Jagadhatri Serial Today Episode : బిజినెస్‌ ఢీల్‌ కోసం 10 కోట్ల రూపాయలు ఇంట్లో తీసుకొచ్చి నిషిక పెట్టడంతో  ధాత్రి బయపడుతుంది. అక్కకు ఏమైనా జరుగుతుందా అని కేధార్‌ కూడా అనుమానిస్తాడు.నిషిక వాళ్లు ఏమైనా ప్లాన్ వేస్తున్నారని భయపడుతున్నావా అని అంటాడు.ఇంట్లో వాళ్లే కాదు...ఇంత డబ్బు వదిన తీసుకొచ్చిందని తెలిస్తే బయట వాళ్లు కూడా దాడి చేయొచ్చు కదా అని ధాత్రి అంటుంది.ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని అంటుంది. 
 
అంతా నిద్రపోయిన తర్వాత...మీనన్‌ తన మనుషులతో కౌషికి ఇంటికి వస్తాడు.అదేపనిగా  మెయిన్ గుమ్మం వద్ద రౌడీలుు రాళ్లు విసురుతుంటారు. ఆ శద్ధానికి బయపడి లేచి బయటకు వచ్చిన ధాత్రి, కేదార్‌,నిషిక, యువరాజు, వైజయంతితోపాటు సుధాకర్‌పైనా రాళ్లుపడతాయి. అప్పుడే మీనన్ తెలివిగా  మరోదారిలో నుంచి కౌషికి రూమ్‌లోకి వెళ్తాడు. మీనన్ వెళ్లిన వెంటనే రాళ్లు విసరడం ఆపేస్తారు రౌడీలు. రాళ్ల శద్ధానికి మనమే పై నుంచి కిందకు వచ్చినా....కింద రూమ్‌లోనే ఉండే కౌషికి వదిన ఎందుకు బయటకు రాలేదని నిషిక అంటుంది. ఏం జరిగిందో చూద్దాం పదండని అందరూ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తారు.
కౌషికి రూమ్‌లోకి వెళ్లిన మీనన్‌..ఆమెను కసితీరా చంపాలని పెద్దకత్తితో  ఆమె పడుకున్న మంచపై పదేపదే పొడుస్తాడు.ఎంత పొడిచిన రక్తం రాకపోవడంతో అనుమానం వచ్చి దుప్పటి తెరిచి చూస్తాడు.అక్కడ కౌషికి ఉండదు...కేవలం దిండ్లు ఉండటం చూసి తన ప్లాన్‌ ఫెయిల్‌ అయ్యిందనుకుని బయటకు పారిపోతుండగా...కేదార్‌ చూసి ధాత్రిని పిలుస్తాడు. ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పి వాళ్ల వెంటపడతాడు. అప్పటికే మీనన్ తన మనుషులకు కాల్‌ చేసి కారు తెప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు.దీంతో అందరూ కౌషికి ఏమైందని ఆమె రూమ్‌లోకి వెళ్లి చూస్తారు. అక్కడ దిండ్లను కత్తితో పొడిచిన ఆనవాళ్లు కనిపించి షాక్‌కు గురవుతారు. మరి కౌషికి ఏమైందని సుధాకర్‌ అంటుండగా...కౌషికి బయట నుంచి గదిలోకి రావడం చూసి ఊపరి పీల్చుకుంటారు. ఏం జరిగిందని సుధాకర్‌ అడగ్గా...రాత్రి జగధాత్రి, కేదార్ వచ్చి కీడుశంకించి తనను వేరే గదిలో వెళ్లి పడుకోమని సలహా ఇచ్చారని చెబుతుంది. వాళ్లే లేకుంటే ఇవాళ నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదని అంటుంది. తన ప్రాణాలు కాపాడిన ధాత్రికి ఆమె థ్యాంక్సు చెబుతుంది. రేపు ఉదయం కూడా డబ్బులు తీసుకెళ్లేప్పుడు కేదార్‌, ధాత్రిని వెంట తీసుకెళ్లమని సుధాకర్‌ సలహా ఇస్తాడు. 
 
ఇన్ని రూమ్‌లు ఉన్నా సరిగ్గా కౌషికి రూమ్‌లోకే దుండగులు వెళ్లడం చూస్తే ఏదో అనుమానం వస్తోందని జగధాత్రి కేదార్‌తో అంటుంది. డబ్బులు కోసమే వచ్చి ఉంటారులే అని కేదార్ అనగా....లేదు కేదార్‌ డబ్బులు కోసం వచ్చిన వాళ్లే అయితే ఇంట్లో కప్‌బోర్డులు వెతికే వాళ్లని కానీ అలాంటి ఆనవాళ్లు ఆ రూమ్‌లో ఎక్కడా లేవని...ఖచ్చితంగా కౌషికిని చంపడానికే వచ్చినట్లు నేరుగా ఆమె పడుకున్న బెడ్‌పైనే కత్తితో దాడిచేశారని అంటుంది.కౌషికి వదినకు మీనన్‌ కనిపించడం, మామయ్యగారిపై ఎటాక్‌కు చేయడం, ఇప్పుడు ఇంట్లో నేరుగా కౌషికిపైనే దాడికి ప్రయత్నించడం చూస్తుంటే మనకు తెలియకుండా ఏదో జరుగుతోందని అంటుంది. అది ఏంటో మనం కనిపెట్టాలని అంటుంది. ఉదయం కౌషికితోపాటు డబ్బులు తీసుకుని వెళ్లడానికి కేదార్‌, ధాత్రి రెడీ అవుతుండగా....సాధూసార్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. మీ అమ్మ హత్యకు, అప్పటి ముఖ్యమంత్రి మర్డర్‌కు సంబంధం ఉందని మీరు అనుమానిస్తున్నారు కదా అని అంటాడు. అవును సార్‌ కాకపోతే దానికి సంబంధించిన ఆధారాలేవీ మాకు దొరకడం లేదని అంటాడు. 
 
ఓ మంచి ఆధారం లభించిందని సాధు సార్‌ చెబుతాడు. ముఖ్యమంత్రి మర్డర్ జరగ్గానే అప్పటి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ ధనుంజయ్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయాడని...అప్పటి నుంచి అతను దుబాయ్‌లోనే ఉంటున్నాడని చెబుతాడు. ఇక్కడ ఏదో ల్యాండ్ అమ్మడానికి  నిన్నే ఇండియా వచ్చాడని తెలిసిందని చెబుతాడు.ఇవాళ రాత్రికే అతను తిరిగి దుబాయ్‌ వెళ్లిపోతున్నాడని సాధుసార్‌ చెబుతాడు. మీరు వెళ్లి అతన్ని కలిస్తే ఏదో సమాచారం దొరకవచ్చని చెప్పి అడ్రస్‌ పంపుతాడు. ధాత్రి మాకు వేరే పనుందని కౌషికి చెప్పి ధనుంజయ్‌ను కలుస్తారు. నాకు ఏ విషయాలు తెలియదని...నన్ను మళ్లీ ఆ కేసుల్లోకి లాగొద్దని ధనుంజయ్ ధాత్రితో అంటాడు.