Jagadhatri Serial Today Episode: వీరశంకర్‌ వార్నింగ్ ఇచ్చి వెళ్లడంతో సుధాకర్ అయోమయంలో ఉంటాడు. అప్పుడు బాబాయి దగ్గరకు వచ్చిన కౌశికి ఏం చేద్దామనుకుంటున్నారని అడుగుతుంది.ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చేసిన తప్పును ఇప్పటికైనా సరిదిద్దుకోమని చెబుతుంది. అయినా కేదార్ ఆస్తికోసం మన దగ్గరకు రాలేదని...మన ప్రేమ కోసమే వచ్చాడని చెబుతుంది. సరైన  నిర్ణయం తీసుకోమని చెబుతుంది. ఇంతలో నిషిక, వైజయంతి అక్కడికి వస్తారు.మామయ్యగారికి చాటుగా ఏం చెబుతున్నావని అంటుంది.

Continues below advertisement

ఇక్కడ చాటుగా చేయాల్సిన పనులేవీ ఉండవని...ఈ ఇంటికి వచ్చి ఇన్నేళ్లవుతున్నా నీకు  ఇక్కడి పద్ధతులు ఏం అలవాటు కాలేదని మండిపడుతుంది. అయితే ఇప్పుడు ఆ కేదార్‌గాడిని ఇంటి వారసుడిగా తీసుకొస్తారా అని యువరాజు ప్రశ్నిస్తాడు. ఈ మొత్తం ఆస్తికి నేనే వారసుడినని చిన్నప్పటి నుంచి చెప్పి పెంచారని ఇప్పుడు సడెన్‌గా ఎవడికో కట్టబెట్టి నాకు సెకండ్ ప్లేస్ ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పరిస్థితులు అర్థం చేసుకోమని కౌషికి చెబుతుంది.

ఇప్పుడు ఆ వీరశంకర్‌ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని...వాటిని తీసుకుని ఆయన మీడియా ముందుకు వెళ్తే మన పరువే పోతుందని చెబుతుంది ఆ సాక్ష్యాలు లేకుండా చేస్తానని యువరాజు అనగా....కౌషికి తమ్ముడిపై మండిపడుతుంది. నువ్వు చేసిన పని వల్లే ఇప్పుడు కనీసం ఆయన్ను క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయామని చెబుతుంది.ఆయన ఇంటికి వచ్చిన రోజే మనం అబద్ధం చెప్పకుండా మన పరిస్థితి ఇదని చెప్పి ఉంటే ఆయన విని ఉండేవాడని కోప్పడుతుంది. మీరు వాడిని కొడుకుగా ఒప్పుకుంటే నేను చచ్చిపోతానని వైజయంతి బెదిరిస్తుంది. నేనే ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటానని మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని సుధాకర్‌ అందరినీ పంపించేస్తాడు.

Continues below advertisement

వీరశంకర్‌తోపాటు మహల్‌లో ఉన్న జగధాత్రి, కేదార్‌కు సాధూ ఫోన్‌ చేస్తాడు.  మినిస్టర్‌ రాయుడు ఏదో జాతరకు వెళ్తున్నాడని...ఆయన అక్కడ ప్రమాదం ఉందని చెప్పి మీ ఇద్దరినీ  సెక్యూరిటీగా పంపించమంటూ పై నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడని చెబుతాడు. ఇదేదో కావాలని చేస్తున్నట్లు ఉందని...మీ ఇద్దరినీ చంపడానికి ప్లాన్ ఏదైనా వేసి ఉంటాడని చెబుతాడు. మీరు జాతరకు వెళ్లొద్దని చెబుతాడు.మనం వెళ్తేనే కదా సార్ వాడి ప్లాన్ ఏంటో తెలుస్తుందని జేడీ అంటుంది. మేం జాగ్రత్తగానే వెళ్లి వస్తామని అంటుంది. మనం బయటకు వెళ్తే...ఆ యువరాజు సాక్ష్యాలు కోసం తాతయ్యను ఏమైనా చేస్తాడేమోనని కేదార్ భయపడతాడు. కానీ వీరశంకర్‌ నాకు ఏం కాదులే మీరు వెళ్లిరండని చెబుతాడు. సాక్ష్యాలు ఎక్కడ దాచిపెడదామని ఆలోచిస్తుండగా...హాల్‌లో అమ్మ ఫొటో వెనకపెడదామని అప్పుడే యువరాజు చూడడని చెబుతాడు. అయితే అక్కడే పనిమనిషిగా ఉన్న యువరాజు మనిషి ఇదంతా విని యువరాజుకు చేరవేస్తాడు.

జాతరకు వచ్చిన మినిష్టర్‌ను చూసి జేడీ వార్నింగ్‌ ఇస్తుంది. కనీసం కొడుకుని విదేశాలకు పంపించినా ప్రాణాలు దక్కేయని అంటుంది.ఇప్పుడు అనవసరంగా మా చేతిలో చావబోతున్నాడని చెప్పి వెళ్లిపోతుంది. మీనన్‌తో కలిసి గుడికి వచ్చిన అవినాష్‌కు తండ్రి ఫోన్ చేసి పారిపొమ్మని చెబుతాడు. ఆ జేడీని చంపేవరకు నేను ఎక్కడికి వెళ్లనని అవినాష్ అంటాడు . షార్ప్‌షూటర్‌తో ముందు కేడీని చంపి....ఏడుస్తున్న జేడీని చంపాలని ప్లాన్ వేస్తారు.షూటర్‌ కాల్చిన బుల్లెట్ కేడీకి తగలకుండా పక్కకు పోతుంది.

వెంటనే గుర్తించిన జేడీ అక్కడి నుంచి భర్తను తీసుకుని వెళ్లిపోతుంది. అవినాష్‌ దగ్గరకు వెళ్లి నువ్వు మరీ ఇంత పిరికివాడివి అనుకోలేదని రెచ్చగొడుతుంది.అసలు మేం మిమ్మల్ని చంపాలనుకుంటే ఎప్పుడో చంపేవాళ్లమని అవినాష్ అంటాడు. మా టార్గెట్ మీరు కాదని జనం అని అంటాడు. ఇక్కడ మరికాసేపట్లో బాంబు పేలి పెద్ద ఎత్తున జనం చావబోతున్నారని చెబుతాడు. ఇంతకలో అవినాష్ ఫ్రెండ్‌ కార్తిక్ భయపడి వాళ్లతో పెట్టుకోవద్దని అంటాడు.నీకు అంత భయం ఉంటే విదేశాలకు వెళ్లిపొమ్మని పాస్‌పోర్టు ఇస్తాడు. బాంబు ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు జేడీ,కేడీ వెళ్తారు. ఇంతలో కార్తీక్ భయపడి కారులో పారిపోతుంటాడు. అయితే కేడీ  ఆ బాంబు ఎక్కడ ఉందో కనిపెట్టి పారిపోతున్న కార్తీక్ కారులో పడేస్తాడు. అంతే బాంబు పేలి కార్తిక్ తునాతునకలవుతాడు.

మరిన్ని తెలుగు సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి