Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌లో ఈరోజు వైజయంతి వాళ్ల అన్న పాపారాయుడు చేసిన రచ్చకు ఇళ్లంతా  హడాలిపోయింది. పరవు కోసం ప్రాణాలిచ్చే పాపారాయుడు శ్రీవల్లికి గురించి నిజం తెలిసి అగ్గిమీద గుగ్గిలమవుతాడు.వైజయంతి ప్రాణం తీసేందుకు సైతం వెనకాడడు. అసలే కోపంగా ఉన్న పాపారాయుడికి కేదార్‌ ఎవరో తెలిసిన తర్వాత ఏం చేశాడోనన్న ఉత్కంఠతో ఈ రోజు ఏపిసోడ్‌ రసవత్తరంగా మారింది.పాపారాయుడి హడావుడి                        సుధాకర్‌కు యాక్సిడెంట్‌ జరిగిందని తెలిసి ఊరు నుంచి వచ్చిన వైజయంతివాళ్ల అన్నయ్య పాపారాయుడిని చూసి ఇంట్లో వాళ్లంతా బెదిరిపోతారు. అతను చేసే హడావుడి, కోపం చూసి బెంబేలెత్తిపోతారు.ఇక వైజయంతి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. చిన్న అబద్ధం చెప్పినా....ఇంటి పరువు తీసే ప్రయత్నం చేసినా  పాపారాయుడు ప్రాణాలు తీసేస్తాడు. అలాంటి సమయంలో ఇంట్లో కేదార్‌, జగధాత్రి తిరుగుతుండటంతో వైజయంతికి కాళ్లు,చేతులు ఆడవు. ఇంతలో  సుధాకర్‌కు కౌషికి టాబ్లెట్ ఇవ్వడం చూసి ఇల్లు లేచిపోయేంతగా  చెల్లిపై అరుస్తాడు. అసలు భార్యవు నువ్వు చూసుకోవాల్సిన పనులు వేరొకరు ఎందుకు చూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో భయపడిపోయిన వైజయంతి భర్త దగ్గరకు వెళ్లి టాబ్లెట్‌ వేయిస్తుంది. ఆమాటలు విన్న నిషికకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలోనే వీళ్లు ఎవరని జగధాత్రి వాళ్ల గురించి ఆరా  తీస్తుండగానే యువరాజు వచ్చి మామయ్యను హత్తుకుని టాఫిక్ డైవర్ట్‌ చేస్తాడు. మా మామయ్య వెళ్లిపోయేవరకు చాలా జాగ్రత్తగా ఉండాలని యువరాజు నిషికకు చెబుతాడు. పరువు కోసం ప్రాణాలు తీస్తాడని వైజయంతి హెచ్చరిస్తుంది. ఇప్పుడు కేదార్‌,జగధాత్రి గురించి తెలిస్తేనే ప్రాణాలు పోతాయనుకుంటే...ఆ శ్రీవల్లి గురించి తెలిస్తే నన్ను ఇక్కడే  చంపేస్తాడని వైజయంతి భయపడిపోతుంది.శ్రీవల్లి గురించి తెలిసిన నిజం                           వైజయంతి శ్రీవల్లికి పై గదిలో పనులు అప్పగించి కిందకు రావొద్దని చెబుతుంది.అలాగే జగధాత్రి,కేదార్ కూడా వంటగది దాటి  బయటకు రాకుండా వంట చేయమని చెప్పి వస్తుంది. అత్తయ్యగారు ఎందుకో పాపారాయుడు బాబాయిని చూసి చాలా భయపడిపోతున్నారని ధాత్రి అంటుంది. ఇంతలో భోజనాలు పూర్తవ్వడంతో తినడానికి అందరూ వస్తారు. అప్పుడు మరోసారి పాపారాయుడు జగధాత్రిని చూసి ఎవరని అడుగుతాడు. ఇంతలో ధాత్రి కల్పించుకుని మేం నిషిక వాళ్ల అక్కాబావ అని చెబుతారు.  