Jagadhatri Serial Today Episode : మీనన్ బతికే ఉన్నాడని తెలుసుకున్న జేడీ, కేడీ...వాడికి మాస్ వార్నింగ్ ఇస్తారు. తన గుట్టు ఎలా తెలుసుకున్నారని మీనన్‌కు అనుమానం వస్తుంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినా...ఎలా కనిపెట్టారని మీనన్ జేడీని అడుగుతాడు. నువ్వు అంత ఈజీగా చచ్చిపోయినరోజే జేడీ అనుమానించిందని కేడీ అంటాడు. ఆ తర్వాత నువ్వు కౌషికి ఇంటికి మొదటి రోజు వచ్చినరోజే నా అనుమానం బలపడిందని జేడీ అంటుంది.
నువ్వు ఆగదిలో ఉన్నావని నాకు అర్థమైందని అంటుంది. ఆ తర్వాత సుధాకర్‌గారిని చంపడానికి వచ్చిప్పుడే కన్ఫార్మ్ చేసుకున్నానని అంటుంది.ఎందుకంటే అక్కడ గార్డెన్‌లో పడిన షూమార్క్ 12 ఇంచ్‌లు అని...ఈ సిటీలో అలాంటి పెద్ద షూ వేసుకునే గ్యాంగ్‌స్టర్ నువ్వు తప్ప ఇంకెవరూ లేరని అప్పుడే నిర్థారించుకున్నానని అంటుంది. జేడీ తెలివితేటలకు మీనన్ ముగ్దుడవుతాడు.నీ నుంచి తప్పించుకుని మీనన్ చనిపోయాడని నమ్మించడానికే నాకు నాలుగు నెలలు పట్టిందని...అలాంటిది ఓ షూమార్కు చూసి నువ్వు నేను బతికే ఉన్నానని కనిపెట్టావంటే నీ తెలివితేటలకు జోహార్లు అంటాడు.
కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చేతిల్లో చావబోతున్నావంటూ గన్ తీసుకుని ఆమెకు గురిపెడతాడు. మీనన్ చేతిని కాలుతో తన్ని ఆ గన్ కిందపడేస్తుంది జేడీ. రౌడీలను ఇద్దరూ కలిసి ఉతికి ఆరేస్తారు.
సరిగ్గా జేడీ రౌడీలను బాదుతుంటే...మీనన్ గన్ తీసుుని జేడీని కాలుస్తాడు.అప్పుడే అక్కడికి వచ్చిన రాగిని బుల్లెట్‌కు అడ్డం వెళ్లగా...అది ఆమె ఛాతిలోకి దూసుకెళ్లిపోతుంది. దీంతో జేడీ,కేడీ అమెను పట్టుకుంటారు.అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారని...ఎందుకు నాకు అడ్డుపడ్డారని జేడీ ప్రశ్నిస్తుంది.
ఈ గొడవలో మీనన్ అక్కడి నుంచి పరారవుతాడు. మీరు ఎందుకు నా ప్రాణాలు కాపాడారని జేడీ ప్రశ్నించగా...నా ఆడబిడ్డ ఏ తప్పు చేయలేదని, ఆమె ఎంతో నిజాయితీపరురాలని నిరూపించాలంటే ఆమె కూతురు జగధాత్రి బతికే ఉండాలి కదమ్మా అందుకే నా ప్రాణాలు అడ్డువేసి నా మేనకోడలు ప్రాణాలు కాపాడుకున్నానని అనడంతో జేడీ షాక్ తింటుంది. మేం ఎన్ని అవమానాలు చేసినా ఓర్చుకుని ముసుగు వేసుకుని ఇన్నాళ్లు మా ప్రాణాలు కాపాడుతోంది జేడీ రూపంలో ఉన్న నా కోడలు జగధాత్రినేనని నాకు తెలిసిపోయిందమ్మా అని అనడంతో....జేడీ తన ముఖానికి ఉన్న ముసుగు తొలగిస్తుంది.
ఎంత పనిచేశారు అత్తయ్యా అంటూ బాధపడుతుంది. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా రాగిణి వద్దని చెబుతుంది.నేను ఇంకా బ్రతకలేనని నాకు తెలుస్తోందని చెబుతుంది.కాకపోతే...నా కోడలు నిజాయితీపరురాలైన పెద్ద పోలీసు ఆఫీసరని నేను ప్రపంచానికి చెప్పకుండానే చనిపోతున్నానని బాధగా ఉందని అంటుంది.అవినీతిపరులైన ఈ రౌడీలను న్యాయస్థానం ముందు నిలబెడతానని నాకు మాటివ్వమని జగధాత్రి దగ్గర మాటతీసుకుని రాగిణి కన్నుమూస్తుంది.
రాగిణి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తారు.కౌషికితోపాటు నిషిక,యువరాజు సహా ధాత్రి అందరూ హాజరవుతారు. తల్లి చనిపోవడంతో యామిని చాలా ఏడుస్తుంది. తన తల్లిని చివరిసారిగా చూడలంటూ గొడవ చేస్తుంది. ధాత్రి చెప్పడంతో ఆమెను చివరి చూపు చూడనిస్తారు.అయితే ఆమెు అంత్యక్రియలు చేయడానికి యువరాజు సిద్ధమవుతుండగా....రాగిణి అంత్యక్రియలు తన కూతురు యామినియే చేస్తుందని జగధాత్రి అంటుంది.
ఆడపిల్లలు ఇలాంటి పనులు చేయకూడదని కాటికాపరి చెప్పినా....అలాంటి రోజులు పోయాయని చెప్పి యామినితో ధాత్రి అంత్యక్రియలు చేయిస్తుంది.అప్పుడే మీనన్ దగ్గర నుంచి జగధాత్రికి ఫోన్ వస్తుంది. ఎందుకు ఫోన్ చేశావని నిలదీయగా....కౌషికి వాళ్ల ఇంట్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుంటానని సవాలు విసిరావు కదా...ఇప్పడు ఒక ప్రాణం పోయిందని అంటాడు. అయినా కౌషికి వాళ్ల కుటుంబానికి నీకు ఉన్న సంబంధం ఏంటని అడుగుతాడు.నీ ప్రాణాలు కాపాడేందకు నిషిక వాళ్ల అత్త ఎందుకు తన ప్రాణాలు తీసుకుందని ప్రశ్నిస్తాడు.ఏదీ ఏమైనా నీపై నేను పైచేయి సాధించానని అంటాడు.
