Jagadhatri Serial Today Episode శ్రీవల్లి జగద్ధాత్రిని పట్టుకొని ఏడుస్తుంది. జగద్ధాత్రి శ్రీవల్లితో వదిన చెప్పింది నిజమే బూచి అన్నయ్య మంచోడు అలాంటి వాడు కాదు అని చెప్తుంది. ఇక జగద్ధాత్రి, కౌషిక్‌లు శ్రీవల్లిని తమ గదికి తీసుకెళ్లి పడుకోపెట్టుకుంటారు. శ్రీవల్లిని భయపెట్టడానికే ఎవరో ఇలా చేశారు అని కేథార్ అనుకుంటే ఇందులో అత్తయ్య హస్తం ఉందా అని జగద్ధాత్రి అనుకుంటుంది.
శ్రీవల్లి జగద్ధాత్రి గదికి వస్తుంటే వైజయంతి ఆపి ఇందాక అలా అన్నాను అని బాధ పడకు మా అల్లుడు మంచోడు కాదు ఆడపిల్లలు కనిపిస్తే వాళ్ల జీవితం నాశనం చేసేస్తాడు. ఈరోజు నేను చూసి కాపాడాను.. రోజూ కాపాడలేను కదా.. నీ మంచి కోసమే చెప్తున్నా ఈ ఇంటి నుంచి వెళ్లిపోయి ఏదైనా ఆశ్రమంలో తలదాచుకో.. నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పుంటుంది. రేపు ఉదయమే ఆశ్రమానికి వెళ్లిపోతా అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు తలచుకొని శ్రీవల్లి ఆలోచిస్తుంది. అమ్మగారు చెప్పినట్లు రేపు ఉదయమే వెళ్లిపోవాలి అనుకుంటుంది.
శ్రీవల్లి ఉదయం బ్యాగ్ తీసుకొని కౌషికి గదికి వెళ్తుంది. నిద్రలో ఉన్న కౌషికి దగ్గర కూర్చొని క్షమించండి అక్క.. ఈ అనాథ మీద మీరు చూపించిన ప్రేమ నేను ఎప్పుడూ చూడలేదు.. నా క్షేమం కోసం నా సొంత మనుషుల్లా మీరు మదన పడ్డారు. మీరే నా సొంత మనుషులు అనుకున్నా కానీ ఆ దేవుడికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు.. నా వల్ల మీకు ఏ సమస్యలు రాకూడదు అని వెళ్లిపోతున్నా.. మళ్లీ జన్మ ఉంటే మీకు కేథార్ అన్నకి నేను తోడబుట్టిన దాన్ని అవ్వాలని చిన్నఆశ.. వెళ్లిపోతున్నా అక్క నన్ను క్షమించండి అని కౌషికి కాళ్లకి దండం పెట్టి బయటకు వెళ్తుంది.
జగద్ధాత్రి, కేథార్ బయటే ఉంటారు. శ్రీవల్లి వెళ్తూ వాళ్లని చూసి ఇలా వెళ్తే ఆపేస్తారని వేరే దారిలో వెళ్లాలి అని అనుకుంటుంది. జగద్ధాత్రికి ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది. చూస్తే శ్రీవల్లి కనిపించదు. శ్రీవల్లి వెనక దారిలో గోడ దూకి బయటకు వెళ్లిపోతుంది. తీరా వెళ్లే సరికి ఎదురుగా జగద్ధాత్రి కనిపించి గుడ్ మార్నింగ్ చెప్తుంది. గురువు గారు ఆశ్రమానికి పిలిచారు అందుకే వెళ్తున్నా అని శ్రీవల్లి అంటుంది. కేథార్ వచ్చి ఏమైంది ఎక్కడికి శ్రీవల్లి వెళ్లిపోతుంది అంటే రాత్రి జరిగిన విషయానికి వెళ్లిపోతుందని జగద్ధాత్రి అంటుంది. ఇంతలో అక్కడికి బూచి వచ్చి శ్రీవల్లి అని పిలుస్తాడు.
శ్రీవల్లి బూచిని చూసి వైజయంతి మాటలు గుర్తు చేసి వణికిపోతుంది. బూచి శ్రీవల్లి చేతులు పట్టుకోగానే శ్రీవల్లి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. బూచి శ్రీవల్లితో రాత్రి జరిగినదానికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కానీ నేను నీ మీద పడలేదమ్మా.. నిన్ను నా చెల్లిలా భావిస్తున్నాను.. నాకు తెలిసి ఆ వైజయంతి అత్తే తోసేసింది అని అంటాడు. ఏంటి అని జగద్ధాత్రి అడిగితే బూచి జగద్ధాత్రితో రాత్రి నేను వస్తే అత్తే డోర్ తీసింది.. అని బూచి చెప్తాడు. కేథార్ కూడా శ్రీవల్లితో బూచి అలాంటి వాడు కాదు నిన్ను చెల్లిలా చూసుకుంటాడు అని అంటాడు. అంతా అయోమయంగా ఉందని శ్రీవల్లి ఆలోచిస్తుంది.
జగద్ధాత్రి, కేథార్ భయపడొద్దు అని ఎవరు ఏం చెప్పినా వినొద్దని శ్రీవల్లితో చెప్తారు. బూచి తన తల్లి మీద ప్రమాణం చేస్తాడు. ఇక శ్రీవల్లి వైజయంతి చెప్పిన మాటలు చెప్తుంది. ఇన్నీ నా గురించి చెప్పిందా చెప్తా ఆగు అని బూచి జగద్ధాత్రి ఆపుతుంది. శ్రీవల్లిని, బూచిని పంపిస్తుంది. కేథార్‌తో శ్రీవల్లిని బయపెట్టి పంపాలి అనుకున్నారు అంటే అత్తయ్యకి శ్రీవల్లికి ఏదో సంబంధం ఉందని జగద్ధాత్రి అంటుంది. ఇద్దరూ ఇక నుంచి వైజయంతిని కనిపెడుతూ ఉండాలని అనుకుంటారు. వైజయంతి శ్రీవల్లి వెళ్లిపోయిందని హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఎదురుగా శ్రీవల్లిని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా ఇక్కడే ఉన్నావా అని వైజయంతి అంటే తను ఇక్కడే ఉంటుంది మీరు వెళ్లమని చెప్పాల్సిన పని లేదు అని జగద్ధాత్రి అంటుంది. నాకేం సంబంధం లేదని వైజయంతి అంటే అంతేనా పిన్నిఅని కేథార్ అంటాడు. కౌషికి, సుధాకర్ వస్తే శ్రీవల్లి ఇంటి నుంచి వెళ్లిపోవాలని అనుకుందని ఎవరో బూచి గురించి తప్పుగా చెప్పారని కేథార్ అంటాడు. ఎవరు చెప్పారు శ్రీవల్లి అని కౌషికి అడుగుతుంది. వైజయంతి కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.