరు డబ్బు కోసమే వచ్చారని నాకు తెలుసు. డబ్బు కోసం భార్యని పరాయి ఇంట్లో ఉంచిన వ్యక్తి అదే డబ్బు కోసం భార్యని పరాయి వాడి పక్కలో అని మాట్లాడుతూ ఉండగానే అతని చెంప పగలగొడుతుంది ధాత్రి.


ధాత్రి : తప్పుగా మాట్లాడావంటే చంపిపారేస్తాను అని హెచ్చరిస్తుంది.


ఇంతలో ఆ శబ్ధానికి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు ఏం జరిగింది అని అడుగుతారు.


ధాత్రి : ఏమీ లేదు మా మరిది గారు నా చేతి వంట రుచి చూడాలనుకున్నారు కొంచెం రుచి చూపించాను అంటుంది.


నిషిక: అయితే ఏదో కొట్టినట్లుగా సౌండ్ ఎందుకు వచ్చింది అని భర్త వైపు తిరిగి మీ చెంప మీద ఎవరు చాచి కొట్టినట్లు అలా కందిపోయింది ఏంటి?


యువరాజ్: ఇప్పుడు ఈ విషయం చెప్తే కేదార్ నాన్నని నాన్న అని పిలిచాడనే విషయం కూడా చెప్పాలి అనుకొని.. ఏమి మాట్లాడకుండా కామ్ గా ఉండిపోతాడు.


నిషిక : నాకు ఏదో అనుమానంగా ఉంది నువ్వే మా ఆయన్ని ఏదో అన్నావు కదా అని కోపంగా అంటుంది.


ధాత్రి : మీ ఆయన కొడితే కొట్టించుకునే అంత చేతగానివాడా అని అడుగుతుంది.


గొడవ ఎందుకు అని భార్యని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యువరాజ్.


ధాత్రి గదిలోకి వచ్చిన వెంటనే అసలు ఏం జరిగింది అని అడుగుతాడు కేదార్. ధాత్రి ఏదో సర్ది చెప్తుంది.


కేదార్: ఇలాంటి విషయాలు అన్ని బయట వాళ్లతో చెప్పు నాకు కాదు.


ధాత్రి : నిజమే నేను యువరాజ్ ని కొట్టాను అంటూ నిజం చెప్పడం ఇష్టం లేక నీ గురించి తప్పుగా మాట్లాడాడు అంటుంది.


వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ధాత్రికి సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేస్తాడు. స్వామిని తీసుకురావడానికి అన్ని రెడీగా ఉన్నాయి మీకు లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చేయండి అంటాడు. అందుకు ఓకే చెప్తుంది ధాత్రి.


తర్వాత ఆ లోకేషన్ కి వెళ్లి అన్నీ చెక్ చేసిన తర్వాత పై ఆఫీసర్ కి ధాత్రి, కేదార్ ఇన్ఫామ్ చేయడంతో స్వామిని తీసుకొని అక్కడికి వస్తారు.


ధాత్రి : స్వామిని నిజం చెప్పమంటుంది ధాత్రి అతను ఎంతకీ నిజం చెప్పకపోతే వీడు ఇంక నిజం చెప్పడు సార్ ఎన్కౌంటర్ చేసేద్దాం అంటుంది.


స్వామి: నిజం చెప్తే మీనన్ ని చంపేస్తాడు చెప్పకపోతే వీళ్లు చంపేస్తారు, వీళ్లకు చెప్పడం మంచిది అని మనసులో అనుకొని నెక్స్ట్ ప్లాన్ గురించి చెప్తాడు.


ఇంతలో మీనన్ వాళ్ళు అక్కడికి వస్తారు. ధాత్రి మీనన్ వైపు చూసి ఏదో మాట్లాడే లోపు ఆమె గన్ లాక్కొని ఆమెకే గురిపెడతాడు స్వామి. ఆమెని మీనన్ దగ్గరికి తీసుకువెళ్తారు.


మీనన్ : మీరు ఫైట్ చేస్తున్నప్పుడు నేను చూశాను మీకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను అయినా మీరు నా వెనక ఎందుకు పడ్డారు నేను మామూలు బిజినెస్ మ్యాన్ ని.


ధాత్రి: నువ్వు బిజినెస్ చేసేది మనుషులతో వాళ్ల ప్రాణాలతో అని నాకు తెలుసు నువ్వు సమాజానికి ముప్పు అని ధైర్యంగా మాట్లాడుతుంది.


మీనన్: చావు అంచుల్లో ఉన్నా కూడా ఇంత ధైర్యంగా ఉన్నావు నీకు అసలు భయమే లేదా


ధాత్రి: భయపడేదాన్నే అయితే అసలు ఈ జాబ్ లోనే జాయిన్ అవ్వను అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.