Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్ వీక్‌కు ఇంకా ఒక వారమే ఉంది. ఈవారంలో జరిగే ఎలిమినేషన్ అనేది ఫైనల్ వీక్‌లోకి వెళ్లే హౌజ్‌మేట్స్ ఎవరో డిసైడ్ చేస్తుంది. దీంతో ఇప్పటినుంచి ఓటింగ్స్ అనేవి కీలకంగా మారనున్నాయి. సోషల్ మీడియా ప్రకారం ఈవారం ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అనేది బయటికొచ్చింది. అయితే ఫినాలే అస్త్రా సాధించినా కూడా అర్జున్ మాత్రం ఓటింగ్ విషయంలో డేంజర్ జోన్‌లో ఉన్నాడని సమాచారం. ఈ విషయాన్ని గతవారం నాగార్జుననే స్వయంగా రివీల్ చేశారు. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అసలైతే అర్జున్ ఎలిమినేట్ అవ్వాలని, కానీ తను ఫినాలే అస్త్రాను సొంతం చేసుకున్నాడు కాబట్టి హౌజ్‌లో ఉన్నాడని తెలిపారు. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. 


‘స్పై’ బ్యాచ్ సేఫ్..
ఈవారం నామినేషన్స్‌లో అర్జున్ మినహా అందరు హౌజ్‌మేట్స్ ఉన్నారు. అందులో పల్లవి ప్రశాంత్, శివాజీలకే అందరికంటే ఎక్కువ ఫ్యాన్‌బేస్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రతీవారంలాగానే ఈవారం కూడా ఈ ఇద్దరిలో ఒకరు.. అంటే పల్లవి ప్రశాంత్.. ఓట్ల విషయంలో టాప్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. మొదట్లో ఓటింగ్ విషయంలో కొన్నాళ్లపాటు శివాజీనే టాప్ స్థానంలో ఉన్నాడు. కానీ మెల్లగా తను రెండో స్థానానికి చేరుకోవడంతో తన శిష్యుడు ప్రశాంత్ మొదటిస్థానంలోకి వచ్చాడు. ఇక వీరిద్దరి తర్వాత ‘స్పై’ బ్యాచ్‌లో మిగిలిన యావర్‌కు కూడా ఓటింగ్ శాతం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘స్పై’ బ్యాచ్ ఇప్పట్లో ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్ వీక్‌కు చేరుకుంటారని అర్థమవుతోంది.


ఒకేవారం మొదటిస్థానంలో..
చివరి కెప్టెన్సీ సమయంలో అమర్‌దీప్ ప్రేక్షకుల్లో విపరీతమైన జాలి ఏర్పడింది. కెప్టెన్ అవ్వలేకపోతున్నానని అమర్ విపరీతంగా బాధపడుతుండడంతో.. చాలామంది ఆ బాధను చూసి కరిగిపోయి తనకు ఓట్లు వేశారు. అందుకే ఒకవారంలో ఓటింగ్ విషయంలో అమర్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. కానీ ఎక్కువకాలం ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఫినాలే అస్త్రా వీక్‌లో అమర్‌పై మళ్లీ ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఏర్పడింది. ఫ్రెండ్స్‌ను నమ్ముకొని పైకి రావాలి అనుకోవడం, ఫౌల్ ఆడి గెలవాలి అనుకోవడం.. ఇదంతా ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో ఓటింగ్ లిస్ట్‌లో ‘స్పై’ బ్యాచ్ తర్వాత స్థానానికి చేరుకున్నాడు అమర్. అయినా కూడా సేఫ్ జోన్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది.


డేంజర్‌ జోన్‌లో ఇద్దరు..
ఇక మిగిలిన ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్.. ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా శోభా శెట్టి వెళ్లిపోతే బాగుంటుంది అని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఎప్పటినుంచో తను ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని ఎదురుచూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రియాంక, శోభాల ఓటింగ్ శాతంలో పెద్దగా తేడాలు లేవు. కానీ ప్రియాంకతో పోలిస్తే శోభాకే ఎక్కువగా నెగిటివిటీ ఉండడంతో ప్రియాంకకు ఓట్లు వేసి ప్రేక్షకులు.. తనను సేవ్ చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే శోభా.. ఈ వీక్ ఎలిమినేట్ అయిపోవడం ఖాయం అని సోషల్ మీడియలో ప్రచారం మొదలయ్యింది.


Also Read: శోభా, ఏమిటి మాకీ క్షోభ - ఆమెకు ఎవరు ఓట్లు వేస్తున్నారంటూ చర్చ, ఈ వారమైనా వెళ్తుందా?