Jagadhatri Serial Today Episode శ్రీవల్లి చీరని వైజయంతి చింపేసి.. ఏం తెలీనట్లు చిరిగిపోయింది అని శ్రీవల్లితో మంచిగా మాట్లాడి కాచి చీర శ్రీవల్లికి కట్టుకోమని ఇస్తుంది. ఆ చీరని చూసిన బూచి కాచి అనుకొని శ్రీవల్లిని వెనక నుంచి హగ్ చేసుకుంటాడు. వైజయంతి, కాచి గొడవ పెడతారు. జగద్ధాత్రి, కేథార్ చెప్పినా వినకుండా కాచి శ్రీవల్లిని పంపేయమని అంటుంది. శ్రీవల్లి కూడా ఏడుస్తూ ఇక్కడ ఉండలేను వెళ్లిపోతా అంటుంది. కౌషికి శ్రీవల్లిని ఫంక్షన్‌ అయిన వరకు ఉండమని అంటుంది. 

Continues below advertisement

శ్రీవల్లి బయట బాధ పడుతుంటే కేథార్ వెళ్లి నేను అనాథనే అమ్మ అని చెప్పి మాట్లాడుతాడు. మన ఇద్దరికీ మన తల్లిదండ్రులు ఎవరో తెలీదు.. మన కన్నవాళ్లు చేసిన తప్పులు మనకి శాపాలు అయ్యావి.. వాళ్లు చేసిన తప్పులకు మనం శిక్ష అనుభవిస్తున్నాం అని కేథార్, శ్రీవల్లి మాట్లాడుకుంటారు. సుధాకర్ చాటుగా ఇద్దరి మాటలు విని బాధ పడతాడు. ఇద్దరూ బాధ పడుతుంటే జగద్ధాత్రి వచ్చి మిమల్ని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు కానీ ధైర్యాన్ని మాత్రం వదులుకోవద్దని చెప్తా అని అంటుంది. కేథార్ జగద్ధాత్రితో నేను అంటే తట్టుకుంటా థాత్రి కానీ చిన్న పిల్ల తనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని కేథార్ అంటాడు. దానికి జగద్ధాత్రి అదే నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. 

శ్రీవల్లి నువ్వు కొత్త బట్టలు డ్యామేజ్ అయ్యావని బాధపడుతుంటే వైజయంతి అత్తయ్య గారే నీకు ఈ చీర ఇచ్చారా అని జగద్ధాత్రి అడుగుతుంది. దానికి శ్రీవల్లి ఆవిడ ఈ చీర తీసుకొనే లోపలికి వచ్చారు.. నేను బాధ పడుతుంటే కొన్నప్పుడే చూసుకోవాలి అని చెప్పారని అంటుంది. నీ కోసం చీర కొనడం బాగుంది అని ఇచ్చి నేను వద్దు అన్నా ఊరుకోకుండా భయపెట్టి మరీ ఇచ్చారని శ్రీవల్లి చెప్తుంది. కేథార్ జగద్ధాత్రితో చీర నేను కొన్నప్పుడు ఏం డ్యామేజ్ అవ్వలేదని అంటాడు. ఇదంతా అత్తయ్యే చేశారు.. తెలివిగా అన్నయ్యని పావుగా వాడుకున్నారని అంటుంది. శ్రీవల్లి మీద ఇంత పగ ఎందుకు అని అనుకుంటారు. నేను ఇక్కడే ఉంటే నన్ను బాధ పెడతారు.. ఇక్కడ లేకపోతే ఏం బాధ ఉండదు అని శ్రీవల్లిఅంటుంది. 

Continues below advertisement

జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ శ్రీవల్లితో నువ్వు ఎక్కడున్నా ఈ అన్నా వదిన ఉన్నారు అని మర్చిపోకు.. కౌషికి అక్క కూడా నిన్ను వదలదు అని కేథార్ చెప్తాడు. మీనన్‌ యువరాజ్‌కి కాల్ చేస్తాడు. మంచి డీల్ వచ్చిందని దుబాయ్ నుంచి ముంబయికి మాల్ వచ్చింది నువ్వు హైదరాబాద్ తీసుకురావాలి అంటాడు. ఇది నువ్వు మాత్రమే చేయగలవు నువ్వే చేయాలి త్వరగా రా అని మీనన్ అరుస్తాడు. యువరాజ్ ఇప్పుడు చేయలేను అంటాడు. కొన్నేళ్లు పాటు నేను ఇవన్నీ చేయలేను.. ఇంట్లో బయటకు గెంటేశారు అని అంటాడు. నిషిక ఆ మాటలు విని డోర్ లాక్ చేసి యువరాజ్ మాటలు వింటుంది. మీనన్ యువరాజ్‌తో నీ మాటలు వింటుంటే నువ్వు అప్రూవర్‌గా మారిపోయేలా ఉన్నావ్ అని అంటాడు. నువ్వు వెంటనే రాకపోతే దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు తెలీదు అని అంటాడు. 

