Jagadhatri Serial Today Episode : శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్ వద్ద జగధాత్రి,కేదార్ ఉండకుండా చేయడం కోసం సురేష్‌ను కొట్టి యువరాజు దాచేస్తాడు. ఇంతలో నిషిక వెళ్లి జగధాత్రి, కేదార్‌ను బయటకు తీసుకొస్తుంది. ఏమైందని అడిగితే...సురేష్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని ఇంటి ముందు నుంచి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారని చెబుతారు.మా కళ్లముందే తీసుకెళ్లారని యువరాజు కూడా మాట కలుపుతాడు. ఆ మాటలు విన్న జగధాత్రి, కేదార్ ఎంతో ఆందోళన చెందుతారు. మీనన్ మనుషులే ఈ పని చేసి ఉంటారని భావిస్తారు. అయితే వెంటనే ఈ విషయం కౌషికి చెబుదామని కేదార్ అనగా...నిషిక వద్దని అంటుంది. ఇప్పటికే మీనన్ వచ్చి చంపుతానని బెదిరించాడని వదిన ఆందోళనపడుతోందని...ఇప్పుడు సురేష్‌ను కూడా కిడ్నాప్ చేశారని తెలిస్తే తట్టుకోలేదని అంటుంది. వాళ్లు మాట్లాడుకుంటుండగానే కౌషికి బయటకు వస్తుంది. ఎందుకు అందరూ అలా కంగారుగా ఉన్నారని అడుగుతుంది. ఏం లేదు భోజనాలు వద్ద ఏదో తక్కువ అయ్యాయని తెలిస్తే బయటకు వచ్చామని....నువ్వు లోపలకి వెళ్లి ఎంగేజ్‌మెంట్ పనులు చూడమని చెబుతుంది జగధాత్రి. కౌషికి నిజమేనని లోపలికి వెళ్లిపోతుంది. సురేష్‌ను ఎక్కడ కిడ్నాప్ చేశారో ఒకసారి చూపించమని జగధాత్రి అడగ్గా....ఇంటి ముందు బైక్ పడేసి అక్కడే సురేష్ చెప్పులు పడేసి సిద్ధంగా ఉంచుతారు నిషిక వాళ్లు. ఇక్కడే సురేష్‌ను కొట్టి తీసుకెళ్లారని చెబుతారు. వెంటనే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చూసి జగధాత్రి...ఆ ఫుటేజ్ చూస్తే మనకు ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసిపోతుంది కదా అని అంటుంది. ఈమాటలు వినగానే వైజయంతి గుండెల్లో రాయిపడ్డట్లు అనిపిస్తుంది. మన గోతిని మనమే తవ్వుకున్నామని అంటుంది. సీసీకెమెరాలు పరిశీలించేందుకు జగధాత్రి,కేదార్ వెళ్తారు.అయితే అంతకు ముందే కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నాయని తెలిసి షాక్‌కు గురవుతారు.నేనే సీసీ కెమెరాలు ఆపేశానని యువరాజు చెప్పడంతో నిషిక వాళ్లు సంతోషపడతారు. ఇప్పుడు ఏం చేద్దామని అనగా....మీరు వెళ్లి పోలీసులకు రిపోర్ట్ చేయండని వైజయంతి అంటుంది. మేము ఇక్కడ పనులన్నీ చూసుకుంటామని అంటుంది. దీంతో జగధాత్రి, కేదార్ హడావుడిగా పోలీసుస్టేషన్‌కు బయలుదేరతారు. మార్గమధ్యలో జగధాత్రికి అనుమానం వస్తుంది. సురేష్‌ను కిడ్నాప్ చేశారంటే ఓకే గానీ...మనం అందరం ఇంట్లో ఉండగా సీసీకెమెరాలు ఆఫ్‌చేసి మరీ కిడ్నాప్ చేయగలరా అని అంటుంది. అంటే ఖచ్చితంగా ఇది ఇంట్లోవాళ్ల పనేనని అంటుంది. పైగా ఉదయం సురేష్ వేసుకున్న చెప్పులు....అక్కడ బైక్ వద్ద కిందపడి ఉన్న చెప్పులు ఒకటి కాదని అంటుంది. దీంతో కేదార్‌కు కూడా అనుమానం బలపడుతుంది. ఖచ్చితంగా ఇంట్లో వాళ్లే సురేశ్‌ను దాచేశారని అంటుంది.ఆ అవసరం ఎవరికి ఉంటుందని అనగా...మనల్ని ఇలా బయటకు పంపించి శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్ చేయడం కోసమే నిషిక వాళ్లు ఈ పనిచేశారని అంటుంది. వెంటనే ఈ విషయం కౌషికి చెప్పేస్తానని అని ఫోన్ చేయగా....నిషిక చూసి ఆ ఫోన్ స్విచ్ఛాప్ చేస్తుంది. అటు ముహూర్తం సమయం దగ్గరపడటంతో ఎంగేజ్‌మెంట్ చేసేందుకు అందరూ సిద్ధమవుతారు. ఎలాగైనా ఎంగేజ్‌మెంట్ ఆపాలని కేదార్, ధాత్రి ఇంటికి బయలుదేరతారు.
