Jagadhatri Serial Today Episode: జగధాత్రి,కేదార్ తప్పు చేయలేదని కౌషికి, సుధాకర్‌ నమ్మడంతో వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. దీంతో వాళ్లు లోపలికి వస్తాడు. అవుట్‌హౌస్‌ నుంచి బయటకు పంపాలని చూస్తే వీళ్లు మళ్లీ ఇంట్లో చేరారని యువరాజు, నిషిక బాధపడతారు. ఎలాగైనా వీరిని శాశ్వతంగా బయటకు పంపించాలని యువరాజు అన్నాడు.తెల్లారిన తర్వాత కౌషికి ధాత్రి వాళ్ల దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరుతుంది. అందరిలా నేను కూడా మిమ్మల్ని అవమానించానని బాధపడుతుంది. మీ మంచితనం గురించి  తెలిసికూడా కళ్లతో చూసిందే నిజమని నమ్మి మిమ్మల్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాని అంటుంది. దీనికి జగధాత్రి బాధపడొద్దని...ఆ సమయంలో ఎవరు ఉన్నా అలాగే ప్రవర్తిస్తారని అంటుంది. ఇందులో మీ తప్పేమిలేదని సర్దిచెబుతుంది. నేను కూడా కోపంలో బాబాయిపై చేయి చేసుకోకుండా ఉండాల్సిందని  కేదార్ వాళ్ల అక్కతో అంటాడు. అసలు మీనన్‌కు బాబాయిని చంపాల్సిన అవసరం ఏముందని...ఈ కేసు నీపై నెట్టాలని ఎందుకు అనుకున్నాడని కౌషికి అంటుంది. ఆవిషయమే మనం తెలుసుకోవాలి వదినా అని జగధాత్రి అంటుంది.  ఆ కమిషనర్‌ కేదార్ బెయిల్ రద్దు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడని...ఈలోగా మనం ఆ నిజం కనిపెట్టి  కేదార్‌ నిర్దోషని నిరూపించాలని ధాత్రి అంటుంది.అయితే ఆ పనిలో ఉండడని చెప్పి కౌషికి వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన నిషిక...వదిన మళ్లీ వీళ్లను పూర్తిగా నమ్ముతోందని బాధపడుతుంది. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా దీని చేతిలో మాత్రం గెలవలేకపోతున్నానని అనుకుంటుంది.                శ్రీవల్లిని చూసుకునేందుకు పెళ్లికొడుకు మళ్లీవస్తాడు. వాడిని మేడమీద నుంచే చూసి వైజయంతి ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.గతంలో మాదిరిగా ఏదైనా తప్పు చేస్తే ఈసారి తాటతీస్తానని హెచ్చరిస్తుంది.అంతా ప్రిపేర్ అయ్యే వచ్చామని ఖచ్చితంగా ఇవాళ ఎంగేజ్‌మెంట్‌కు ముహూర్తం పెట్టుకునే వెళ్తామని చెప్పి లోపలకి వస్తాడు. రాగానే సుధాకర్‌ కాళ్లకు దణ్ణం పెట్టి వారిని బుట్టలో పడేయాలని చూస్తాడు. జగధాత్రి శ్రీవల్లిని అడుగుతుంది.అబ్బాయి నీకు నిజంగా నచ్చితేనే చెప్పు లేకుంటే పెళ్లి ఆపించేస్తానని చెబుతుంది. అమ్మకు ఇష్టమైంది కాబట్టి నాకు ఇష్టమేనని చెబుతుంది.ఇప్పుడు అందిరి ముందు వద్దు అంటే అమ్మకు కోపం వస్తుందని చెబుతుంది. ఇంతలో పెళ్లి కొడుకు ఈ వారమే ఎంగేజ్‌మెంట్ పెట్టుకుంటామని...మా పంతులుగారు శ్రీవల్లి జాతకం, నా జాతకం చూసి చెప్పారని అంటాడు. దీంతో జగధాత్రి కల్పించుకుని మా శ్రీవల్లి పుట్టినే తేదీనే మాకు తెలియదని...నీకు జాతకం ఎలా తెలిసిందని నిలదీస్తుంది.ఇంతంలో వైజయంతి కల్పించుకుని పేర్లు చూపించుకుని ఉంటారులేనని అంటుంది. ఇంట్లో  మా చిన్న మామ్యయ్యకు బాగాలేదని...ఇలాంటి టైంలో ఎంగేజ్‌మెంట్‌ పెట్టుకోవడం బాగుండదని ధాత్రి అంటుంది.దీనికి కౌషికి కూడా వంతపాడుతుంది. తాము వేసిన ప్లాన్ బెడిసికొట్టేలా ఉందని భావించిన కౌషికి, నిషిక....పెళ్లికొడుకుని ఉసిగొల్పుతారు.నాకు  ఎక్కువ సెలవులు లేవని...ఈవారంలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకుని నెలరోజుల్లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లాలని అంటాడు. దీంతో వైజయంతి కూడా  అతనికి మద్దతుగా నిలుస్తుంది.కమలాకర్‌ రెండురోజుల్లో కళ్లు తెరుస్తాడని డాక్టర్లు చెప్పారు కదా..ఇప్పుడు ఈసంబంధం వద్దంటే మళ్లీ ఇలాంటి మంచి సంబంధం రాదని చెబుతుంది. దీనికి అందరూ సరేననడంతో  పెళ్లికొడుకు నగలు, బట్టలు తెచ్చి శ్రీవల్లికి ఇస్తాడు. అవి పరిశీలించిన ధాత్రి అవి గిల్ట్‌ నగలులా ఉన్నాయని అనడంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని వాటని తీసుకుని వాళ్లు అక్కడి నుంచి జారుకుంటారు.మంచి సంంబధం చెడగొట్టారని వైజయంతి,నిషిక  ధాత్రిపై గొడపవడతారు.