నిషిక మీనన్ చెప్పిన పని చేయమని అంటుంది. వద్దు అని యువరాజ్ అన్నా సరే డబ్బులు కావాలి కదా అంటుంది. మీనన్ చేసిన పని చేస్తూ దొరికిపోతే డబ్బు సంగతి అటు ఉంచు మనకి ఇంట్లో స్థానం ఉండదు అని అంటాడు. ఇక నిషిక కేథార్‌ కూడా ఫంక్షన్‌లో లేకుండా చేశానని జరిగింది అంతా యువరాజ్‌కి చెప్తుంది. కౌషికి వాళ్లు బాధగా ఉంటే మాధురి రెడీ అయి వస్తుంది. మాధురి చీర చూసి కౌషికి మనసులో కేథార్ ఇచ్చిన చీర కట్టుకుందా అందుకే ఇందాక మాధురి అలా మాట్లాడిందా అని కౌషికి అనుకుంటుంది. ఇక వైజయంతి తను ఇచ్చిన చీర కట్టుకోకుండా ఇది కట్టుకున్నావ్ ఎవరు ఇచ్చారు అంటే జగద్ధాత్రి కవర్ చేయడానికి మీ అత్తయ్య ఇచ్చిందని చెప్పు అని అంటుంది. 

ఇంతలో ఇంటికి సుశీల వాళ్లు వస్తారు. గెస్ట్‌లు రావడంతో వైజయంతి నిషికకు వాళ్ల కాళ్లకి పసురు రాయమని చెప్తుంది. నేను రాయడం ఏంటి అని నిషిక గుసగుసలాడితే నువ్వు రాయకపోతే ఆ జగద్ధాత్రితో రాయించేస్తుందని అంటుంది. దాంతో నిషికి రాస్తుంది. ఇంతలో కౌషికి జగద్ధాత్రికి గంధం పూయమని అంటుంది. సుశీల నిషికతో నీ తర్వాత పెళ్లి అయిన నీ మరదలికి కూడా సీమంతం అయిపోతుంది.. నీకేంటి ఇంకా ఏం లేదు అని అంటుంది. మీరేం మాట్లాడుతున్నారు మాకు ఇప్పుడే పిల్లలు వద్దు అని అంటే ఇంకెప్పుడు కంటారు ముసలి అయిపోతేనా అని అంటుంది. మీరైనా చెప్పాలి కదా అని వైజయంతికి అంటుంది. రేపు నీ కొడుకుకి పిల్లలు పుట్టని గొడ్రాలికి ఇచ్చి చేశారని అంటారని అంటుంది. దానికి జగద్ధాత్రి పర్సనల్ విషయం మీకు ఎందుకు అండీ.. పైగా వాళ్ల ఇష్టం వాళ్లకి ఎప్పుడు నచ్చితే అప్పుడు కంటారు మీకు ఎందుకు అని జగద్ధాత్రి అంటుంది. దానికి ఆమె నువ్వు నిషిక అక్కవే కదా నీకు కూడా పిల్లలు లేరు కదా అక్క వారసత్వమే వచ్చినట్లు ఉంది అని అంటుంది. కౌషికి అడ్డుకుంటుంది. అసలు మీరు ఎవరు అండీ మీకు ఎందుకు అండీ అని కౌషికి అంటుంది. దానికి సుశీల వేరే ఏం లేదమ్మా అమ్మాయిల్లో లోపం ఉందో అబ్బాయిల్లో ఉందో డాక్టర్‌కి చూపించుకోండమ్మా లేదంటే తల్లి ప్రేమ దక్కకుండా పోతారు అని అంటుంది. కేథార్ ఆ మాటలు విని బాధ పడి వెళ్లిపోతాడు. వైజయంతి సుశీలలో నా కొడుకు కోడలు బాగా ఉన్నారు.. అయినా జగద్ధాత్రి నిషికకు సొంత అక్క కాదు అని అంటుంది. వీళ్లకి పిల్లలు పుడితే నాకు ఏంటి పుట్టకపోతే నాకు ఏంటి అని సుశీల వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.