Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఇవాళ మరింత ట్విస్ట్‌లతో అదిరిపోయింది. కౌషికిని దారిలోకి తెచ్చుకోవాలని కొడుకు,కోడలిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వైజయంతి దివ్యాంకతో చేతులు కలపగా....జగధాత్రి వాళ్ల ఎత్తులను చిత్తులు చేయడంతో ఈరోజు( మే 22‌) ఏపీసోడ్ ఎంతో ఆసక్తికరంగా మారుతుంది.

Continues below advertisement

యువరాజును ప్రాజెక్ట్‌ లీడ్‌గా నియమించడం కుదరదన్న కౌషికి 

యువరాజును ప్రాజెక్ట్‌ లీడ్‌గా పెట్టడానికి కౌషికి చాలా ట్రై చేస్తుంది.కానీ ఒక్కసారి కూడా కంపెనీ ముఖం చూడని యువరాజును లీడ్‌గా పెట్టాలంటే బోర్డు డైరెక్టర్లు ఒప్పుకోరని సుధాకర్‌తో చర్చిస్తుంది.అయినా వాడి ఆవేశం,తెలివిలేనితనం చూస్తే ఎవ్వరూ ఇందుకు అంగీకరించరని అంటుంది.కానీ వీళ్లేమో ఇలా గొడవ చేస్తున్నారని బాధపడుతుంది. సుధాకర్‌  ఆమెకు సర్దిచెబుతాడు.వాళ్లు ఎప్పుడూ గొడవ చేస్తూనే ఉంటారని..నువ్వు మాత్రం కంపెనీకి ఏది మంచిది అయితే అదే నిర్ణయం తీసుకోమని చెబుతాడు.ఇంతలో కంపెనీలో పనిచేసే రావుగారి సలహా తీసుకోవడానికి ఆయనకు కౌషికి ఫోన్ చేస్తుంది.  అక్కడికి వచ్చిన వైజయంతి ఏం అంటున్నారని అడగ్గా....యువరాజును ప్రాజెక్ట్‌ లీడ్‌గా పెడితే చాలామంది డైరెక్టర్లు వ్యతిరేకించే అవకాశం ఉందని అంటున్నారని కాబట్టి యువరాజును లీడ్‌గా చేయడం కుదరదని చెబుతుంది.మన కంపెనీలో మన ఇంట్లో వాళ్లను నియమించాలంటే ఎవరిని అడగాలని వైజయంతి అంటుంది. మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తామంటే....కంపెనీలో పెట్టుబడులు పెట్టిన  వారంతా చూస్తూ ఊరుకోరని సుధాకర్‌ అంటాడు. మాకు అర్థమైందని మీరు ఎప్పుటికీ నా కొడుకుని కంపెనీకి సీఈవోని చేయరని వైజయంతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్లను తీసుకుని వెళ్లిపోతుంది.

Continues below advertisement

జగధాత్రి, కేదార్‌ను అసహ్యించుకున్న సుధాకర్‌

అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చిన కేదార్‌,జగధాత్రి...హాలులో సుధాకర్‌ ఒక్కడే ఉండటం చూసి దగ్గరకు వెళ్తారు.అందరూ ఏమైపోయారని అడిగినా సుధాకర్‌ మాత్రం సమాధానం చెప్పడు. నాన్నకు అన్నం పెడతానంటూ కేదార్ ప్లేట్‌లో అన్నం తీసుుకుని రాగా....సుధాకర్ ప్లేట్‌ విసిరేస్తాడు.మీ నాటకాలన్నీ ఆపండని అంటాడు. ఆస్తి కోసం కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపడానికి వెనకాడని మనుషులు మీరని అంటాడు. మర్యాదగా నా చుట్టుపక్కల నుంచి వెళ్లిపోండని హెచ్చరిస్తాడు.మీ ముఖాలు చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తోందని అంటాడు.నా భార్య,కొడుకు,కోడలు చెప్పినా వినకుండా మిమ్మల్ని వెనకేసుకుని వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పారని అంటాడు.జగధాత్రి సుధాకర్‌కు సర్దిచెప్పాలని చూసినా వినకపోవడంతో బాధపడుతూ లోపలికి వెళ్లిపోతుంది.

కౌషికిని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ మనం దారిలోకి తెచ్చుకోలేమని...కాబట్టి నేను చెప్పినట్లు చేయమని యువరాజు, నిషికతో బట్టలు సర్దించుకుని వైజయంతి బయటకు వెళ్లిపోతుంది. వాళ్లకు నచ్చజెప్పడానికి వాళ్ల రూమ్‌కు వచ్చిన  కౌషికికి అక్కడి వైజయంతి రాసిన లెటర్ కనిపిస్తుంది. నా కొడుకుకి  అవమానం జరిగే చోట ఉండలేక  వెళ్లిపోతున్నామని రాసి ఉంటుంది.అది తీసుకుని కౌషికి పరుగులు పెట్టుకుంటూ కేదార్‌,జగధాత్రి వాళ్ల వద్దకు వెళ్తుంది. అత్తయ్య ఇలాంటి పనిచేస్తుందని ఊహించలేదని జగధాత్రి అంటుంది.ఈ విషయం మామయ్యకు తెలిస్తే  చాలా బాధపడతారని...మనమే వెళ్లి వాళ్లను తీసుకుని వద్దామని చెప్పి బయలుదేరతారు.

వైజయంతి వేసిన ప్లాన్‌ ఏంటి..?

రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తూ యువరాజు తల్లిపై చిరాకుపడతాడు.  ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావని అడగ్గా...అప్పుడే దివ్యాంక వస్తుంది. మీ కంపెనీ మీ చేతికి రావాలంటే నేను చెప్పినట్లు చేయండని అంటుంది.నా ఛానెల్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మీ అక్కను గట్టిగా తిట్టాలని..అప్పుడు బోర్డు డైరెక్టర్లు ఆమెపై ఒత్తిడి తెచ్చి సీఈవో పోస్టు నుంచి తొలగించి నిన్ను పెడతారని చెప్పడంతో నిజమేనని నమ్మిన  యువరాజు,నిషిక దీనికి ఒప్పుకుంటారు. ఇంతలో టీవీ వచ్చిన న్యూస్ చూసి సుధాకర్‌ కౌషికి ఫోన్‌ చేసి చెబుతాడు. కాసేపట్లో యువరాజు వాళ్లు ప్రెస్‌మీట్‌ పెడుతున్నారని చెప్పగా...జగధాత్రి రమ్యకు ఫోన్ చేసి నిషిక వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని ఫోర్స్‌తో అక్కడికి రమ్మని చెబుతుంది. దివ్యాంకకు ఝలక్‌ ఇచ్చిన జగధాత్రి

నిషిక,యువరాజు,వైజయంతి లైవ్‌లోకి రాగ...జగధాత్రి, కేదార్‌ వచ్చి అడ్డుకుంటారు.ఇది మా ఫ్యామిలీ విషయమని...మీరు ఇలా రచ్చచేయడం బాగోలేదని హెచ్చరిస్తారు.మర్యాదగా లైవ్‌ ఆపకుంటే బాగుండదని అంటారు.ఇంతలో రమ్య అక్కడికి వచ్చి రోడ్డుపై న్యూసెన్స్‌ చేయవద్దని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తుంది. మేం మీడియా అని మాకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని దివ్యాంక చెబుతుంది. ఈ దారిలో సీఎంగారు వస్తున్నారని...ఇక్కడంతా క్లియర్‌ చేయమని ఆర్డర్సుఉన్నాయని రమ్య చెబుతుంది. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో దివ్యాంక చేసేదిలేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది.