Jagadhatri Serial Today Episode: వైజయంతి రూమ్ సర్దుతున్న చిలకమ్మకు అక్కడ కేదార్ వాళ్ల అమ్మ ఫొటో కనిపిస్తుంది. వెంటనే దాన్ని తీసుకుని కిందకు వస్తుండగా..నిషిక,వైజయంతి అడ్డుకుని లాక్కోవాలని చూస్తారు. కానీ చిలకమ్మ ఆ ఫొటో ఇవ్వదు. వీళ్లు గొడవపడుతుండగా...జగధాత్రి అక్కడికి వచ్చి ఏం జరిగిందని నిలదీస్తుంది. ఇంతలో కేదార్ కూడా అక్కడికి వచ్చి వైజయంతి చేతిలో ఉన్న ఫొటో లాక్కుని చూస్తాడు.అసలు మా అమ్మ ఫొటో మీ రూమ్‌లోకి ఎందుకు వచ్చిందని అడుగుతాడు. సుధాకర్ కూడా వచ్చి ఆవిడ ఫొటో మీకు ఎక్కడదని ప్రశ్నిస్తాడు.
వైజయంతికి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతుండగా...యువరాజు అక్కడికి వచ్చి ఈ ఫొటో ఎలా వస్తే ఏంటని ఇప్పుడు ఇది ఈ ఇంట్లో ఉండకూడదని కేదార్ చేతిలో నుంచి తీసుకుని విసిరిపడేస్తాడు. అది శ్రీవల్లి ముందుపడి పగిలిపోతుంది.కేదార్ వెంటనే యువరాజు చొక్కాపట్టుకుని కొట్టడానికి ప్రయత్నించగా....కౌషికి వచ్చి అడ్డుకుంటుంది. వాళ్ల అమ్మ ఫొటో ఎందుకు కిందపడేశావని తమ్ముడిపై అరుస్తుంది. ఇంతలో శ్రీవల్లి ఫొటో తీసుకుని తీసుకొస్తుంటుంది. అది ఎక్కడ చూస్తుందేమోనని యువరాజు లాగేయగా....శ్రీవల్లి చేయి కోసుకుని రక్తం వస్తుంది. అంతే సుధాకర్ కొడుకు చెంప పగులగొడతాడు. అందరూ వెళ్లిపోగా.....కేదార్ వాళ్ల అమ్మ ఫొటో తీసుకుని రూమ్‌కు వెళ్తాడు.
సుధాకర్ దగ్గరకు వెళ్లి నన్ను ఎందుకు కొట్టావని యువరాజు నిలదీస్తాడు.నీ ప్రియురాలి ఫొటో పగులగొట్టాడనే కొట్టావా అని వైజయంతి అంటుంది. నేను ఫొటో పగులగొట్టినందుకు కొట్టలేదని..శ్రీవల్లి చేతికి గాయం చేసినందుకు కొట్టానని అంటాడు. యువరాజు అడ్డుకోకపోయి ఉంటే శ్రీవల్లి ఆ ఫొటో చూసేదని నిషిక అంటుంది.చూస్తే ఏమవుతుందని అనగా...శ్రీవల్లికి కేదార్ అన్నయ్య అవుతాడన్న సంగతి తెలిసిపోతుందని....అప్పుడు వాళ్లిద్దరూ కలిసిపోతారని చెబుతుంది.ఆ మాటలు విన్న సుధాకర్ షాక్ తింటాడు. శ్రీవల్లి, కేదార్ అన్నాచెల్లెల్లు అవ్వడం ఏంటని నిలదీస్తాడు. వెంటనే యువరాజు మాటమార్చి సుధాకర్ దగ్గర నుంచి వచ్చేస్తారు. నీవల్ల అన్ని ఇబ్బందులేనని భార్యపై మండిపడతాడు యువరాజు. మనం ఎలాగైనా జగధాత్రి వాళ్ల దగ్గర ఉన్న ఫొటో కొట్టేయాలని అనుకుంంటారు. ఇంతలో శ్రీవల్లి కేదార్ దగ్గరకు వెళ్లి అమ్మ ఫొటో ఓసారి చూస్తానని అడగ్గా....కేదార్ చూపించబోతుండగా నిషిక చూసి శ్రీవల్లిని బయటకు పిలుస్తుంది. జేడీ ఎలాగైనా తన కుమారుడిని చంపుతుందని భయపడిపోయిన మినిస్టర్ వాడిని దుబాయ్ పారిపొమ్మని సలహా ఇస్తాడు.ఆ జేడీకి భయపడి ఊరువదిలి పారిపోయే ప్రసక్తే లేదని అవినాష్ అంటాడు. పారిపోకపోతే దానిచేతిలో చచ్చిపోతావని మీనన్ అంటాడు. మీనన్‌ను చూడగానే మినిస్టర్ అదిరిపడతాడు. నువ్వు అమ్మాయిని రేప్‌చేసి చంపిన గంటలోనే నిన్ను లోపల వేయడమేగాక..వాళ్ల ఇంటి మీదకు వెళ్లిన నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిందని అంటాడు. నీకు ఆ జేడీ ముఖం ఎలా ఉంటుందో తెలుసునని కాబట్టి నాకు ఆ డిటైల్స్ చెబితే....దాన్ని లేపేస్తానని అంటాడు.కానీ అవినాష్ చెప్పనని అంటాడు. ఆ జేడీ టీంలో అందరినీ చంపిన తర్వాత ఆ జేడీని కూడా చంపడానికి ముందు నీకు ఆ విషయం చెబుతానని అవినాష్ అంటాడు. అప్పటి వరకు చెప్పనని జేడీతో ఛాలెంజ్ చేశానని చెబుతాడు.దీనికి మీనన్ సరేనంటాడు.అయితే ఇక నుంచి మనమిద్దరం కలిసి పనిచేద్దామని మీనన్ చేయి కలుపుతాడు. జగధాత్రి రూమ్‌లో ఉన్న ఫొటో కొట్టేయడానికి వైజయంతి,నిషిక ప్రయత్నించగా....చిలకమ్మ అక్కడే ఉండటంతో వెనక్కి వచ్చేస్తారు. ఆ ధాత్రి కావాలనే చిలకమ్మను కాపలాగా పెట్టిందని యువరాజు అంటాడు. అయితే మనం చిలకమ్మను రీడింగ్ రూమ్ సర్దమని చెప్పి పంపిద్దామని...ఆ రూమ్ లాక్ పడిపోతే వెంటనే రాదని నిషిక అంటుంది.అప్పుడు జగధాత్రి,కేదార్ ఆ రూమ్ తలుపు తీసే పనిలోఉంటే మనం వెళ్లి ఫొటో తీసుకొచ్చేద్దామని అంటుంది. దీంతో వైజయంతి చిలకమ్మను రీడింగ్ రూమ్‌లోకి పంపి లాక్‌వేస్తుంది. అయితే లోపల సుధాకర్ కూడా ఉండటంతో వైజయంతి లబోదిబోమంటుంది.
