Jagadhatri Serial Today Episode పోలీసులకు సహకరించమని సుధాకర్ ఇంట్లో వాళ్లకి చెప్తాడు. కౌశికికి వెళ్లి అన్నయ్య మధుకర్ గది తెరవమని చెప్తాడు. దాంతో కౌశికి జేడీ, కేడీలను తీసుకొని వెళ్తుంది. ప్రసాద్ వాళ్లు కూడా వెళ్తారు. జేడీ, కేడీలు ఎవరికీ లోపలికి రావొద్దని అంటారు. జేడీ, కేడీ ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఆధారాల కోసం మొత్తం వెతుకుతారు. ధాత్రి, కేదార్ మొత్తం వెతుకుతారు. బయట ప్రసాద్ వాళ్లు టెన్షన్ పడుతుంటారు.
మనల్ని ఇలా బయట ఉంచి వాళ్లు లోపలికి వెళ్లడం బాలేదని నిషిక అంటుంది. కేదార్ తల్లికి సంబంధించి వివరాలు దొరికితే ఏం చేయలేం అని యువరాజు మనసులో అనుకుంటాడు. యువరాజ్ సెర్చ్ వారెంటీ చింపి తప్పు చేశాడని ప్రసాద్ అంటాడు. మీరు ఎవరు ఏం చేయకపోతే నేను చేస్తానని నిషిక లోపలికి వెళ్లబోతే తల్లి ఆపి వాళ్లతో తన్నులు తింటావా ఏంటి వెళ్లొద్దని చెప్తుంది.
కౌషికి: ఏ ఆధారాలు దొరకలేదా దొరకవు. అదే నేను చెప్తే మీరు వినలేదు మా నాన్న గారి గది తెరిచి మా ఎమోషన్స్‌తో ఆడుకున్నారు.
ధాత్రి: కౌషికి గారు కేసు గురించి ఇప్పుడే ప్రారంభించాం. త్వరలోనే సాక్ష్యాలు సంపాదిస్తాం. మీ నాన్న గారి చావుకి కారణమైన వారిని శిక్షిస్తాం. మళ్లీ వస్తాం అప్పుడు ఇంకా సపోర్ట్ చేయండి.
తర్వాత ఆ గదిలోకి యువరాజ్ అతని తల్లి నిషిక వెళ్లి కేదార్ తల్లికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏంటో చూడమని మొత్తం వెతుకుతారు. ఇంతలో యువరాజ్‌కి ఓ డైరీ దొరకుతుంది. దాన్ని కౌషికి దగ్గరకు తీసుకెళ్లి అక్కా ఇది నాన్న డైరీ కదా ఇందులో ఒక పేజీ చిరిగిపోయింది. అది ఇప్పుడే చింపినట్లు ఉందని అంటారు. జేడీ, కేడీలు గదిలో వెతికినప్పుడే ఆ డైరీ చూసి అందులో ఒక పేజీ చింపి తీసుకెళ్తారు. అందులో బ్యాంక్ లాకర్ ఉందని అందులో ఓ నిజం ఉందని దాన్ని తీసుకుంటే నిజం తెలుస్తుందని రాసి ఉంటుంది. దాంతో జేడీ వాళ్లు ఆ పేజీని చింపేస్తారు. ఆ లాకర్‌లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అనుకుంటారు.
కేదార్ అమ్మకి సంబంధించిన ఆధారమే దొరుకుంటుందని యువరాజ్ అనుకుంటాడు. వాళ్ల సంగతి తేల్చేస్తాను అని కౌశికి వెళ్తే, యువరాజ్ కూడా వెనకాలే వెళ్తాడు. అన్నయ్యది యాక్సిడెంట్ అనుకున్నాం ఇప్పుడు మర్డర్ అని తెలిసింది అసలు నేరస్తుల్ని శిక్షిస్తేనే మంచిదని సుధాకర్ భార్య వైజయంతితో చెప్తాడు. ప్రసాద్ వాళ్లు సుధాకర్‌ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కేడీ, జేడీలు ఆ పేపర్ గురించి ఆలోచిస్తుంటారు. కేదార్ అమ్మకి సంబంధించిన విషయం ఉంటే ఏం చేయాలో అని యువరాజ్ అనుకుంటారు. జేడీ, కేడీలు ఆ అడ్రస్ పట్టుకొని బ్యాంక్ అడ్రస్‌కి బయల్దేరుతారు. యువరాజ్ వాళ్లు కూడా అక్కడికే బయల్దేరుతారు. అందరూ ఆ బ్యాంక్ దగ్గరకు చేరుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘జగధాత్రి’ సీరియల్: సెర్చ్ వారెంట్ చించేసిన యువరాజ్ - ధాత్రిని అడ్డుకున్న కౌషికి