Jagadhatri Serial Today Episode నీటితో నడిచే యంత్రం తయారు చేసిన ప్రొఫెసర్‌ని మీనన్ గ్యాంగ్ కిడ్నాప్ చేయాలని ప్రయత్నించడంతో జేడీ, కేడీలు ప్రొఫెసర్‌ని కాపాడే బాధ్యత తీసుకుంటారు. దారిలో రౌడీలు జేడీ, కేడీల మీద అటాక్ చేస్తారు.
జేడీ కేడీలు రౌడీలను చితక్కొడతారు. మరోవైపు యువరాజ్ హెల్మట్ పెట్టి బైక్ మీద ప్రొఫెసర్ కార్‌ని ఫాలో అవుతాడు. పోలీసుల్ని గన్‌తో కొట్టి ప్రొఫెసర్ కోసం కారులో చూస్తాడు. అందులో ప్రొఫెసర్ లేకపోవడం చూసి షాక్ అయిపోతాడు యువరాజ్. వెంటనే మీనన్‌కి కాల్ చేసి భాయ్ ఇందులో ప్రొఫెసర్ లేడని చెప్తాడు. నేను కారు ఎక్కడ చూశానని మీనన్ అంటాడు. దానికి యువరాజ్ బాడీ డబుల్ యూజ్ చేశారని అంటాడు. మీనన్ షాక్ అయిపోతాడు.
జేడీ, కేడీలుల మన వాళ్లని చితక్కొడుతున్నారని చెప్తాడు. ప్రొఫెసర్‌ని ఎలా తీసుకెళ్లారని మీనన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకొని పెళ్లి కారులో ప్రొఫెసర్‌ని పెట్టారా ఛా అని అనుకుంటాడు. యువరాజ్‌ని మీనన్ వెళ్లిపోమని చెప్పి మళ్లీ ప్రొఫెసర్ పెళ్లి కారులో వెళ్తున్నాడని చెప్పి ప్రొఫెసర్‌ని చంపి అయినా సరే హార్డ్ డిస్క్ సంపాదించమని మీనన్ యువరాజ్‌కి చెప్తాడు.
జేడీ, కేడీలు యువరాజ్‌ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు కానీ తప్పించుకుంటాడు. జేడీ, కేడీలు ప్రొఫెసర్‌ని పెళ్లి కారులో పంపామని మీనన్ గ్రహించేసుంటాడని కిరణ్, రమ్య వాళ్లని ఎదుర్కొలేరు మనం వెంటనే వెళ్లాలి అని చెప్తుంది. మరోవైపు సుధాకర్, వైజయంతి, నిషికలు కారు చెడిపోవడంతో రోడ్డు మీద వెయిట్ చేస్తారు. టైర్ మార్చాలని అనుకుంటారు. ఇంతలో సుధాకర్ ప్రొఫెసర్‌కి కాల్ చేస్తారు. వాళ్లు సేమ్ రూట్‌లో రావడంతో ప్రొఫెసర్ సుధాకర్ వాళ్ల దగ్గర కారు ఆపుతాడు. పెళ్లి కారులో వచ్చారేంటి అని సుధాకర్ అడిగితే మీనన్ రౌడీలు ఫాలో అవ్వడం జేడీ, కేడీల ఎంట్రీ గురించి మొత్తం చెప్తారు. ఇదేదో ప్రాణాల మీదకు వచ్చేలా ఉందని వైజయంతి అంటే ఏం కాదు రండి అని ప్రొఫెసర్ పిలుస్తారు.
ప్రొఫెసర్ కారులో వైజయంతి, సుధాకర్, నిషికలు వెళ్తారు. జగద్ధాత్రి రమ్యకి కాల్ చేసి మీనన్‌కి బాడీ డబుల్ గురించి తెలిసిపోయిందని చెప్తుంది. ఇక రమ్య సుధాకర్ వాళ్లు కారు ఎక్కారని రమ్య చెప్పడంతో జగద్ధాత్రి షాక్ అయిపోతుంది. జేడీ రమ్యతో ప్రొఫెసర్ నెంబరు ఆపేయమని అంటుంది. ఇక వాళ్లని మీ కారులో మీరు వాళ్ల కారులో షిఫ్ట్ అవ్వమని అంటుంది. బ్లాక్ హెల్మ్‌ట్ వేసుకొని ఒకడు బైక్ మీద వస్తున్నాడు జాగ్రత్త అవసరం అయితే షూట్ చేసేయమని చెప్తుంది.
యవరాజ్ కారు ఆపించి డ్రైవర్‌ని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత కారులో సుధాకర్ వాళ్లని చూసి షాక్ అయిపోతాడు. ఇక డ్రైవర్ చనిపోవడంతో నిషిక, వైజయంతి వణికి పోతారు. యువరాజ్ రమ్య, కిరణ్‌ని కొడతాడు. యువరాజ్ మీనన్‌కి కాల్ చేస్తాడు. మీనన్ ప్రొఫెసర్‌ని చంపేయని చెప్తాడు. యువరాజ్ గన్ గురి పెట్టి అదే కారులో నా ఫ్యామిలీ ఉంది షూట్ చేయలేను అని అంటాడు. వాళ్లు ఆ కారులో ఎక్కడం వాళ్ల తప్పు నువ్వు ఇప్పుడు షూట్ చేయకపోతే ఆ ఫ్యామిలీని నేను చంపేస్తా అని మీనన్ యువరాజ్‌ని బెదిరిస్తాడు.
యువరాజ్ తన కన్న వాళ్లని భార్యని కూడా బెదిరించి కారులో అందర్ని తీసుకొని వెళ్లిపోతాడు. జేడీ, కేడీలు అక్కడికి వస్తే రమ్య, కిరణ్‌లు జరిగింది అంతా చెప్తారు. మీనన్ జేడీకి కాల్ చేసి శత్రువుని తక్కువగా అంచనా వేస్తున్నావా.. ఎప్పుడైతే బాడీ డబుల్ యూజ్ చేశావో అప్పుడే నువ్వు ఓడిపోయావ్ అని అంటాడు. ఈసారి ఓటమి నీదే అని మీనన్ అంటే అది ముగిసిన టైంకి చెప్పాలి అని జేడీ అంటుంది. ప్రొఫెసర్‌ని నా దగ్గర నుంచి తీసుకెళ్తావా అని మీనన్ అంటే కచ్చితంగా అని జగద్ధాత్రి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.