Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. ఎన్నోరోజుల తర్వాత కలిసిపోయిన అక్కాచెల్లెళ్లు...దివ్యాంక పెట్టిన చిచ్చుతో కొద్దిరోజుల్లోనే విడిపోయారు .వైజయంతి సాయంతో దివ్యాంక ఆడిన నాటకం నిజమని నమ్మిన ధాత్రి...జగధాత్రిపై చేయిచేసుకుంటుంది. నిషిక మళ్లీ దివ్యాంక ఉచ్చులో చిక్కుకుంటుందని జగధాత్రి భయపడుతుంది.భద్రం గురించి నిజం చెప్పేసిన నిషిక చిలకమ్మన తీసుకెళ్లడానికి వచ్చిన భద్రం....దెయ్య వదిలిస్తామంటూ మాంత్రికుడిని తీసుకుని వచ్చి చిలకమ్మను కొడుతుండటం చూసి నిషిక నిజం చెప్పేస్తుంది.అసలు ఈ భద్రం చిలకమ్మ భర్తేకాదని...అత్తయ్య నాటకం ఆడటానికి తీసుకొచ్చిన మనిషిఅని నిజం చెప్పేస్తుంది. ఈ చిలకమ్మను ఇంట్లోనుంచి బయటకు పంంపించడానికి అత్తయ్య ఇదంతా చేశారని చెబుతుంది.దీనికి నేను కూడా సహకారం అందించానని వివరిస్తుంది. దీంతో కౌషికి,సుధాకర్ వైజయంతిని తిడతారు. నీ అనుమానంతో అందరినీ ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరిస్తారు.దివ్యాంక ప్లాన్ అమలు నిషిక పూర్తిగా వాళ్ల అక్క పక్షంలో చేరిపోవడంతో వైజయంతికి ఏం అర్థంకాదు. ఇప్పుడు కనుక నిషికను తనవైపు రప్పించుకోకుంటే మేం చేసిన దారుణాలన్నీ చెప్పేస్తుందని భయపడుతుంది.వెంటనే దివ్యాంకకు ఫోన్ చేసి విషయం చెబుతుంది.ఇప్పుడు మీరు జగధాత్రి ఫోన్ తీసుకుని సోనీకి మెసేజ్ పెట్టండని...ఖచ్చితంగా ఆ సోనీ రిప్లై ఇస్తుందని చెబుతుంది. దీంతో వైజయంతి జగధాత్రి ఫోన్ దొంగలించి చాటుగా వెళ్లి దివ్యాంక పంపిన ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పెడుతుంది.అటు నుంచి సోనీ కూడా దివ్యాంక ప్లాన్ ప్రకారం రిప్లైలు ఇస్తుంది.అది చూసిన వైజయంతి నిజంగానే సోనీ జగధాత్రి మనిషి అని అనుకుంటుంది. నా కొడుకు కాపురం కూల్చడానికే ఇలా చేసిందని భ్రమపడుతుంది. వెంటనే నిషిక దగ్గరకు వెళ్లి నీకు ఓ నిజం చూపిస్తానంటూ ఆమె చేయిపట్టుకుని హాల్‌లోకి లాక్కొస్తుంది.జగధాత్రిపై చేయిచేసుకున్న నిషిక ఇంతలో తన ఫోన్ కనిపించకపోవడంతో జగధాత్రి వెతుకుతుండగా...వైజయంతి తీసుకుని వస్తుంది.సోనీతో తాను ఛాటింగ్ చేసిన మెసేజీలన్నీ అందరికీ చూపిస్తుంది. అవి చూసిన నిషిక కోపంతో రగిలిపోతుంది. నా కాపురం నాశనం చేయాలని చూస్తావా అని జగధాత్రిపై చేయిచేసుకుంటుంది. నేను ఇలాంటి పనులు ఎందుకు చేస్తానని చెప్పినా వినిపించుకోదు. అనవసరంగా నిన్ను నమ్మి నేను మోసపోయానని తిడుతుంది. దీనికి వైజయంతి కోసం ఆజ్యం పోస్తుంది.నా కొడుకు, కోడలిని విడదీసి నీ భర్తను ఈ ఇంటికి వారసుడిని చేద్దామని ఇదంతా చేస్తున్నావని మాకు తెలుసులేనని చెబుతుంది. ఆ మాటలు విన్న జగధాత్రి అసలు నా చెల్లెలు కాపురం నేను ఎందుకు కూల్చుతానని అంటుంది. కౌషికి, సుధాకర్ కూడా జగధాత్రి ఇలాంటి పనులు చేసిందంటే నేను నమ్మనని అంటుంది. వెంటనే నిషిక ఫోన్ తీసుకుని సోనీకి జగధాత్రి ఫోన్ నుంచే ఫోన్ చేయగా...అవతల సోనీ కూడా నిషికకు అనుమానం కలిగేట్లుగానే మాట్లాడుతుంది.ఇదే నిజమని నమ్మి నిషిక అక్కడ నుంచి వెళ్లిపోతుంది. నువ్వు ఏ తప్పు చేయలేదని మేం నమ్ముతున్నామని...కానీ మీ చెల్లి నమ్మాలంటే అది నువ్వు నిరూపించుకోవాల్సిందేనని సుధాకర్ జగధాత్రికి చెబుతాడు. నిషిక తనపై కోపంతో ఆ దివ్యాంక ఉచ్చులో ఇరుక్కుంటుందేమోనని భయంగా ఉందని ధాత్రి బాధపడుతుంది.జేడీ చేతికి కిడ్నాప్ కేసు సాధూసార్ ఫోన్ చేసి నగరంలో వరుస కిడ్నాప్‌లు జరుగుతున్నాయని...బస్తీలో ఉండే యువతీ,యువకులను కిడ్నాప్‌లు చేస్తున్నారని వెంటనే ఈ కేసు చూసుకోవాలని చెబుతాడు. ఈపనులన్నీ చేయిస్తున్నది మీనన్ అని జేడీకి అనుమానం వచ్చి ఆ దిశగా విచారణ చేపడుతుంది.
