Jagadhatri Serial Today Episode శ్రీవల్లి వైజయంతి తన తల్లి అని నమ్మేసి ఇంటి నుంచి వెళ్లిపోతా అంటుంది. జగద్ధాత్రి శ్రీవల్లికి ధైర్యం చెప్తుంది. శ్రీవల్లి తన కూతురు కాదని ఎలా నమ్మించాలా అని వైజయంతి అనుకుంటుంది. 

Continues below advertisement

కౌషికి వైజయంతి దగ్గరకి వెళ్లి నిజం చెప్పమని అంటుంది. నాకు తెలీనది ఏం చెప్పాలి.. ఏం సంబంధం లేని దానికి ఏం చెప్పాలి.. నా వ్యక్తిత్వాన్ని శంఖిస్తున్నారు.. ఈ అవమానం కంటే చావడం బెటర్ అని వైజయంతి అంటుంది. నిజం నిరూపించుకోవాలి కదా మీరు చావాలి అనడం ఏంటి అని కౌషికి అంటుంది. మళ్లీ మళ్లీ నాకు ఒకటే అడుగుతారు ఏంటి నాకు చావే గతి అని వైజయంతి అంటుంది. 

యువరాజ్ శ్రీవల్లి తన తల్లికే పుట్టిందని కోపంతో ఊగిపోతాడు. నిషిక యువరాజ్ దగ్గరకు వెళ్లి మీ నాన్న పెళ్లికి ముందు కొడుకుని కంటే మీ అమ్మ పెళ్లికి ముందు కూతుర్ని కనిందని అంటాడు. ఇంట్లో ఒక్కరు కూడా తిన్నగా లేరు నిషిక అంటుంది. యువరాజ్ రగిలిపోతాడు. ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టడం నా దురదృష్టం అని అనుకుంటాడు. నిషిక యువరాజ్‌తో ఈ సమస్యకు శ్రీవల్లిని చంపేయడం పరిష్కారం అని అంటుంది. పిచ్చా నీకు అని యువరాజ్ అంటాడు. మన ఇంటి పరువు పోకూడదు అంటే అది ఉండకూడదు అని అంటుంది. 

Continues below advertisement

యువరాజ్ నిషితో ఎంత కాదు అన్నా శ్రీవల్లి నా తోబుట్టువు.. అలా మాట్లాడకు అని అంటాడు. జగద్ధాత్రి, కేథార్ వచ్చి సూపర్‌ యువరాజ్‌ మీ అమ్మకి పుట్టిన అమ్మాయిని నువ్వు చెల్లి అని ఒప్పుకుంటావ్‌ కానీ మీ నాన్నకి పుట్టిన కొడుకుని మాత్రం అన్న అని ఒప్పుకోవా అని ప్రశ్నిస్తుంది. తోబుట్టువుని చంపాలి అన్న భార్యని చెప్తావు.. చెల్లి గురించి ఆలోచిస్తున్నావ్ కానీ అన్న గురించి ఏంటి అని అడుగుతుంది. నేను ఒక్కడినే వజ్రపాటి వారసుడిని అని యువరాజ్ అంటాడు. వాడిని ఎప్పటికీ అన్నగా ఒప్పుకోను అని అంటాడు. 

జగద్ధాత్రి కీర్తికి భోజనం తినిపిస్తుంది. కీర్తి ఫైటింగ్ బాగుందని జగద్ధాత్రికి సైగ చేస్తుంది. కేథార్ యువరాజ్ మాటకు బాధ పడుతుంటే జగద్ధాత్రి వెళ్లి ఓదార్చుతుంది. ఇద్దరూ శ్రీవల్లి గురించి మాట్లాడుకుంటారు. నాది శ్రీవల్లిది ఒకే పరిస్థితి అని కేథార్ బాధ పడతాడు. అత్తయ్య గారికి ఇంకో కూతురు ఉందని తెలిసినా మామయ్య గారు పెద్ద మనసుతో అంగీకరించారు.. జగద్ధాత్రి కేథార్‌తో శ్రీవల్లి ఎందుకో వైజయంతి అత్తయ్య కూతురు కాదని రోడ్డు మీద మనకు మీ అమ్మ ఫొటో కనిపించింది కదా..   అని అంటుంది. మహాల్‌లో గుమస్తాను కలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అని అనుకుంటారు.

జేడీ, కేడీలుగా గుమస్తాని కలుస్తారు.మీ అమ్మ ప్రెగ్నెంట్‌గా ఉందని చెప్తాడు. జగద్ధాత్రి కేథార్తో శ్రీవల్లి మీ చెల్లే అని అనిపిస్తుందని చెప్తాడు. శ్రీవల్లికి తల్లి ఫొటో చూపించాలని అనుకుంటారు. తను నా చెల్లే అయితే అంత కంటే సంతోషం ఏంటి అని కేథార్ అంటాడు. శ్రీవల్లి కీర్తి పాపతో బయట ఆడుకుంటూ ఉంటే కేథార్, జగద్ధాత్రి వెళ్తారు. కేథార్ శ్రీవల్లితో మా అమ్మ ఫొటో నీకు చూపిస్తా చూడు అని తీసుకెళ్తాడు. వైజయంతి విని షాక్ అయిపోతుంది. ముగ్గురిని అడ్డుకుంటుంది. నువ్వు నా కూతురు కాదని నేను నిరూపించుకునే వరకు నువ్వు ఎవరితో మాట్లాడటానికి వీళ్లేదు అని వైజయంతి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.