Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌లో ఈరోజు యువరాజు,నిషిక పై చేయిసాధిస్తారు. యువరాజును కౌషికి ఆఫీసుకు తీసుకెళ్తానని హామీ ఇవ్వడం...ప్రెస్‌మీట్ మధ్యలోనే వదిలేసి  వెళ్లిన నిషికను దివ్యాంక బెదిరించడంతోపాటు జగధాత్రి వాళ్లను సుధాకర్‌ అసహ్యించుకోవడం వంటి ట్విస్టులతో ఈరోజు (మే 25) జగధాత్రి సీరియల్‌ రసవత్తరంగా మారుతుంది.

Continues below advertisement

యువరాజుకు కౌషికి ఇచ్చిన హామీ ఏంటి..?                   యువరాజు, నిషికతో ప్రెస్‌మీట్ పెట్టించి కౌషికిని అల్లరిపాలు చేయాలని చూసిన దివ్యాంకకు పోలీసులతో జగధాత్రి గట్టిగా బుద్ది చెప్పిస్తుంది. దివ్యాంక  మాట వినికపోవడంతో పోలీసులు వాళ్ల కెమెరాలు,లైవ్‌ సామాగ్రి మొత్తం సీజ్‌ చేసి తీసుకెళ్లిపోతారు. అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో దివ్యాంక నోరుమూసుకుని ఉంటుంది. అయినా ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావని జగధాత్రి నిషికను నిలదీస్తుంది.దివ్యాంక మాటలు విని కంపెనీకి నష్టం చేకూరిస్తే....నష్టపోయేది ఎవరని ప్రశ్నిస్తుంది. కంపెనీ మాది కానప్పుడు ఏమైపోతే మాకేంటని యువరాజు అంటాడు. మమ్మల్ని ఇంట్లో బతకనివ్వరు...బయట కూడా వదిలిపెట్టరా అని వైజయంతి అంటుంది. దీంతో చేసేదిలేక కౌషికి యువరాజును టీంలీడర్‌గా నియమించి బాబాయి కుర్చీలో కూర్చోబెడతానని చెప్పడంతో అందరూ సంతోషంగా ఇంటికి వస్తామని చెబుతారు. ఇలా నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్తే ఎలా అని దివ్యాంక అడగగా..మాప్రాబ్లం క్లియర్‌ అయ్యిందని...సారీ చెప్పేసి నిషిక అక్కడి  నుంచి జారుకుంటుంది.ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే తాటతీస్తామని జగధాత్రి, కేదార్ దివ్యాంకకు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతారు..సుధాకర్‌ మాటలకు నొచ్చుకున్న జగధాత్రి                      ఇంటికి వచ్చిన యువరాజు, నిషిక, వైజయంతిని చూసి సుధాకర్‌ బాగా తిడతాడు.కూర్చున్న కొమ్మను నరుక్కునేవాడిని నీలాంటి మూర్ఖుడే అంటారని అంటాడు. తండ్రి మాటలకు యువరాజుకు చాలా కోపం వస్తుంది. కానీ ఇప్పుడే వద్దని వైజయంతి ఆపుతుంది. మీ అక్క నిన్ను ఆ  కుర్చీలో కూర్చోబెడతానని మాట ఇచ్చిందని ఇప్పుడు నువ్వు ఏదైనా గొడవ చేస్తే మొదటికే మోసం వస్తుందని ఆపుతుంది. అంతలో కేదార్‌,జగధాత్రి కూడా యువరాజుకు తెలియక ఏదో తప్పు చేశాడని క్షమించమని జగధాత్రి అంటుంది.దీంతో సుధాకర్‌ యువరాజును మరింత తిడతాడు. నీవల్ల అడ్డమైన వాళ్లతో కూడా చెప్పించుకోవాల్సి వస్తుందని అంటాడు. ఇంటితో ఏ సంబంధం లేనివాళ్లతో కూడా మాటలు పడాల్సి వస్తుందని అంటాడు. ఆ మాటలకు జగధాత్రి,కేదార్ నొచ్చుకుంటారు. మాకు ఈ ఇంటికి ఏం సంబంధం లేదా అని అడుగుతారు. లేదని సుధాకర్ చెప్పడంతో వాళ్లు బాధపడగా...వైజయంతి, నిషిక మాత్రం చాలా సంతోషిస్తారు. మీ అక్క నీ జాడ కనుక్కుంది కాబట్టి ఇవాళ పెద్ద గండం గట్టెక్కిందని లేకుండా ఏం జరిగేదని సుధాకర్‌ కొడుకుని తిడతాడు.యువరాజు వాళ్లను నేను కనుక్కోలేదని...జగధాత్రి, కేదార్‌ కనిపెట్టి ఈ ఆపద నుంచి కాపాడారని కౌషికి చెబుతుంది. జగధాత్రికి థ్యాంక్సు చెబుతుంది.జగధాత్రి పథకానికి లొంగని డాక్టర్‌                      మనం తప్పు చేయలేదని మామయ్య నమ్మేవరకు మనం ఈ అవమానాలు పడాల్సిందేనని జగధాత్రి కేదార్‌తో అంటుంది. అయితే నిషిక కడుపుపోవడంతో బాధలో ఉన్నారని వదిన యువరాజును ఆఫీసుకు తీసుకెళ్లడానికి ఒప్పుకుందని..అసలు దానికి కడుపే రాలేదని మనం నిరూపిస్తే...ఈ సమస్యలన్నింటికి చెక్‌ పెట్టొచ్చని ధాత్రి అంటుంది. వెంటనే డాక్టర్‌కు వేరేవాళ్లలాగా ఫోన్ చేసి డబ్బు ఆశ చూపించినా...ఆమె లొంగదు. ఆరోజు డబ్బుకోసమే కదా నిషిక కడుపుతో ఉందని చెప్పిందని....ఇప్పుడు ఎందుకు మన మాట వినడం లేదని కేదార్ అంటే...నిషిక ముందుగానే డాక్టర్‌ను ప్రిపేరు చేసి ఉంటుందని అంటుంది. అందుకే మనకు ఆ డాక్టర్ లొంగడం లేదని అంటుంది.ఇంతలో వైజయంతి వాళ్ల అన్నయ్య పాపారాయుడు ఊరి నుంచి వస్తాడు. అతన్ని చూసి వైజయంతి చాలా కంగారుపడుతుంది. ముందు ఇది ఏంటో తెలుద్దామని జగధాత్రి అంటుంది.

 

Continues below advertisement