Jagadhatri Serial Today Episode: కౌషికిని అడ్డగించిన  మీనన్‌...ఆమె వద్ద ఉన్న వజ్రాలతోపాటు కౌషికి కూతురు కీర్తిని ఎత్తుకుపోయేందుకు ప్రయత్నస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జేడీ, కేడీ రౌడీలను చితికబాది...కీర్తిని విడిపిస్తారు. ఈ పెనుగులాటలో  వజ్రాలు ఉన్న కుంకుమ భరణి కిందపడిపోతుంది. వెంటనే మీనన్‌ ఆ కుంకుమ భరణి తీసుకుని పారిపోతాడు. వెంటనే జేడీ, కేడీ ఇద్దరూ మీనన్‌ను ఫాలో అవుతారు. కానీ మీనన్‌ వజ్రాలు తీసుకునిమాయమవుతాడు. మీనన్‌ ఎందుకు కౌషికిని ఎటాక్‌ చేశాడు...ఆమె వద్ద నుంచి ఏం తీసుకెళ్లాడని జేడీ ఆలోచిస్తుంది. అసలు కౌషికి ఈరూట్‌లో వస్తున్న సంగతి మీనన్‌కు ఎవరు చెప్పారని ఆలోచిస్తుంది. అప్పుడే నిషి అక్కడికి రావడం జేడీ, కేడీ ఇద్దరూ చూస్తారు. ఖచ్చితంగా నిషినే మీనన్‌కు సమాచారం ఇచ్చిందని అనుమానిస్తారు.                         ఇంతలో నిషిక మీనన్‌కు ఫోన్ చేసి అరుస్తుంది. మా ఆయన నీ మాట వినడం లేదని మామామయ్యని కిడ్నాప్ చేయాలని చూశావని...అది కుదరకపోయేసరికి నన్ను కిడ్నాప్ చేసి బెదిరించావని అంటుంది. నేను ఆరోజే చెప్పను కదా నీకు ఇల్లీగల్ పనల్లో సాయం చేయనని మరి ఇప్పుడు మా కౌషికి వదినను ఎందుకు అడ్డగించావని అంటుంది. ఇప్పుడు నువ్వు చేసిన పనికి అందరూ మా ఆయననే అనుమానిస్తారని అంటుంది. మా ఆయన,నేను ఎప్పటికీ నీకోసం పనిచేయమని దయచేసి మమ్మల్ని వదిలేయమని చెప్పి ఫోన్ పెట్టేసి వెళ్లిపోతుంది. ఈ మాటలు జేడీ,కేడీ వింటారు. అయితే ఆరోజు నిషిక మీనన్ కలిసింది కూడా తనతో పనిచేయడం ఇష్టంలేదని చెప్పడానికే అయ్యి ఉంటుందని ధాత్రి అంటుంది. మరి మీనన్‌ కోసం పనిచేస్తుంది ఎవరై ఉంటారని జగధాత్రి ఆలోచిస్తుంది. అయితే ఆ రోజు నిషికను ఫాలో అవుతూ మీనన్‌ దగ్గరకు వైజయంతి కూడా వెళ్తుంది. అదే రోజు మీనన్‌ ఆమెను చూస్తాడు. నిషిక వెళ్లిపోయిన తర్వాత వైజయంతిని పిలుస్తాడు. ఎందుకు వచ్చారని అడగ్గా...నా కొడకు,కోడలు చేయలేని పని  నేను చేస్తానని మీనన్‌తో వైజయంతి అంటుంది. ఆ మాటలు విని మీనన్‌ అదిరిపడతాడు. నేను అయితే ఆ ఇంట్లో ఎవరికీ అనుమానం రాదని అంటుంది. ఆ ఇంట్లో మా కొడుకు, కోడలికి మర్యాద ఉండాలంటే  డబ్బు కావాలని అంటుంది. నేను చెప్పిన పనిచేస్తే కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పడంతో  సంతోషంగా వెళ్లిపోతుంది.                       ఆ తర్వాత మీనన్‌ వజ్రాలు పంపించి వాటిని తాను చెప్పిన చోటకి చేర్చమని చెబుతాడు. ఆ పనిని నిషికను అడ్డుపెట్టుకుని పూర్తి చేస్తానని హామీ ఇస్తుంది. ఆమె చెప్పినట్లే...కుంకుమ భరణిలు, వజ్రాలు మీనన్‌ పంపిస్తాడు. ఆ విధంగా  నిషికను అడ్డుపెట్టుకుని వైజయంతి వజ్రాలను ఇంట్లోకి తెప్పించి వత్రం పేరిట వాటిని మీనన్‌ మనుషులకు అందజేస్తుంది. అలా మిస్సయిన కుంకుమ భరణి కౌషికి బ్యాగ్‌లో తీసుకెళ్తుందని తెలుసుకుని వైజయంతి మీనన్‌కు సమాచారం ఇస్తుంది. దీంతో అతడు కౌషికిని అడ్డగించి వజ్రాలు తీసుకుని వస్తాడు.ఆ వజ్రాలను మళ్లీ వైజయంతికి అంజేసి..తాను చెప్పిన ప్లేస్‌లో ఇవ్వాలని ఆదేశిస్తాడు.