Jagadhatri Serial Today Episode: కౌషికి అక్కతో పాటు తన తండ్రి సుధాకర్‌ అన్న మాటలు గుర్తుచేసుకుంటూ కేదార్ బాధపడుతూ ఉంటాడు. అటు ధాత్రి మాత్రం ఈ కేసు నుంచి కేదార్‌ను బయటపడేసేందుకు సాక్ష్యాలు కోసం ఆలోచిస్తుంటుంది. వీళ్లతోపాటు కేదార్‌ను ఇంట్లోకి రానివ్వకుండా బయటే ఉంచినందుకు కౌషికి,సుదాకర్‌ కూడా బాధపడుతుంటారు. ఎలాగైనా మనం ఆస్పత్రి వద్దకు వెళ్లి కమలాకర్‌ను కాపాడుకోవాలని ధాత్రి, కేదార్ అనుకుంటారు. ఇంతలో ఆస్పత్రి నుంచి ఫోన్‌కాల్‌ రావడంతో కౌషికి, సుధాకర్‌ అక్కడికి బయలుదేరుతుండగా....కేదార్‌, ధాత్రి కూడా బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. అంతలో అక్కడికి వచ్చిన కౌషికి వారిని ఆపుతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారని నిలదీస్తుంది. బయటకు వెళ్తున్నామని అనగా....నిషిక, యువరాజు కలుగజేసుకుని మొగుడు, పెళ్లాలు ఇద్దరూ కలిసి సాక్ష్యాలు తారుమారు చేయడానికి వెళ్తున్నారని అంటాడు. బాబాయికి స్పృహ వస్తే తనను పొడిచింది కేదార్  అని చెబుతాడని భయపడి బాబాయిని చంపినా చంపొచ్చని అంటాడు. అసలు మేం కమలాకర్‌ మామాయ్యను చంపాలని చూడలేదని చెబుతుంటే...మీరేమో ఇంకో హత్యకు పథకం వేస్తున్నారని అంటున్నారని ధాత్రి అంటుంది. ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా....మీరు మాత్రం మమ్మల్ని నమ్మారని అనుకున్నామని కౌషికిని అంటుంది.                       యువరాజు భయపడటంలోనూ న్యాయం ఉందని...మీరు బయటకు వెళ్లి సాక్ష్యాలను తారుమారు చేయరని గ్యారెంటీ ఏంటని కౌషికి ప్రశ్నిస్తుంది.కాబట్టి రేపటి వరకు ఇల్లు వదిలి ఎక్కడికి పోవద్దని ఆదేశిస్తుంది.దీంతో జగధాత్రి సమాధానమిస్తుంది. రేపటిలోగా మమల్నినిర్ధోషులుగా నిరూపించుకోమని సమయం ఇచ్చారు...మళ్లీ ఇల్లుదాటి  భయటకు వెళ్లొద్దని మీరే  అంటున్నారు...ఇదేక్కడి న్యాయమని ప్రశ్నిస్తుంది.మేం ఇంట్లోనే కూర్చుంటే సాక్ష్యాలు ఎలా సంపాధిస్తామని...మా నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటామని అంటుంది. అయితే  మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ  ఆస్పత్రి చుట్టుపక్కలకు రావొద్దని....అలా అయితేనే బయటకు వెళ్లండని చె‌ప్పడంతో వారిద్దరూ సరేనని వెళ్లిపోతారు. కౌషికి వాళ్ల ఆస్పత్రికి వచ్చేలోగా మనం అక్కడికి చేరుకుంటేనే కమలాకర్‌ మామయ్యను కాపాడుకోగలమని ధాత్రి చెప్పడంతో...కేదార్ ఆస్పత్రి వద్దకు వెళ్తాడు. ఇంతలో మీనన్ తన మనుషులతో అక్కడికి చేరుకుంటాడు.                       ఆస్పత్రి బయటే ఉండే కేదార్‌,ధాత్రి లీడ్‌ కోసం వెయిట్‌ చేస్తుంటారు.అప్పుడే అక్కడికి వచ్చిన కౌషికి, సుధాకర్‌... ఐసీయూ బయట ఉన్న కాత్యాయినిని పలకరించి డాక్టర్‌తో మాట్లాడేందుకు వెళ్తారు. ఆస్పత్రి లోపలకి వచ్చిన మీనన్‌....కాత్యాయిని కొట్టి ఐసీయూలోకి వెళ్తాడు. సుధాకర్‌ను చంపేందుకు కత్తి తీసుకుని సిద్ధంగా ఉంటాడు. ఐసీయూ ముందు పడిపోయి ఉన్న కాత్యాయినిని చూసి కంగారుపడిన ధాత్రి, కేదార్‌ లోపలికి వస్తారు. అప్పుడే ఐసీయూలో కమలాకర్‌ను చంపడానికి రెడీగా ఉన్న మీనన్‌ను చూస్తారు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడని కేదార్‌ అడుగుతాడు. ఈ మీనన్‌, హోంమంత్రి కలిసే ఈ ప్లాన్ వేశారని...ఇప్పుడు కమలాకర్‌ను చంపి ఆ నేరం నీపై వేయడానికే వచ్చాడని ధాత్రి చెబుతుంది.వెంటనే ఐసీయూ తలుపులు తీసుకుని వాళ్లిద్దరూ లోపలికి అడుగుపెడతారు.వాళ్లను చూసి మీనన్ ఆగిపోతాడు.

Continues below advertisement

 

Continues below advertisement