Jagadhatri Serial Today Episode : శ్రీవల్లిని పెళ్లిచేసుకోవడానికి వచ్చిన రాజు బండారం బయటపెట్టేందుకు జగధాత్రి, కేదార్ ప్రయత్నిస్తుంటారు. రాజు పక్కనే కూర్చుని ఎక్కడ చదువుకున్నావు,అమెరికాలో ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావని ఆరా తీస్తుంటారు. వీళ్లు ఈ ఎంగేజ్‌మెంట్ చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారని నిషికకు అర్థమవుతుంది. రాజును అడిగే ప్రశ్నలకు ఆమె జవాబులిస్తూ కవర్ చేస్తుంది.ఇంతలో చికాగో యూనివర్సిటీలో చదువుకున్నానని చెప్పడంతో...మా ఫ్రెండ్ కూడా అక్కడే చదువుకున్నాడని వాడికి నువ్వు తెలిసే ఉంటావని చెప్పి కేదార్ తన ఫ్రెండ్‌కు ఫోన్ చేసి మాట్లాడిస్తాడు. రాజు దొరికిపోతాడేమోనని భయపడిన వైజయంతి రాజును పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. తిరుపతి నుంచి దేవుని కంకణం తీసుకొచ్చానని...దానిని ఎంగేజ్‌మెంట్ ముందే చేతికి కట్టుకోవాలంటూ రాజును అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది.
కౌషికి ఏమాత్రం తన మాటలకు భయపడకుండా ఇంట్లోనే ఎంగేజ్‌మెంట్ ఏర్పాట్లు చేయడంతో మీనన్ కోపంతో రగిలిపోతాడు.గన్ తీసుకుని సుధాకర్‌ను కాల్చేందుకు గురిపెట్టడాన్ని కౌషికి చూస్తుంది. ఆందోళనగా ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీస్తుంది.ఆమె వెంటే జగధాత్రి కూడా భయటకు రావడంతో మీనన్ దాక్కుంటాడు. బయటకు వచ్చిన జగధాత్రి ఏం జరిగింది వదినా అని అడగ్గా...నేను ఒక మాట చెబితే నువ్వు ఏమీ అనుకోనంటే చెబుతానని అంటుంది. ఏం జరిగిందో చెప్పమని ధాత్రి అనగా...నేను ఇక్కడ మీనన్‌ను చూశానని...గన్ పట్టుకుని ఇంట్లో ఎవరినో చంపడానికి ప్రయత్నిస్తున్నాడని చెబుతుంది.
చనిపోయిన మీనన్ ఎలా వస్తాడని ధాత్రి అనగా...అందుకే నేను ముందే చెప్పానని మీరు ఎవరూ నా మాటలు నమ్మరని కౌషికి అంటుంది. ఇక్కడికి మీనన్ వచ్చాడో రాలేదో తెలియదు కానీ....ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఉన్నారని ధాత్రి అంటుంది. ఆ షూ మార్కు చూస్తే ఇప్పుడే ఇక్కడి నుంచి ఎవరో వెళ్లారని అర్థమవుతోందని అంటుంది. వాళ్లు గేటు దాటి భయటకు వెళ్లే అవకాశం లేదని కావున ఇంట్లోనే ఉండి ఉంటారని వెతుకుదామని చెప్పి అంతా వెతుకుతుంది. అప్పుడే మీనన్ దాక్కున్న చోటుకు జగధాత్రి వస్తుండగా...కేదార్ వచ్చి పంతులుగారు పిలుస్తున్నారని చెప్పడంతో వెనక్కితిరిగి వెళ్లిపోతుంది.
శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా..ఇక దీన్ని ఎవరూ ఆపలేరని నిషిక ఆనందపడుతుంది. సరిగ్గా రాజు వేలికి ఉంగరం తొడిగే సమయంలో ధాత్రి కనుసైగ చేయడంతో శ్రీవల్లి స్పృహతప్పి పడిపోతుంది. దీంతో అందరూ కంగారుపడతారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండటం వల్ల కళ్లు తిరిగి పడిపోయి ఉంటుందని కేదార్ అంటాడు. ఇదంతా ఆ జగధాత్రి వేసిన ప్లాన్ అని నిషికకు అర్థమవుతుంది. శ్రీవల్లిని ఒళ్లో పడుకోబెట్టుకున్న జగధాత్రి...నీ ముఖంపై నీళ్లు చల్లినా నువ్వు లేవొద్దని చెవిలో చెబుతుంది. అప్పుడే మీనన్ మళ్లీ పోజిషన్ తీసుకుని సుధాకర్‌ను చంపేందుకు గన్ గురిపెడతాడు. శ్రీవల్లి పడిపోవడంతో రాజు కంగారుగా అటు ఇటు తిరుగుతుండగా....మీనన్ కాల్చిన బుల్లెట్ నేరుగా అతనికి తగులుతుంది.
దీంతో ఇంట్లో అందరూ భయపడిపోతారు. జగధాత్రి, కేదార్ బయటకు పరుగులు తీసేసరికి మీనన్ తన మనుషులతో అక్కడి నుంచి పారిపోతాడు. రాజును వెంటనే ఆస్పత్రికి తరలిస్తారు.మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో వాళ్లనే చంపే ధైర్యం ఎవరికి ఉందని జగధాత్రి కేదార్‌తో అంటుంది. మీనన్ మనుషులు ప్రతీకారం తీర్చుకుంటున్నారేమో అని అనగా....మీనన్ లేకుండా వాళ్లు మన ఇంటికి వచ్చే ధైర్యం చేయరని ధాత్రి అంటుంది.ఇంతకు ముందు కూడా వదిన మీనన్‌ను చూశానని చెప్పిందని అంటుంది.అంటే మీనన్ బతికే ఉన్నాడా అని కేదార్ అనడంతో ఈరోజు ఏపీసోడ్ ముగిసిపోతుంది.
