Jagadhatri Serial Today Episode: శ్రీవల్లికి పెళ్లి సంబంధం తీసుకురావడంతో ఆమెను అందంగా ముస్తాబు చేసి జగధాత్రి రెడీ చేస్తారు. ఈలోగా నిషి వచ్చి పెళ్లికూతురును తీసుకురమ్మని చెప్పారని చెప్పగానే శ్రీవల్లిని తీసుకుని జగధాత్రి,కేదార్ కిందకు వస్తారు. అయితే పెళ్లికొడుకు బాలరాజు, అతని తల్లిదండ్రుల వాలకం చూసి జగధాత్రికి, కేదార్‌కు అనుమానం వస్తుంది. పెళ్లికొడుకు అమెరికా రిటర్న్ అని చెప్పడంతో...కేదార్ అమెరికాలో ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారని అడగగానే బాలరాజు తెల్లముఖం వేస్తాడు. తనకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంతలో వైజయంతి కలుగజేసుకుని చికాగోలో పనిచేస్తున్నాడని చెబుతుంది. ఇంతలో కౌషికి కూడా సీటూసీ ఎంత అని అడగటంతో అతనికి ఏం అర్థంగాక బిత్తర చూపులు చూస్తున్నాడని గ్రహించి నిషిక మధ్యలోదూరి ఏడాదికి కోటి రూపాయలు వస్తాయని చెబుతారు. కానీ కేదార్, జగధాత్రికి మాత్రం అతనిపై అనుమానం పోదు. అలాగే ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తుంటే...వైజయంతి అడ్డుపడుతుంది. ముందు పిల్లా, పిల్లగాడికి నచ్చారో లేదో కనుక్కోమని చెబుతుంది. ఇద్దరూ ఒకరికొకరు నచ్చారని చెప్పుకుంటారు. ఇంతలో పెళ్లికొడుక్కి ఫొన్‌కాల్ రావడంతో మాట్లాడి వస్తానని బయటకు వెళ్తాడు. పెళ్లికొడుకు వెళ్లగానే ధాత్రి, కేదార్ కూడ బయటకు వచ్చి చర్చించుకుంటారు. వీళ్ల వాలకం చూస్తుంటే అన్నీ అబద్ధాలే చెప్పారని అనిపిస్తోందని అనుకుంటారు. వీళ్ల గుట్టు ఎలా బయటపెట్టేది అని ఆలోచిస్తుండగా....పెళ్లికొడుకికి వచ్చిన ఫోన్‌లోమాట్లాడుతుంటాడు. తనకు లోన్ వద్దని...అసలు తనకు ఉద్యోగమే లేదని, ఒక్క ముక్కకూడా ఇంగ్లీష్ రాదని ఫోన్‌లో చెబుతుంటే విన్న కేదార్ వాడిని పట్టుకుని నిలదీస్తాడు. చొక్కా పట్టుకుని అందరి ముందుకు లాక్కొని వస్తాడు. కేదార్‌ను అలా చూసి నిషిక, వైజయంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ పనేంటని నిలదీస్తారు. వీడు అసలు అమెరికా నుంచే రాలేదని...మనకి అబద్ధం చెప్పాడని చెబుతాడు. అసలు ఏం జరిగిందని కౌషికి నిలదీస్తుంది.దీంతో బయట తాము విన్నదంతా పూసగుచ్చినట్లు జగధాత్రి చెబుతుంది. వీడికి ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ రాదని చెబుతారు. వెంటనే కలుగజేసుకున్న వైజయంతి లోన్ వాళ్ల నుంచి తప్పించుకోవడానికే ఉద్యోగం లేదని అబద్ధం చెప్పి ఉంటాడని అంటుంది. మళ్లీమళ్లీ ఫోన్ చేసి విసిగించకుండా తనకు ఇంగ్లీష్ రాదని వాళ్లతో చెప్పి ఉంటాడని వెనకేసుకొస్తుంది. వాళ్లతో అలా అబద్ధం చెప్పినంత మాత్రానా అతనికి ఇంగ్లీష్ రాదనుకుంటే ఎలా అని గట్టిగా మందలిస్తుంది. ఇంత అవమానం జరిగిన చోట తాము ఉండమంటూ పెళ్లికొడుకు తల్లిదండ్రులు బయటకు వచ్చేస్తారు. వాళ్లవెనకే వైజయంతి,నిషిక కూడా వచ్చి....రాజును చావగొడతారు. తమ ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉన్నావని మండిపడతారు. ఈసారి వచ్చినప్పుడు తాము చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని రావాలని మందలిస్తారు. పెళ్లికొడుకును ఏం అడిగినా అత్తయ్య సమాధానం చెబుతోందని...వాళ్ల గురించి నిజం చెప్పినా వెనకేసుకొస్తోందని ధాత్రి కేదార్‌తో అంటుంది. వాళ్ల శ్రీవల్లికి పెళ్లి చేయాలని అనుకోవడంలేదని....తనను వదిలించుకోవాలని అనుకుంటున్నారు కాబట్టే ఇలాంటి సంబంధాలు తెస్తున్నారని కేదార్ అంటాడు.
Jagadhatri Serial Today January 13th: శ్రీవల్లి పెళ్లిచూపులు ఎలా జరిగాయి..?వచ్చిన పెళ్లికొడుకు దొంగ పెళ్లికొడుకని జగధాత్రి కనిపెట్టిందా లేదా..?
ABP Desam | 13 Jan 2026 11:02 PM (IST)
Jagadhatri Serial Today Episode January 13th: శ్రీవల్లిని చూడటానికి వచ్చిన పెళ్లికొడుకు దొంగపెళ్లికొడుకని ధాత్రి, కేదార్ కనిపెట్టినా...వైజయంతి, నిషిక మాటలతో మాయచేసి వాళ్లను పంపించేస్తారు.
జగద్ధాత్రి సీరియల్ టుడే ఏపిసోడ్