Jagadhatri Serial Today Episode కేథార్, జగద్ధాత్రిలు యువరాజ్‌ కేసు ఎంక్వైరీకి వెళ్తుంటారు. వెనకాలే కౌషికి ఫాలో అవుతుంది. వీళ్లని చూస్తే నా అనుమానమే నిజం అని అనిపిస్తుందని కౌషికి అనుకుంటుంది. కేథార్ అక్క కారుని చూసి జగద్ధాత్రితో అక్క ఫాలో అవుతుందని అంటాడు. 

Continues below advertisement

కౌషికిని ఎలా డైవర్ట్‌ చేయాలా అని ఇద్దరూ ఆలోచించి రోడ్డు మీద కారు ఆపేస్తారు. కారు ట్రబుల్‌ ఇచ్చినట్లు నటిస్తారు. ఏం తెలీనట్లు కౌషికిని అప్పుడే  చూసినట్లు నటిస్తారు. కౌషికి దగ్గరకు వెళ్తుంటే కౌషికి ఫాలో అవుతున్నా అని అనుకుంటారని ఫోన్ మాట్లాడినట్లు నటిస్తుంది. ఇక జగద్ధాత్రి, కేథార్‌లు కౌషికితో సాధుసార్ ఆఫీస్ ఇటు వైపే వదినా యువరాజ్ కేసు గురించి మాట్లాడటానికి వెళ్తున్నాం అని అంటారు. కౌషికి డ్రాప్ చేయడానికి ఇద్దరినీ ఎక్కించుకుంటుంది కానీ వీళ్లు చెప్పేది నిజమేనా అని అనుకుంటుంది. 

కౌషికి ఇద్దరినీ డ్రాప్ చేస్తుంది. సాధు మామయ్యతో నేను మాట్లాడుతా యువరాజ్ కేసు మేం చూసుకుంటాం అని జగద్ధాత్రి  అంటుంది. వదిన వెళ్లిపోరని ఎక్కడో ఒక చోట ఉండి మనకోసం ఎదురు చూస్తుంటారు మనం వెనక వైపు నుంచి వెళ్లిపోదాం అని జగద్ధాత్రి ఇన్వెస్టిగేషన్‌కి వెళ్తుంది. కౌషికి ఓ చోట ఆగి మళ్లీ వస్తారని వెయిట్ చేస్తుంది. 

Continues below advertisement

జేడీ, కేడీలు కేసు మల్లన్న ఇంటికి వెళ్తూ దారిలో ఓ భిక్షగాడి దగ్గర యువరాజ్ చంపిన మల్లన్నను పెట్టిన సూట్‌కేస్ చూస్తారు. జేడీ, కేడీ వెళ్లి ఆ భిక్షగాడిని ప్రశ్నిస్తారు. పోలీస్‌ స్టేషన్ దగ్గరున్న చెత్తకుప్పలో సూట్‌కేస్ దొరికిందని ఆయన చెప్తాడు. కేడీ ఫోరెన్సిక్ వాళ్లకి సమాచారం ఇచ్చి సూట్‌ కేస్ అప్పగించమని ఆయనతో చెప్తుంది. ఆయన ఫొటో తీసుకొని వెళ్లిపోతారు. సూట్‌ కేస్ మీద వేలిముద్రలతో నిందితులు దొరికిపోతారని కేథార్ అంటే అంత టైం లేదని మల్లన్న ఇంటికి వెళ్తారు. ఇక కౌషికి వెయిట్ చేసి చేసి ఆఫీస్‌కి వెళ్లిపోతుంది. 

జేడీ, కేడీలు మల్లన్న భార్యని కలుస్తారు. మల్లన్నకు శత్రువులు లేరని ఆ యువరాజ్ చిన్న గొడవకు నా భర్తని చంపేశాడు అతనికి శిక్ష పడేలా చేయండి అని అంటుంది. ఇక జేడీ అక్కడే ఉన్న డాక్టర్ ఇచ్చిన మందుల చీటీ చూస్తుంది.  జేడీ అది తీసుకోవడం చూసి మల్లన్న భార్య కంగారు పడుతుంది. తన భర్తకు యాక్సిడెంట్ అయింది అని ఆమె చెప్తుంది. ఇక జేడీ అక్కడే ఉన్న ఓ బిల్ కూడా చూసి ఏమైనా కొన్నారా అని అడుగుతుంది. పండగ వస్తుందని బట్టలు కొన్నామని చెప్తుంది.జేడీ అన్ని ఫొటోలు తీసుకుంటుంది. ఇక సిగరెట్ లైటర్ చూసి ప్రశ్నిస్తే తన భర్తకి సిగరెట్ తాగే అలవాటు ఉందని అంటుంది. 

జేడీ, కేడీలు మల్లన్న భార్యని చూసి అనుమానంగా ఉందని అనుకుంటారు. ఇంటి బయట ఉన్న స్కూటీ చూసి యాక్సిడెంట్ అయినట్లు లేదని అనుకుంటారు. ఇక డాక్టర్ బిల్ రమ్యకి పంపించి డిటైల్స్ అడుగుతుంది. రమ్య కిరణ్‌ని పంపిస్తుంది. తర్వాతా బార్‌కి వెళ్తారు. మల్లన్న ఇంట్లో దొరికిన లైటర్ చూపించి వెరైటీగా ఉందని ప్రశ్నిస్తారు.  అవి తన బాస్‌వి అని దుబాయి నుంచి తెప్పిస్తారు అని అంటారు. మల్లన్న గురించి అడిగితే మల్లన్న మంచోడు యువరాజే గొడవ పడి చంపేశాడని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.