Jagadhatri Serial Today Episode: కేదార్ తాతయ్యను ముందే కలిసిన యువరాజు...తానే కేదార్‌ను అని చెప్పడంతో శివశంకర్ నమ్ముతాడు. కౌషికి ఇంటికి వచ్చి సుధాకర్‌ను బెదిరించి..24 గంటల్లో కేదార్‌ను వారసుడిగా ప్రకటించకపోతే....నేనే మీడియాకు చెబుతానని బెదిరించి వెళ్లిపోతాడు. తానే కేదార్‌నని చెప్పినా అతను నమ్మడు. అసలు కేదార్‌ అని అబద్ధం చెప్పింది ఎవరా అని జగధాత్రి, కేదార్ బయకటకు వెళ్లి చూడగా....అక్కడ యువరాజు కనిపిస్తాడు. శివశంకర్‌తో కలిసి యువరాజు వెళ్లడం చూసిన కేదార్‌...సాక్ష్యాల కోసం తాతయ్యను వాడు ఏమైనా చేస్తాడేమోనని భయంతో వాళ్లిద్దరూ యువరాజును అనుసరిస్తూ వెళ్తారు. కేదార్‌ను మనం యువరాజుగా శివశంకర్‌కు పరిచయం చేసినా  కౌషికి  నోరు మెదపలేదెందుకని నిషిక వైజయంతిని అడుగుతుంది. చిన్నగా అక్కడి నుంచి జారుకుంటుండగా....కౌషికి పిలిచి అడుగుతుంది. ఎందుకు ఈనాటకం ఆడుతున్నారని నిలదీస్తుంది.

Continues below advertisement

కేదార్‌ను యువరాజుగా ఎందుకు పరిచయం చేశారని అడుగుతుంది.బయట కేదార్‌లా నాటకం ఆడింది కూడా యువరాజేనని నాకు తెలుసని అంటుంది. పాపం కేదార్‌కు కుటుంబాన్ని ఇవ్వలేకపోయామని...ఇప్పుడు వాళ్ల తాతయ్యను కూడా దూరం చేయాలని చూస్తున్నారా అని నిలదీస్తుంది. అసలు మీరు మనుషులేనా అని  అంటుంది. ఇప్పుడే వెళ్లి శివశంకర్‌ను కలిసి నిజం చెప్పేస్తానని బెదిరిస్తుంది. అలా అయితే నువ్వు వచ్చేసరికి మీ బాబాయి శవం ఇంట్లో ఉంటుందని అంటుంది. నువ్వు చెప్పగానే ఆ శివశంకర్‌ కేదార్‌ను తీసుకుని మీడియా ముందుకు వెళ్తాడని...అప్పుడు  పరువుపోయిందని మీ బాబాయి చచ్చిపోతాడని చెప్పి బెదిరిస్తుంది. ఆయన పరువుకోసమే ఇదంతా చేశామని చెప్పగా....కౌషికి వాళ్లకు గట్టిగా వార్నింగ్‌ ఇస్తుంది. మీరు ఎందుకు చేశారో నాకు బాగా తెలుసునని....ఇప్పుడు యువరాజు వెళ్లింది కూడా  సాక్ష్యాలను తారుమారు చేయడానికేనని కౌషికి అంటుంది.మీరు ఎలాంటి నాటకాలు ఆడినా నాకు ఇబ్బంది లేదని...కానీ ఆ కేదార్‌ వాళ్ల తాతయ్య ఒంటిమీద ఒక్క గీతపడినా...నేనే అందరికీ కేదార్‌ ఈఇంటివారసుడని చెప్పి ఆస్తి మొత్తం రాసిస్తానని హెచ్చరిస్తుంది. మీ అందరినీ నేనే దగ్గర ఉండి జైలులో పెట్టిస్తానని చెప్పి వెళ్లిపోతుంది.

జగధాత్రి,కేదార్‌ యువరాజును వెతుక్కుంటూ వెళ్తారు. ఇప్పుడు తాతయ్య ఎలాగూ మహల్‌కు వెళ్తాడు కాబట్టి అక్కడ రంగయ్య యువరాజును గుర్తుపట్టి ఇతను కేదార్‌ కాదని చెప్పేస్తాడని...అప్పుడు మనకు ప్రాబ్లం పోయినట్లేనని ధాత్రి అంటుంది. తాతయ్య మనం చెబితేనే నమ్మడం లేదని...ఇక పనివాడి మాటలు ఎలా నమ్ముతాడని కేదార్ అంటాడు. ముందు ఆయనకు ఓ అనుమానం వస్తే చాలని...ఆ తర్వాత మనం అన్ని రుజువులు చూపించి నమ్మిద్దామని చెబుతుంది. ఇంతలో ధాత్రి, కేదార్‌ భయటకు వెళ్లడం చూసిన అవినాష్‌ మనుషులతో  కౌషికిఇంట్లోకి చొరబడి వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు.సుధాకర్‌ను మెట్లపై నుంచి కిందకు పైకి నడవమని అతను ఆస్తమాతో ఇబ్బందిపడేలా చేస్తాడు. పైగా ఆరోజు తనపై చేయిచేసుకున్న నిషికను అవినాష్‌ కొట్టి హింసిస్తాడు. 

Continues below advertisement

యువరాజును తీసుకుని మహల్‌కు వెళ్లిన శివశంకర్‌ను గుర్తుపట్టి వాచ్‌మెన్ రంగయ్య పలకరిస్తాడు. మీకోసం కేదార్‌బాబు ఇంతకు ముందు వచ్చారని చెప్పడంతో ఇప్పుడు నా మనవడితోనే ఇక్కడికి వచ్చానని శివశంకర్‌ అంటాడు. వెంటనే యువరాజును చూసి గుర్తుపట్టిన రంగయ్య...ఇతను కేదార్‌ కాదని చెప్పబోతుండగా...యువరాజు  అడ్డుకుని కొడతాడు.ముఖంపై పిడిగుద్దులు గుద్దుతాడు. వీడు ఆ యువరాజు మనిషని అందుకే కొట్టానని శివశంకర్‌తో చెబుతాడు. మనవడినిఇంట్లోకి తీసుకెళ్లిన శివశంకర్‌...సాక్ష్యాల కోసం ఫోన్ చేసి కనుక్కుంటాడు. ఎవరికి ఫోన్ చేశారని అడగ్గా....రిటైర్డ్‌ ఎస్‌ఐ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని తీసుకునిరమ్మని చెప్పానని చెబుతాడు.ఇక ముసలోడితో పనిలేదని చంపడానికి యువరాజు ప్రయత్నించగా  కేదార్ అడ్డుకుని బయటకు తీసుకొచ్చి యువరాజును కొడతాడు.