Jagadhatri  Serial Today Episode:   సత్యప్రసాద్ ఇచ్చిన లాకెట్‌ను యువరాజ్‌ రూంలోకి తీసుకెళ్లి సుత్తితో పగులగొడతాడు. కేదార్‌ను అనాథ నా కొడకా అంటూ తిడుతూ మా నాన్న నాకు మాత్రమే నాన్న అంటూ ఈ చిన్న చైన్‌ ను పట్టుకుని ఇన్ని కోట్ల ఆస్థికి వారసుడు అవుదామనుకుంటావా? అంటూ అరుస్తుంటాడు. మరోవైపు కేదార్‌ బాధపడుతుంటే.. ధాత్రి ఓదారుస్తుంది. నువ్వు మంచి ఉద్దేశంతో ఇచ్చావు. ఆ దేవుడు నీకు మంచే చేస్తాడు అంటుంది. ఇంతలో లోపలి నుంచి వచ్చిన యువరాజ్‌ పగుల గొట్టిన లాకెట్‌ ను కేదార్‌ కు ఇచ్చి వెళ్లిపోతాడు. పగిలిపోయిన లాకెట్‌ ను చూస్తూ కేదార్‌ మరింత బాధపడుతాడు. పగిలిపోయిన లాకెట్ లోంచి ఒక రాగిరేకును తీస్తుంది ధాత్రి.



ధాత్రి: కేదార్ ఇందులో ఏదో రాసి ఉంది.


కేదార్‌: అవును ధాత్రి. నాకు తెలిసి ఇంకో ఆధారం గురించి ఇందులో ఏదో సమాచారం ఉండొచ్చు.


ధాత్రి: కానీ ఇంతకీ ఇందులో ఏమి రాసి ఉంది.


కేదార్: అది నొక్కుకుపోవడం వల్ల సరిగ్గా కనిపించడం లేదు. కానీ ఇంకో ఆధారం ఉందని ఇందులో ఉన్నట్టు ఉంది.


ధాత్రి: చెప్పాను కదా.. కేదార్‌ ఆ దేవుడు నీకు మంచే చేస్తాడు. అని పద ప్రొఫెసర్‌ గారి దగ్గరకు వెళ్దాం.


అని ఇద్దరూ కలిసి ఒక ప్రొఫెసర్‌ దగ్గరకు వెళ్తారు. ఆయన రాగిరేకును పరీక్షిస్తాడు. ఇందులో ఏదో కోడ్‌ భాషలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎస్‌ఎస్‌ యం సీ 1996  అని రాసి ఉంది. అంటూ వివరాలు చెప్తాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ ఇంట్లోనే ఉన్నాయి. అని చెప్పగానే ఇద్దరూ కలిసి ఇంట్లోనే వెతుకుదాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు అనుకుంటారు.



కేదార్‌: అందులో ఉన్న ఎస్‌ఎస్ కు అర్థం మా అమ్మ సుహాసిని, మా నాన్న సుధాకర్‌.


ధాత్రి: అవును కేదార్‌ కచ్చితంగా ఇవి వాళ్ల పేర్లే..


కేదార్‌: మరి ఎంసీ అంటే..


ధాత్రి: సూరి బాబయ్‌ చెప్పిన మాట ప్రకారం మధుకర్‌ మామయ్య మీ అమ్మా నాన్నల మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ చేయించారు కదా..? అంటే ఎంసీ అంటే మ్యారేజ్‌ సర్టిఫికెట్. ఇప్పుడు మనం వాళ్లకు ఆ సర్టిఫికెట్‌ దొరకుండా చూడాలి.


అని ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక ప్రొఫెసర్‌ కమలాకర్‌ కు ఫోన్‌ చేసి ధాత్రి, కేదార్‌ వచ్చి వెళ్లిన విషయం. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ గురించి చెప్తాడు. దీంతో కమలాకర్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు. అందరికీ విషయం చెప్తాడు. దీంతో యువరాజ్‌, వైజయంతి షాక్‌ అవుతారు.


యువరాజ్‌: ఇదంతా జరుగుతుంటే నన్ను చేతులు కట్టుకుని కూర్చోమంటారా..?వాణ్ని లేపేస్తాను.


కమలాకర్‌: ఇప్పుడు మనం లేపేయాల్సింది వాణ్ని కాదు. వాడే ఈ ఇంటి వారసుడు అనే ఆధారాన్ని.


యువరాజ్‌: అయితే ఇప్పుడే ఆ ఆధారం లేకుండా చేస్తాను.


వైజయంతి: ఆగు అబ్బోడా.. తొందర పడకు. ఇది మన ఇల్లే అయినా ఆ గది మాత్రం కౌషికి వాళ్ల నాన్నది. కౌషికికి తెలియకుండా మనం ఆ గదిలోకి వెళ్లడం మంచిది కాదు.


కమలాకర్‌: అవును యువరాజ్‌. ఆ ఆధారం ఆ గదిలో ఉందని తెలుసు కానీ ఆ ఫైల్‌ ఎక్కడ ఉందో తెలియదు.


నిషిక: మామయ్య చెప్పిందే నిజం యువరాజ్. కౌషికి వదినకు నిజం తెలిస్తే వదిన వెంటనే  కేదార్‌కు సాయం చేస్తుంది.


అంటూ నా దగ్గర ఒక ప్లాన్‌ ఉందని కౌషికిని ఇంట్లో లేకుండా చేయాలని చెప్తుంది. తమ ప్లాన్‌ ప్రకారం కౌషికిని ఇంట్లో లేకుండా చేయాలనుకుంటారు. మరోవైపు ఇంటికి వచ్చిన కేదార్‌, ధాత్రిలను కౌషికి లాకెట్ ఎందుకు ఇచ్చారని అడుగుతుంది. నేను ఉండి ఉంటే ఆ లాకెట్ ఇవ్వనిచ్చేదాన్ని కాదు అంటుంది. ఇంతలో యువరాజ్‌ ఆఫీసు ఫైల్ తీసుకుని వస్తాడు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!