Jagadhatri  Serial Today Episode:  యువరాజ్‌, మీనన్‌ కు ఫోన్‌ చేసి డబ్బు ఆ జేడీ కళ్లముందు నుంచే డబ్బు తీసుకొచ్చానని అయినా ఆ జేడీ కనిపెట్టలేకపోయిందని చెప్తాడు. దీంతో మీనన్‌ హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు ధాత్రి, కేదార్‌ డబ్బు తీసుకుని యువరాజ్‌ వెళ్లిపోయాడేమో అనుకుంటారు. ఇంతలో సాధు ఫోన్‌ చేసి అప్డేట్‌ అడుగుతాడు. ఇంత వరకు ఈ రూట్లో డబ్బు రాలేదని ధాత్రి చెప్తుంది. అయితే యువరాజ్‌ ఏదో పెద్ద ప్లానే వేశాడని సాధు చెప్తాడు. అయితే యువరాజ్‌ తప్పించుకోవచ్చు కానీ ఆ డబ్బు ఎక్కడున్నా తీసుకొస్తామని చెప్తారు. తర్వత కౌషికి వచ్చి వినాయక చవితి వస్తుంది కదా? మనం ఇంట్లో విగ్రమం పెట్టి పూజలు చేద్దామని అడుగుతుంది. దీంతో వైజయంతి, నిషిక వద్దని అంటారు. నిష్టగా ఉండటం మా వల్ల కాదని అంటారు. రోజుకు రెండు సార్లు పూజ చేయడం మా వల్ల కాదని అంటుంది.


ధాత్రి: నేను చేస్తాను నిషి. వినాయకుడికి సంబంధించిన ప్రతి పని నేను దగ్గరుండి చేస్తాను.


వైజయంతి: ఎందమ్మీ నువ్వు చేసేది. ఉంటే పొద్దంతా ఇంట్లోనే ఉంటావు. బయటకు పోతే ఎక్కడికి పోయినావో తెలియదు. ఎప్పుడు వస్తావో తెలియదు. నిను నమ్ముకుంటే ఆ వినాయకుడితో పాటు మునిగేది మేమే కదా?


కాచి: ఒక పని చేద్దాం అక్కా చిన్న వినాయకుడిన ఇంట్లో ప్రతిష్టించి తర్వాత పెద్ద వినాయకుడి దగ్గర ఇచ్చేద్దాం.


వైజయంతి: కాచి కరెక్టుగానే చెప్పింది. అలాగే చెద్దాము.


కౌషికి: అలాగే పిన్ని..


బూచి: సిస్టర్‌ యువరాజ్‌ ఏంటి పొద్దట్నుంచి కనిపించడం లేదు. మా మేనమామ కూడా కనిపించడం లేదు. నిషిక: ఇప్పుడు ఆఫీసులో పెద్ద వినాయకుడిని పెడుతున్నారట. ఆ బిజీలో ఉన్నారు.


 అని నిషిక చెప్పగానే ధాత్రి, కేదార్‌ అనుమానంగా చూస్తారు. మరోవైపు కమలాకర్‌ వచ్చి సూపర్‌ యువరాజ్‌ మొత్తానికి సక్సెస్‌ అయ్యావు అని మెచ్చుకుంటాడు. ఇంకోవైపు ధాత్రి తను వినాయకుడి విగ్రహాన్ని విడిచిపెట్టింది గుర్తు చేసుకుంటుంది. ఆఫీసు సీసీ కెమెరాను కేదార్‌ చెక్‌ చేసి చూసి షాక్‌ అవుతారు. చేతి దాకా వచ్చిన విగ్రహాన్ని చేజార్చుకున్నాం అంటాడు కేదార్‌.  తర్వాత కేదార్‌, ధాత్రి తమ మాటలతో నిషికను రెచ్చగొట్టి యువరాజ్‌ ఫేక్‌ కరెన్సీ దాచిపెట్టిన వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తెప్పించేలా ప్లాన్ చేస్తారు. యువరాజ్‌ ఇంటికి రాగానే..


 


వైజయంతి: అబ్బోడా కరెక్టుగా భోజనం టైం కి వచ్చారు రండి భోజనం చేద్దురు.


నిషిక: యువరాజ్‌ ఆఫీసులో వినాయకుడి విగ్రహం పెట్టారట కదా? ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావా? ఇంటి ముందు ప్రతిష్ట చేద్దాం.   


కౌషికి: అదేంటి నిషి ఇందాక నువ్వే కదా వద్దన్నావు. పూజ చేసేవాళ్లు పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరన్నావు కదా.


నిషిక: మీరు ఎంతో ఆశగా అడిగారు. పైగా పూజ చేస్తే ఎంతో మంచిది అని నాక్కూడా ఇందాకే తెలిసింది. అందుకే వదిన ఈసారి ఆఫీసులో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి మన ఇంటి ముందు పెట్టి పూజ చేద్దాం అనుకుంటున్నా..


యువరాజ్: ఆఫీసులో ఉన్న విగ్రహం ఎందుకు నిషి. నీకు కావాలంటే కొత్త విగ్రహమే తెస్తాం.


నిషిక: ఆ కొత్త విగ్రహం తీసుకెళ్లి ఆఫీసులో పెట్టుకో.. ఆఫీసులో ఉన్న విగ్రహాన్ని ఇంటికి తీసుకురా?


కమలాకర్‌: అమ్మా నిషి నువ్వు ఎందుకు ఆఫీసులో ఉన్న విగ్రహమే కావాలని ఇంత పట్టు పడుతున్నావు.


 అనగాగే నాకు ఆ విగ్రహమే నచ్చింది మామయ్య. నువ్వు ఎం చేస్తావో నాకు తెలియదు యువరాజ్‌ నాకు  ఆ విగ్రహమే కావాలి.  అంటుంది. ప్రాణ ప్రతిష్ట చేస్తే విగ్రహం కదిలించకూడదు. కానీ ఇప్పటికీ ఇంకా చేయలేదు కదా అంటుంది ధాత్రి. దీంతో ఎవరు ఎన్ని చెప్పినా ఆ విగ్రహం తీసుకురాను అంటాడు యువరాజ్‌. నిషిక అలిగిపోతుంది. ఆ విగ్రహంలోనే ఫేక్‌ కరెన్సీ ఉందని నిర్దారించుకున్న ధాత్రి, కేదార్‌ రాత్రికి తమ టీంతో వెళ్లి అటాక్‌ చేస్తారు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?