Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. మీనన్‌ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి అడవిలోకి తీసుకెళ్లిన జేడీ,కేడీ వాడిని బతికి ఉండగానే తల వరకు పాతిపెట్టి వస్తారు. యువరాజును కలవడానికి సోనీ ఇంటికి రాగా....నిషిక కోపంలో కాఫీలో కారం కలిపి ఇస్తుంది. అది ఆదిలక్ష్మీ తాగి కుర్రోమొర్రో అంటుంది.మీనన్‌ను పాతిపెట్టిన జేడీ                          పోలీసుస్టేషన్‌పై దాడి చేసిన మినిస్టర్ మనుషులను జేడీ,కేడీ ఇరగ్గొట్టి మీనన్‌ను తీసుకుని వెళ్లిపోతారు. మీడియాలో అంతా రౌడీలు పోలీసుస్టేషన్‌పై దాడి చేసి మీనన్‌ను ఎత్తుకెళ్లిపోయారని అనుకుంటారు. కానీ జేడీ,కేడీలు మారువేషంలో మీనన్‌ను ఎత్తుకెళ్లిపోతారు. నిర్మాణనుష్యమైన అటవీ ప్రాంతానికి మీనన్‌ను తీసుకెళ్లిపోతారు. ఎవరూ లేని అడవిలో తలవరకు గోతి తీసి కప్పిపెడతారు. ఇంతలో మినిస్టర్‌ ఫోన్ చేసి బెదిరించగా....అతనికి ధాత్రి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటికి మీనన్‌ పని అయిపోయిందని...ఆరుగురు పిల్లలను చంపిన నిన్ను కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తుంది.  మీనన్‌ను చంపకుండా వదిలిపెట్టడంతో అతను ఎంతో బ్రతిమలాడతాడు. మీరు చెప్పినట్లే కోర్టులో అన్ని నేరాలు ఒప్పుకుంటానని చెబుతాడు. ఇన్ని పాపాలు చేసిన నీకు బతికే హక్కులేదని అందుకే చచ్చిపొమ్మని జేడీ అంటుంది. నీలాంటి పాపిని చంపే పాపం మాకు వద్దని అందుకే ప్రాణాలతో పాతిపెట్టి వెళ్తున్నామని చెబుతుంది. ఈ అడవిలో పులులు, పాములు చాలా ఉంటాయని హెచ్చరిస్తుంది. ఆకలితో చచ్చిపోతావో లేక భయంతో చచ్చిపోతావో, లేక ఏదైనా క్రూర మృగాలకు ఆహారమైపోతావో నీ ఇష్టమని చెబుతుంది. నువ్వు ఎంత గట్టిగా అరిచి మొత్తుకున్నా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక్కరూ నిన్ను కాపాడలేరని చెబుతుంది. అలాగే మీనన్ అరుస్తున్నా వినిపించుకోకుండా జేడీ, కేడీ వెళ్లిపోతారు.యువరాజు ఇంట్లో సోనీ                     మీనన్‌ పని అయిపోయింది కాబట్టి మనం హనీమూన్‌కు వెళ్దామని కేదర్‌ జగధాత్రిని అడుగుతాడు. అయితే ఆదిలక్ష్మి అత్తయ్యగారికి కూడా టిక్కెట్ బుక్‌ చేయమని చెబుతుంది. ఇప్పుడు ఆమె ఎందుకని అడగ్గా...మనం లేకుంటే మీ అక్కను టార్చర్‌ పెట్టకుండా ఉండటానికి అని మాట్లాడుకుంటుండగా సోనీ వస్తుంది. సోనీని చూడగానే జగధాత్రికి కోపం  వచ్చి నిలదీయడానికి వెళ్తుండగా....నిషిక, వైజయంతి వస్తారు. ఎంత ధైర్యం ఉంటే మళ్లీ  నా ఇంటికి వస్తావు అని నిషిక మండిపడుతుంది. సోనీపై చేయిచేసుకుంటడగా యువరాజు వచ్చి ఆపుతాడు. తప్పు చేసిన మీ అక్కను ఇంట్లో ఉంచుకుని బయటవాళ్లపై జులుం ఏంటని అంటాడు. మీ అక్క చెప్పబట్టే ఇలాంటి పని చేసిందిని సోనీ వచ్చి నాకు చెప్పుకుని బాధపడిందని అంటాడు.అయినా సరే ఈ సోనీ నీ ఆఫీసులో ఉండటం ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు  ఉంచుకున్నావని నిషిక మండిపడుతుంది. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందామని...నువ్వు వెళ్లి సోనీకి కాఫీ పెట్టకుని రమ్మని అంటాడు. కాఫీలో కారం కలిపిన నిషిక                             యువరాజుపై పిచ్చకోపంతో ఉన్న నిషిక కాఫీలో కారం, ఉప్పు కలిపి తీసుకొస్తుంది. సరిగ్గా సోనీకి కాఫీ ఇచ్చేసమయానికి అక్కడికి వచ్చిన ఆదిలక్ష్మీ....గంట నుంచి కాఫీ అని అరుస్తుంటే ఒక్కరూ పట్టించుకోరేంటని అంటూ సోనీ కోసం తెచ్చిన కాఫీ తీసుకుంటుంది. ఆ కాఫీ తాగొద్దని జగధాత్రి, కేదార్‌, నిషిక చెబుతున్నా వినకుండా తాగుతుంది. కారం మండిపోవడంతో అరుచుకుంటూ కిచెన్‌లోకి వెళ్లిపోతుంది. నన్ను చంపడానికే కాఫీలో కారం కలిపి ఇచ్చారని గొడవపెట్టుకుంటుంది. అసలు మేం వద్దు అని మొత్తుకుంటున్నా వినకుండా కాఫీ లాక్కుని తాగింది మీరని...మళ్లీ మేము కావాలని నీకు కాఫీ ఇచ్చినట్లు గొడవపెట్టుకుంటున్నావేంటని నిషిక నిలదీస్తుంది.అయితే కాఫీలో కారం ఎందుకు కలిపారని కౌషికి అడుగుతుంది. అది వేరే వాళ్ల కోసం కలిపామని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.