అందరూ భోజనాలు చేస్తుండగా...శ్రీవల్లి రాలేదేంటని కౌషికి అడుగుతుంది.ఆ అమ్మాయి మేడమీద పనిలోఉందని వైజయంతి చెబుతుంది. భోజనాలు చేస్తుంటే ఇప్పుడు పనులేంటని కౌషికి కిందకు పిలుస్తుంది. శ్రీవల్లిని చూసి ఎవరని పాపారాయుడు అడుగుతాడు. పని అమ్మాయని నిషిక చెప్పడంతో సుధాకర్‌కు కోపం వచ్చి పని అమ్మాయి కాదని ఈ ఇంటి అమ్మాయని చెబుతాడు...వైజయంతిని చంపబోయిన అన్న                        ఇంటి అమ్మాయి అంటే ఎలా అని పాపారాయుడు అడగడంతో  ఆ అమ్మాయి నీ చెల్లెలు కూతురని చెప్పడంతో పాపారాయుడు కోపంతో రగిలిపోతాడు. నువ్వు చెప్పింది నిజమేనా అంటూ కత్తి తీసుకుని  చెల్లి దగ్గరకు వెళ్తాడు.ఆమె గొంతుపట్టుకుని చంపబోతాడు. ఇంతలో కేదార్ అడ్డుకుని మేం చెప్పేది కాస్త వినమని అంటాడు.అయినా సరే పాపారాయుడు ఇంట్లో రచ్చరచ్చ చేస్తాడు. ఇంటి పరువు తీసిన నా చెల్లి బతకడానికి వీల్లేదని చంపబోతాడు. ఇంతలో కేదార్‌, యువరాజు అడ్డుకుంటారు.అయినా బాబాయి శ్రీవల్లిని కూతురిగా అంగీకరించారని కౌషికి చెప్పడంతో మరింత కోపంతో పాపారాయుడు రగిలిపోతాడు.సుధాకర్‌ను గదిలో బంధించిన పాపారాయుడు                        సుధాకర్‌ వీల్‌ఛైర్‌ గదిలోకి తీసుకెళ్లి తలుపుపెట్టుకుంటాడు. నా చెల్లితప్పు చేసిందని దాన్ని నువ్వే చంపమని అడుగుతాడు. ఇవాళ అది అయిన బతికి ఉండాలి లేదంటే నేను అయిన బతికి ఉండాలని కత్తి తీస్తాడు.సుధాకర్ బావమరిదిని గట్టిగా మందలిస్తాడు. అయితే నేనే చనిపోతానని కత్తితో గొంతు కోసుకోబోతుండగా...కేదార్‌, యువరాజు వచ్చి అడ్డుకుంటారు. దీంతో కోపంతో పాపారాయుడు బయటకు వెళ్లిపోతాడు. దీంతో బెదిరిపోయిన వైజయంతి మా అన్నయ్య నా ప్రాణాలు తీయకుండా వెళ్తాడని అనుకోలేదని భయపడుతుంది.పాపారాయుడికి తెలిసిన నిజం                         పాపారాయుడు చేసిన రచ్చ గురించి కౌషికి, జగధాత్రి,కేదార్ మాట్లాడుకుంటుంటారు. శ్రీవల్లి గురించి తెలిస్తేనే ఇంత గొడవ చేశాడంటే..ఇక మీ గురించి తెలిస్తే ఏం చేస్తాడోనని కౌషికి అంటుండగా...పాపారాయుడు మళ్లీ వస్తాడు.  ఏంటి ఆ  నిజమని నిలదీస్తాడు. ఇప్పుడు చెప్పకపోతే చంపేస్తానని కేదార్‌ను బెదిరిస్తుండగా...జగధాత్రి అసలు విషయం చెప్పేస్తుంది. కేదార్ సుధాకర్‌ మామయ్య పెద్దకొడుకని చెప్పడంతో నువ్వు సుహాసిని కొడుకువా అని అంటాడు.ఆ మాటలు విన్న ధాత్రి ఆశ్చర్యపోతుంది. అయితే నీ వ్యవహారం నీతోకాదని మా బావతోనే తేల్చుకుంటానని లోపలికి వెళ్లిపోతాడు.