Jagadhatri Serial Today Episode నిషిక తనని చంపాలనుకున్న టీనీని కౌషికినే తీసుకొచ్చిందని కౌషికి మీద నింద వేస్తుంది. కౌషికి ఎందుకు అలా చేస్తుందని అందరూ అంటారు. యువరాజ్‌కి ఇదంతా భాయ్ చేశాడని అర్థమై నిషితో చెప్తాడు. దాంతో నిషి వణికిపోతుంది. తర్వాత కౌషికికి సారీ చెప్తుంది.

Continues below advertisement

బూచి నిషితో నిన్ను కాపాడింది ఎవరు.. ఆ అమ్మాయి చేతికి బులెట్ గాయం కూడా అయింది.. పైగా గన్ సౌండ్ వచ్చిందని అడుగుతాడు. నాకు తెలీదు.. మీరు ఎవరో వచ్చి కాపాడారు అనుకున్నా మీరు కాదా అని నిషి అంటుంది. ఏదో జరిగింది అని అందరూ అనుకుంటారు. కౌషికి జగద్ధాత్రిని గుర్తు చేసుకుంటుంది. వైజయంతి అందరితో ఇది ఎవరో సూపర్ మెన్‌, సూపర్‌ ఉమెన్ పని అయింటుంది.. మనల్ని కాపాడటానికి వచ్చి కనిపించకుండా వెళ్లిపోయారని అంటుంది. ఇక అందరూ ఫంక్షన్‌కి టైం అయిపోయిందని అనుకుంటారు. వంశీ వెళ్తూ కేథార్, యువరాజ్ రాకూడదని అంటాడు.

కేథార్ జగద్ధాత్రి దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని అడుగుతాడు. జగద్ధాత్రి గన్ చూపిస్తుంది. ఫైరింగ్ చేసింది నువ్వే అని తెలుసు అని అంటాడు. వచ్చింది పార్లర్‌ పర్సన్‌ కాదు.. నిషిని చంపాలి అనే వచ్చింది.. రివాల్వర్‌ వచ్చింది అంటే వచ్చింది ఆర్డనరీ పర్సన్‌ కాదు.. వచ్చింది మీనన్ మనిషి అని యువరాజ్‌ కోసం వచ్చిందని అర్థమైంది.. మీనన్‌ యువరాజ్‌కి ఏదో పని చెప్పాడు.. యువరాజ్ నో చెప్పడంతో యువరాజ్‌ని భయపెట్టాలని చూశాడు.. మీనన్ ఇంత చేశాడు అంటే యువరాజ్‌ అవసరం మీనన్‌కి చాలా ఉంది అని జగద్ధాత్రి అంటుంది. కేథార్జగద్ధాత్రితో యువరాజ్ మీనన్‌ కోసం పని చేయకుండా చూడాలని అంటాడు. దానికి యువరాజ్ కూడా సపోర్ట్ చేయాలని జగద్ధాత్రి అంటుంది.

Continues below advertisement

ఇంతలో జగద్ధాత్రి వాళ్ల దగ్గరకు కౌషికి వస్తుంది. నిషిని కాపాడింది ఎవరు అనుకుంటున్నారు అని అడుగుతుంది. తెలీదు అని జగద్ధాత్రి అంటుంది. గన్‌ ఫైర్ చేసింది ఎవరు అని కౌషికి అడుగుతుంది.. తెలీదు అని జగద్ధాత్రి అంటుంది. నువ్వు బయటకే వెళ్లలేదు కానీ బయట నుంచి వచ్చావ్.. అంటే నువ్వే కదా అని కౌషికి అడుగుతుంది. జగద్ధాత్రి షాక్ అయి నేనా నేను గన్ ఫైరా అని జగద్ధాత్రి నోరెళ్ల బెడుతుంది. జగద్ధాత్రి కవర్ చేయడానికి ఏదో జరుగుతుందని డౌట్‌తో విండో వైపు వెళ్లి చూస్తే రివాల్వర్ సౌండ్ వచ్చింది.. ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వెనక డోర్ నుంచి పరుగుపెట్టానని అప్పుడే మీరు చూశారని చెప్తుంది. కేథార్ కూడా జగద్ధాత్రికి గన్‌ ఫైర్ చేయడం రాదు కదా అని అంటాడు. నిషిని కాపాడింది ఎవరు అని కౌషికి అంటుంది. ఇక కౌషికి గన్ గదిలో చూసి పట్టుకొని జగద్ధాత్రి నువ్వే కదా ఫైర్ చేసింది.. కేథార్ నువ్వు తనకి ఏం రాదని అంటున్నావ్.. జగద్ధాత్రి నువ్వు ఎవరు అని కౌషికి అడుగుతుంది.

జగద్ధాత్రి, కేథార్ పెద్దగా నవ్వి నేను ఏదో అండర్గ్రౌండ్ డాన్ అన్న రేంజ్లో అడుగుతున్నారు.. నేను కాల్చానని గన్ నాదే అనుకున్నారా అని అంటుంది. దానికి కేథార్ గన్ నాది.. స్కూల్వాళ్లు ఇచ్చారని చెప్పాను కదా అని అంటాడు. అవునా అని కౌషికి అంటుంది. జగద్ధాత్రి కాదులే కానీ మరి ఇంకెవరు ఫైర్ చేసుంటారని కేథార్ అంటాడు. నిషికను కాల్చాలని అమ్మాయి మిస్ ఫైర్ చేసింది తన చేతికే కాలింది.. రివాల్వర్ జేబులో పెట్టుకొని ఉంటుందని అంటాడు.

జగద్ధాత్రి, కేథార్ చివరి నిమిషంలో తప్పించుకున్నాం అని అనుకుంటారు. మీనన్చెప్పినట్లు చేస్తే మీ అక్క కంటే గొప్పగా మనం ఉంటాం కదా అని నిషిక అంటుంది. దానికి యువరాజ్ మీనన్ చెప్పినట్లు చేసిన వెంటనే కాసులు రావు.. ఇప్పుడు ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని అంటాడు. మీనన్కి బాగా అర్థమయ్యేలా నేను చెప్తా.. మన జోలికి రాకుండా చూసుకుంటా అని అంటాడు. ఈసారి మీనన్ ఏమైనా చేస్తే నేను నిన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోతా అని నిషిక అంటుంది. సీమంతం వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. కేథార్, యువరాజ్లు చెరో చోట ఉండి బాధ పడుతూ ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.