Jagadhatri Telugu Serial Today Episode: పెళ్లి విషయంలోనే అబద్ధం చెప్పిన వారు ఇంకే విషయంలో అయినా అబద్ధం చెప్పటానికి వెనుకాడరు అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది కౌషికి.

ధాత్రి: వదినకి అనుమానం బలపడింది ఎలాగైనా సాక్ష్యాలు తీసుకురావాలి.

కేదార్: లేని సాక్ష్యాలు ఎలా పుట్టిస్తాం.

ధాత్రి : ఎలాగైనా తీసుకురావాలి అంటుంది.

మరుసటి రోజు పొద్దున్నే ఇంట్లో హడావిడి చూసి కంగారుపడుతుంది ధాత్రి.

కౌషికి : నీకోసమే చూస్తున్నాను వచ్చేసావా నల్లపూసల ఫంక్షన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటుంది.

ధాత్రి: ఆ మాటలకి కంగారు పడుతుంది.

కౌషికి : ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతుంది.

ధాత్రి: అలాంటిదేమీ లేదు అంటుంది.

కౌషికి :నిజమే పెళ్లి కాకుండా నల్లపూసల ఫంక్షన్ జరిగితే కంగారు పడాలి కానీ పెళ్లయిన వాళ్ళకి కంగారు ఎందుకు అని వెటకారంగా అంటుంది.

ఇంతలో నిషిక అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది అని అడుగుతుంది.

కౌషికి : ధాత్రి వాళ్ళకి నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది.

నిషిక: ఈ ఇంటి కోడల్ని నేను నాకు కాకుండా దానికి ఫంక్షన్ చేయటం ఏంటి నేను ఒప్పుకోను అంటుంది.

ధాత్రి : హమ్మయ్య నిషిక గొడవ పెట్టుకోవడం వల్ల ఈ ఫంక్షన్ ఆగిపోతే బాగుండు అనుకుంటుంది.

కౌశషికి : వాళ్లతో పాటు మీకు కూడా ఫంక్షన్ జరుగుతుంది కానీ నాకు చెప్పే అవకాశం ఇవ్వటం లేదు అంటుంది.

నిషిక: వాళ్లతో పాటు నేను ఫంక్షన్ చేసుకోవడం ఏంటి, కుదరదు అని మొండికేస్తుంది.

వైజయంతి : ఇప్పుడు గొడవ పెట్టుకుంటే నీ తప్పులన్నీ బయటికి లాగుతుంది ఎందుకు గొడవ అన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తుంది.

అర్థం చేసుకున్న నిషిక ఫంక్షన్ కి ఒప్పుకుంటుంది. నిషిక ఒప్పుకోవడంతో ధాత్రి షాక్ అవుతుంది. కౌషికి వెళ్లి రెడీ అవ్వండి అని చెప్పడంతో ఇద్దరూ రెడీ అవ్వటానికి వెళ్తారు.

ధాత్రి : కేదార్ దగ్గరికి వెళ్లి కింద నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంటే నువ్వేంటి ఇంత కూల్ గా ఉన్నావు అని అడుగుతుంది.

కేదార్: ఊరికే కంగారు పడితే లేనిపోని అనుమానాలు వస్తాయి అంటాడు.

ధాత్రి: అది నిజమేలే అంటూ సీనియర్ ఇందాక ఫోన్ చేశారు మాట్లాడటం అవ్వలేదు అని అప్పుడు సీనియర్ కి ఫోన్ చేస్తుంది.

సీనియర్: మీనన్ వాళ్ళు పంచలోహా విగ్రహాన్ని స్మగ్లింగ్ చేయడానికి ఈ రోజు ప్లాన్ వేశారు వాళ్ళని ఎలా అయినా పట్టుకోవాలి. ఇందులో యువరాజ్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తారేమో ఓ కన్నేసి ఉంచండి అని చెప్తాడు. ధాత్రి ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పడంతో అలాంటివన్నీ డ్యూటీ సమయంలో పనికిరావు. అయినా పర్మిషన్ తీసుకొని పనిచేయడం ఎప్పటినుంచి ప్రారంభించావు అని మందలిస్తాడు ఆఫీసర్.

కేదార్: ఇప్పుడు ఎలా బయటికి వెళ్దాం.

ధాత్రి : వదిన నమ్మే విధంగా ఏదో ఒకటి చేయాలి ముందు కిందికి పదా అనటంతో ఇద్దరూ కిందికి వస్తారు.

అదే సమయంలో మీనన్ యువరాజ్ కి ఫోన్ చేసి పంచలోహ విగ్రహాలు స్మగ్లింగ్ జరుగుతుంది. నువ్వు కూడా హ్యాండిల్ చేయాలి అని చెప్తాడు.

యువరాజ్: ఇంట్లో ఫంక్షన్ ఉంది ఈరోజు కుదరదు అంటూ ఉండగానే

మేనన్ : గొంతులో మాట గొంతులోనే ఉంచేయ్ యువరాజ్ అలాంటి కారణాలు నాకు చెప్పకు లేదంటే ప్రాణం తీసేస్తాను అని బెదిరిస్తాడు.

యువరాజ్: సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి మీనన్ ని తిట్టుకుంటాడు. చెప్పి వెళ్తే ఇంట్లో ఒప్పుకోరు అందుకని చెప్పకుండా ఇంట్లోంచి బయటికి వెళ్తాడు.

మరోవైపు కిందికి వచ్చిన ధాత్రి దంపతులను పీటల మీద కూర్చోమని చెప్తుంది కౌషికి.

ధాత్రి : ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళ నానమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి నీ ప్రాణం పోతున్నట్టుగా యాక్ట్ చెయ్యు అని చెప్తుంది. 

లోపలికి వచ్చిన తర్వాత ధాత్రి మొహం ప్రశాంతంగా ఉండటం చూసి ఏదో జరుగుతుంది అనుకుంటుంది కౌషికి. ధాత్రి వాళ్ళని పీటల మీద కూర్చోబెట్టి ధాత్రి మెడలో కట్టమని నల్లపూసల దండ కేదార్ చేతికి ఇస్తుంది. ధాత్రి దంపతులు ఇద్దరు కంగారు పడతారు.

అదే సమయంలో సుభద్రమ్మ కింద పడిపోయి కాలు విరిగినట్లుగా యాక్ట్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళు హాస్పిటల్ కి తీసుకు వెళ్తాను అంటే వద్దు చచ్చిపోతానేమో అని భయంగా ఉంది ధాత్రిని పిలవండి.. అప్పటికీ బ్రతికి ఉంటే అప్పుడు తీసుకువెళ్దురుగాని అంటుంది.

మరోవైపు పీటల మీద కూర్చున్న ధాత్రి ఇంకా ఫోన్ రాలేదు ఏంటి అని కంగారుపడుతుంది. సరిగ్గా యువరాజ్ మెడలో తాళి వేసే సమయానికి ఫోన్ రావడం తో ఫోన్ మాట్లాడిన ధాత్రి కంగారుగా లేచిపోయి జరిగిందంతా కౌషికి కి చెప్పి నేను వెళ్తాను అంటుంది.

నిషిక : నేను కూడా వస్తాను అనటంతో ధాత్రి దంపతులు ఇద్దరు షాక్ అవుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.