Jagadhatri Serial Today Episode: దేవా ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్న జగధాత్రి,  కేదార్‌ అతన్ని పట్టుకునేందుకు బయలుదేరతారు. సాధూసార్‌ ఫోన్ చేసి దేవాను ప్రాణాలతో పట్టుకోవడం  ఎంతో అవసరమని...తప్పకుండా మీరు వాడిని పట్టుకుని రావాలని ఆదేశిస్తాడు. దీంతో ఊరు చివర బంగ్లాలో దేవాను దాచి ఉంచిన ప్రాంతానికి జేడీ, కేడీ వెళ్తారు. తన ఫొటో పట్టుకుని జేడీ ఊరంతా గాలిస్తుందన్న సంగతి తెలుసుకున్న దేవా చాలా భయపడిపోతాడు. గుడిలో బాంబులు పెట్టి పేల్చింది నేనే అన్న సంగతి జేడీకి తెలిసిపోయినట్లు ఉందని...అందుకే తన కోసం వెతుకుతోందని దేవా అంటాడు. జేడీ తనను కనిపెట్టేలోగా నేను దుబాయి పారిపోవాలని అనుకుంటాడు వెంటనే మీనన్‌కు ఫోన్‌ చేసి విషయం చెబుతాడు.  జేడీకి నేను ఎక్కడ ఉన్నానో తెలిసిపోయినట్లు ఉందని  వెంటనే నన్ను కాపాడమని వేడుకుంటాడు. మీనన్‌ దేవాకు ధైర్యం చెబుతాడు. దొంగ పాసుపోర్టు కోసం ట్రై చేస్తున్నానని...ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రంలోగా నిన్ను దుబాయి ప్లైట్‌ ఎక్కించే పూచీ నాదని అంటాడు.అప్పుటి వరకు నువ్వు ధైర్యంగా ఉండమని చెబుతాడు. ఇంతలో బంగ్లాలోకి ఎంటర్‌ అయిన జేడీ...రౌడీలను చితకబాది దేవా ముందుకు వచ్చేస్తుంది. అప్పటికే ఫోన్‌లైన్‌ ఉన్న మీనన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇక నీ ఓటమి ఖాయమైపోయిందని...నువ్వు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తుంది. దేవాకు ఏమైనా జరిగిందంటే నీ అంతు చూస్తానంటూ మీనన్‌ కూడా  దేవాకు వార్నింగ్ ఇస్తాడు. ఫోన్ కట్‌ చేసిన ధాత్రి, కేదార్‌తో ఓ నాటకం ఆడుతుంది. ఈ దేవాను మనం ఎంత హింసించినా  మీనన్‌ పేరు  చెప్పడని..అందుకే వీడిని ఇక్కడే ఎన్‌కౌంటర్ చేద్దామని చెబుతుంది. దీనికి కేదార్ కూడా సరేనంటాడు. దేవా తలకు గన్‌గురిపెట్టి కాల్చేందుకు ట్రే చేస్తుండగా అతను భయపడి మీనన్ గురించి నిజం చెప్పేస్తాని ఒప్పుకుంటాడు. దీంతో అతన్ని తీసుకుని నేరుగా ఈ కేసు విచారణ చేస్తున్న  హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్ రమాకాంత్‌ వద్దకు తీసుకెళ్లి నిల్చోబెడతారు.                         దేవా దొరికిపోవడంతో హోంమంత్రి చాలా కంగారుపడుతుంది. మీనన్‌ దగ్గరకు వచ్చి మన పని అయిపోయిందని అంటుంది.ఈ కేసు డీల్‌ చేస్తున్న రమాకాంత్‌ ఎవరికీ లొంగేరకం కాదని...అతని ముందు ఈ దేవా నీ పేరు చెప్పేస్తే ఇక మనం జైలుకు వెళ్లడం ఖాయమని అంటుంది. నేను అన్నీ చూసకుంటానని నువ్వు ఏమీ కంగారు పడొద్దని మీనన్‌ ఆమెతో అంటాడు.దేవా ఎట్టిపరిస్థితుల్లోనూ నోరు తెరవడని...రమాకాంత్ రేపు మధ్యాహ్నం కమిటీ ముందు హాజరై తన నివేదికన ఇవ్వబోతున్నాడని....అప్పట్లో  ఆ రమాకాంత్‌ను లేపేసి ఆ నివేదిక మన చేతికి వచ్చేలా చేస్తానని చెబుతాడు. ఆ తర్వాత దేవాను   బయటకు తీసుకొస్తానని అంటాడు. దీనికి నేను ముందే ప్లాన్ చేసి ఉంచానని చెప్పడంతో  హోంమంత్రి కొంచెం స్తితిమతపడుతుంది. రేపు కమిటీ ముందుకు వెళ్లేలోగా రమాకాంత్ చావు వార్త వింటావని చెప్పడంతో ఆమె వెళ‌్లిపోతుంది                                  ఇంట్లో ఉన్న జేడీ,కేడీలకు సాధూ సార్ ఫోన్ చేసి రమాకాంత్‌ను చంపేందుకు మీనన్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్‌ఫర్మేషన్ వచ్చిందని...కాబట్టి మీరిద్దరూ ఆయన  ఉండే గెస్ట్‌హౌస్‌ వద్దకు వెళ్లి సెక్యూరిటీ ఇవ్వాలని అంటాడు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా చాలామంది నేరగాళ్లు  దొరికే అవకాశం ఉందని కాబట్టి  ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయనకు ఏం జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తారు. తప్పకుండా మేం ఆయనకు రక్షణగా నిలుస్తామని జేడీ, కేడీ హామీ ఇస్తారు. 

Continues below advertisement

 

Continues below advertisement