Jagadhatri Serial Today Episode : మీనన్ వెంటపడటంతో భయంతో పరుగులు తీస్తూ కౌషికి ఆమె భర్త సురేష్ ఇంటికి చేరతారు. ఇలా ఎందుకు కంగారుపడుతున్నారని వైజయంతి అడిగితే తర్వాత చెబుతామంటూ తమ రూమ్‌లోకి వెళ్లిపోతారు. అక్కడ మరోసారి వీడియో పరిశీలించిన కౌషికి మీనన్‌ రిటైర్డ్‌ జడ్జిని చంపడం స్పష్టంగా ఉంటుంది. ఫోన్ హ్యాక్‌ చేసి వీడియో డిలీట్‌ చేసే అవాకశం ఉందని వెంటనే ఈ ఫుటేజ్‌ పెన్‌డ్రైవ్‌లో సేవ్‌ చేయమని సురేష్ చెప్పడంతో కౌషికి వెంటనే ఆ వీడియోను పెన్‌డ్రైవ్‌లోకి సేవ్ చేస్తుంది. వెంటనే ఈ పెన్‌డ్రైవ్‌ పోలీసులకు  ఇద్దామని సురేష్‌ చెప్పగా...పోలీసుల్లో  కూడా మీనన్ మనుషుుల చాలా మంది ఉన్నారని ఎవరినీ నమ్మలేమని కౌషికి అంటుంది.మరి ఏం చేద్దామని అంటే రేపు మన ఛానెల్‌కు  సీఎం ఇంటర్వూ కోసం వస్తున్నారని అక్కడ ఆయన ముందే ఈ వీడియో ప్లే చేస్తానని అప్పుడు ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటారని...ఒకసారి వీడియో పబ్లిక్‌లోకి వెళ్లిందంటే మీనన్‌ కూడా ఏం చేయలేడని అంటుంది. ఇది మంచి ఆలోచన అని సురేష్‌ అంటాడు.                           కౌషికి తప్పించుకునిపోవడంతో మీనన్ వెంటనే యువరాజుకు ఫోన్ చేస్తాడు.మీ అక్క ఇంటికి వచ్చిందేమో చూడమని చెబుతాడు. ఎందుకని అడిగితే ముందు చూడమని హెచ్చరిస్తాడు.అక్క ఇంట్లోనే ఉందని చెప్పగా...నేను రిటైర్డ్ జడ్జి రమాకాంత్‌ను చంపుతుంటే మీ అక్క వీడియో తీసిందని...రేపు పొద్దుటి కల్లా  ఆ వీడియో నా చేతికి రాకపోతే  మీఇంట్లో అందరినీ చంపేస్తానని అంటాడు. దీనికి మా ఇంటికి ఏం సంబంధం ఉందని యువరాజు అంటే...నాకు కూడా మిమ్మల్ని చంపాలని లేదని...కాకపోతే ఆ వీడియో ఇవ్వకపోతే చంపాల్సి వస్తుందని అంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన జగధాత్రి, కేదార్‌కు కు మీనన్‌ ఫోన్ చేస్తాడు. నీ ఓటమి ఖాయమైంది జేడీ అంటూ బెదిరిస్తాడు. ఈ జేడీ ఎప్పుడూ ఓడిపోదని ధాత్రి సమాధానమిస్తుంది. నీ పతనం ఖాయమైందని హెచ్చరిస్తుంది. అసలు నీకు నాపై ఎందుకు ఇంత కక్షఅని మీనన్‌ అడుగుతాడు. నాకు తెలియకుండా నీఆస్తులు ఏమైనా మావాళ్లు లాక్కుంటే చెప్పు...తిరిగి ఇచ్చేస్తానని అంటాడు. నాకు చాలా విలువైనది కోల్పోయేలా చేశావని అందుకే నిన్ను వెంటాడుతున్నానని అంటుంది. అంత విలువైనది ఏంటని అడిగితే...సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.                              మీనన్‌ దగ్గర నుంచి ఫోన్ రావడంతో భయపడిపోయిన యువరాజు...వాళ్ల అక్కను పిలిచి అడుగుతాడు.మీనన్‌ జడ్జిని చంపుతుంటే నువ్వు వీడియో తీశావా అని నిలదీస్తాడు.అసలు ఆ విషయం నీకు ఎలా తెలిసిందని కౌషికి మండిపడుతుంది. మీనన్ ఫోన్ చేసి బెదిరించాడని..ఆ వీడియో తనకు ఇవ్వకుంటే మన ఇంట్లో అందరినీ చంపేస్తాని బెదిరించాడని...భాయ్‌ అంతపని చేస్తాడని యువరాజు అంటాడు.  ఆ వీడియో  ఏదో వాడి ముఖం మీద కొడదామని అంటాడు.దీనికి కౌషికి ససేమీరా అంటుంది. ఈ వీడియో ఇస్తే రమాకాంత్ చావుకు  అర్థం లేకుండా పోతుందని అంటుంది. నిజాన్ని మనం చంపేసినవాళ్లం అవుతామని అంటుంది. వైజయంతి,నిషికతోపాటు కమలాకర్‌ కూడా వీడియో ఇచ్చేయమని అంటారు. యువరాజు కూడా చెప్పినా కౌషికి ఇవ్వనని అంటుంది. జగధాత్రి కూడా మనం ఇలా భయపడబట్టే ఆ మీనన్‌ లాంటి వాళ్లు రెచ్చిపోతున్నారని....వీడియో ఇవ్వొద్దని చెబుతుంది. వీడియో ఇచ్చేది లేదని చెప్పి కౌషికి వెళ్లిపోతుంది. కౌషికి  దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌ ఎలా  కొట్టేయాలా అని యువరాజు, వైజయంతి, నిషికి ఆలోచిస్తుండగా....రేపు కౌషికి ఛానెల్‌కు వెళ్లేవరకు పకడ్బందీగా  రక్షణ కల్పించాలని ధాత్రి కేదార్‌కు చెబుతుంది. స్పెషల్ టీంను  పెట్టించమని సూచిస్తుంది.